Breaking News

తాజా వార్తలు

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు ఘన స్వాగతం

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహన్‌ ఆదివారం ఉదయం జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆర్‌అండ్‌బి అతిథిగహంలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జ్ఞాపకార్థం చీఫ్‌ జస్టిస్‌కు మొక్కను బహుకరించారు. అంతకుముందు జిల్లా సెషన్‌ జడ్జి శ్రీసుధ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, కామారెడ్డి జిల్లా ఎస్పి శ్వేత రెడ్డి జిల్లాకు చెందిన ఆయా కోర్టు జడ్జిలు రత్నప్రభ, గోవర్ధన్‌ రెడ్డి, గౌతమ్‌ ప్రసాద్‌ ...

Read More »

రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరిస్తాం

రెంజల్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో భూ ప్రక్షాళనలో జరిగిన పొరపాట్లు, పాసుపుస్తకాలలో పేర్లు మార్పిడి, భూమి హెచ్చు తగ్గుల గురించి నిత్యం కార్యాలయాల చుట్టూ తిరిగే రైతులకు ఇబ్బందులు కలుగకుండా నేరుగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామని బోధన్‌ ఆర్డీవో గోపిరామ్‌ అన్నారు. శనివారం రెంజల్‌ తహసీల్దార్‌ కార్యక్రమంలో భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించిన వివరాలను తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 95 శాతం భూ రికార్డుల ప్రక్షాళన పనులు పూర్తయ్యాయని ...

Read More »

ఎన్నికల నిబంధనలు పాటించాలి

రెంజల్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేయడానికి అధికారులు సహకరించాలని ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌ అన్నారు. రెంజల్‌ మండల కేంద్రంలోని మోడల్‌ పాఠశాలలో శనివారం జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల విధులు బాధ్యతలపై పిఓ, ఏపీవోలకు పలు సూచనలు చేశారు. పోలింగ్‌ సమయంలో ఓటు నమోదు ప్రక్రియలో లెక్కింపు ప్రక్రియను విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది, ఏజెంట్లు విధానాన్ని అధికారులు పాటించాల్సిన విధి విధానాలను వివరించారు. కార్యక్రమంలో ...

Read More »

తెరాస అభ్యర్థులను గెలిపించండి

బాన్సువాడ, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎంపిటిసి, జడ్పిటిసిలను అధిక మెజార్టీతో గెలిపించాలని బాన్సువాడ నియోజకవర్గ తెరాస నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలోని చందూరు మండలం కారేగాం, లక్ష్మాపూర్‌, మేడిపల్లి, లక్ష్మిసాగర్‌ తాండా తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోటీలో పాల్గొంటున్న అభ్యర్థుల తరఫున ఆయన ప్రజలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ...

Read More »

రంజాన్‌ సందర్భంగా ఇబ్బందులు రాకుండా చూడండి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పండుగ సందర్భంగా ప్రజలకు సదుపాయాలు కల్పించడంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో రంజాన్‌ ఏర్పాట్లపై సమావేశం ఏర్పాటు చేశారు. రంజాన్‌ పండుగ ఎండాకాలంలో వస్తున్నందున ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి మసీదు వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీరు, విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. పండ్లు, కూరగాయలు, ...

Read More »

ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి

ఆర్మూర్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలకు, విద్యార్థుల బలవన్మరణాలకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలని, గ్లోబరీనా సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టి యాభై కోట్లు జరిమానా వేసి ఆ మొత్తాన్ని బాదిత కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపి, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటిని ముట్టడించడానికి కార్యకర్తలు ప్రయత్నించగా ...

Read More »

అన్ని వర్గాల సంక్షేమమే తెరాస ద్యేయం

బీర్కూర్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమమే తెరాస, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్యేయమని బీర్కూర్‌ మాజీ జడ్పీటీసీ ద్రోణావల్లి సతీష్‌ అన్నారు. మే 10న జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బీర్కూర్‌ ఆర్య వైశ్య సంఘంలో ప్రచారసభ ఏర్పాటు చేశారు. అంతకు ముందు కుర్మ యాదవులు, ఎరుకలి సంఘం సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ...

Read More »

ప్రచార సభ విజయవంతం చేయండి

బీర్కూర్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జరిగే పోచారం భాస్కర్‌ రెడ్డి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని మాజీ జడ్పిటిసి ద్రోణవల్లి సతీష్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీర్కూర్‌ గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో సభాపతి తనయుడు, యంగ్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌ దేశాయిపేట సొసైటీ ఛైర్మెన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొంటున్నారని అన్నారు. ముందుగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించి అనంతరం గాంధీ చౌక్‌లో భారీ సభ ఉంటుందన్నారు. ప్రచార కార్యక్రమంలో అన్ని ...

Read More »

పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మొదటి విడత లో జరుగు నిజామాబాద్‌ డివిజన్‌ ఎంపీటీసీ జెడ్‌పిటిసి ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ సిబ్బంది ర్యాండ మైజెషన్‌ (నియామక) ప్రక్రియ జిల్లా పరిశీలకులు అభిలాష్‌ బిస్ట్టు సమక్షంలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పూర్తి చేశారు. మొదటి విడత చివరి ర్యాండమైజేషన్‌ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో మొదటి విడత నిజామాబాద్‌ డివిజన్లో 8 జడ్పిటిసిలకు ఎంపీటీసీలకు ...

Read More »

ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్ట ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మొదటి దశలో నిజామాబాద్‌ డివిజన్లో జరుగు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఏలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా జరిగేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం నిజామాబాద్‌ డివిజన్‌లోని ధర్పల్లి, సిరికొండ మండలాలలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులకు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ధర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ వివరాలను ...

Read More »

సామాగ్రి పంపిణీలో లోపాలు ఉండకూడదు

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో జడ్పీటిసి ఎంపిటిసి ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు శుక్రవారం పరిశీలించారు. పోలింగ్‌కు సంబంధిన అవసరమైన పత్రాలు, సామాగ్రి పంపిణీ లోటుపాట్లు ఉండకూడదని అర్‌ఓకు ఆదేశాలు జారీచేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో త్రాగునీరు. టెంట్‌, ఓఅర్‌యస్‌ ప్యాకెట్లు, వికలాంగులకు వీల్‌చేర్లు లాంటి వసతులు తప్పని సరిగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by ...

Read More »

సర్వీసు ఓట్లను స్కాన్‌ చేయాలి

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సర్వీస్‌ ఓట్లకు పంపించిన ఈ పోస్టల్‌ బ్యాలెట్‌లను స్కాన్‌ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ సాంకేతిక అధికారి వి.ఎన్‌.శుక్ల తెలిపారు. శుక్రవారం ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ఎలక్షన్‌ అధికారులు జిల్లా ఎన్నికల అధికారులతో ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ గురించి శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ కు వచ్చిన ఫారం 13 మొదటగా స్కానింగ్‌ చేయాలని ఆ తర్వాత ...

Read More »

కార్మికులకు 8500 వేతనం అమలు చేయాలి

ఆర్మూర్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టియు మండల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రధాన కార్యదర్శి (ఐఎఫ్‌టియు) దాసు పాల్గొని ప్రసంగించారు. సఫాయి కార్మికులు నిజమైన దేవుడని సెల్యూట్‌ కొట్టిన కేసిఆర్‌ కార్మికులు నెల రోజుల సమ్మె చేస్తే నెలకు రూ.8500 వేతనం ఇస్తామని ప్రకటించి నేటికి అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. పరిసరాల పరిశుభ్రతలో పంచాయతీ కార్మికులు ప్రధాన పాత్ర నిర్వహిస్తూ, ప్రజారాజ్యం ...

Read More »

ఆగ్రో ఫారెస్ట్రీ మిషన్‌ ద్వారా రైతుల గుర్తింపు

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగ్రో ఫారెస్ట్రీ మిషన్‌ ద్వారా ఎంపిక చేయబడిన మొక్కలను పెంచడానికి రైతులను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్లో జిల్లాస్థాయి ఆగ్రో ఫారెస్ట్రీ మిషన్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ మిషన్‌ ద్వారా వెదురు, టేకు, గంధపు మొక్కలు, సరుగుడు పెంచడానికి రైతులను ప్రోత్సహించడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెట్ల ...

Read More »

ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తోంది

ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తోంది? మన తెలుగు అక్షరాలలో ‘అమ్మ’లో ‘అ’లా ఉంది కదా ! కానీ ఇది ఆస్ట్రేలియాలో పిల్లల ఆసుపత్రి దగ్గర ఉన్న భవంతి పైన చిహ్నం. తల్లి బిడ్డను హదయానికి హత్తుకున్నట్లుగా చూపిన పాశ్చాత్యుల భావన. మనం తెలుగులో నేర్చుకునే మొదటి మాట అమ్మలో ‘అ’ కి ఎంత అద్భుతంగా ఇమిడిపోయిందో కదా! అదీ మన తెలుగు గొప్పతనం. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">