Breaking News

తాజా వార్తలు

ఉచిత మెగా వైద్య శిబిరం

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో శనివారం శ్రావ్యగార్డెన్స్‌లో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొద్దుటూరి సదానందరెడ్డి, మనోరమ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీటిలో బిపి, షుగర్‌, థైరాయిడ్‌, స్త్రీ సంబంధిత వ్యాధులు, కీళ్ళ నొప్పులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్‌ పరీక్షలతో పాటు ఇతర అన్ని సూపర్‌ స్పెషాలిటి సర్వీసులను ఉచితంగా అందించారు. అదేవిధంగా కంటి ...

Read More »

ధూపల్లి మహాజనసభను బహిష్కరించిన రైతులు

– డైరెక్టర్లు హాజరుకాని సభలెందుకని కార్యదర్శిని నిలదీత రెంజల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దూపల్లి సొసైటీ మహాజనసభను శనివారం రైతులు బహిష్కరించారు. సొసైటీ పాలకవర్గ సభ్యులు హాజరుకాని సభలెందుకు నిర్వహించాలంటూ కార్యదర్శిని జీవన్‌రెడ్డి నిలదీశారు. సభ ప్రారంభమై పలు రకాల ఖర్చులు, జమలు వివరిస్తుండగా మొత్తం చదివేంత వరకు ఓపికతో వివరిస్తుండగా మొత్తం చదివేంత వరకు ఓపికతో విన్న రైతులు ఒక్కసారిగా కార్యదర్శి తీరుపై విసుకుపడి సభ వాయిదాకు పట్టుబట్టి తీర్మానం చేయించారు. గత రబీ సీజన్‌లో ...

Read More »

తెరాసను గల్లంతు చేయడం ఖాయం

రెంజల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికార తెరాస పార్టీ రానున్న ముందస్తు ఎన్నికల్లో నూకలు చెల్లక గల్లంతు కావడం ఖాయమని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆరోపించారు. శనివారం మండలంలోని సాటాపూర్‌ చౌరస్తాలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా జడ్పిటిసి నాగభూషణంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సాయారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై కేసులు బనాయించి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రేవంత్‌రెడ్డిని ఎదర్కొనే దమ్ము ధైర్యం లేకనే ...

Read More »

నిరుద్యోగుల కొరకు యువశక్తి అభియాన్‌

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువతీ యువకుల కొరకు కాంగ్రెస్‌ పార్టీ యువశక్తి అభియాన్‌ అనే పథకాన్ని తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రామకృష్ణ అన్నారు. శనివారం దర్పల్లి మండలంలో నిర్వహించిన యువశక్తి అభియాన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో నిరుద్యోగ యువత పేర్లను నమోదు చేసుకున్నారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ యువశక్తి అభియాన్‌ ఉద్దేశం ఉత్తమ విద్యనుంచి మంచి ఉద్యోగం ప్రతి యువకుని హక్కు అని ...

Read More »

మంత్రి కెటిఆర్‌ వ్యాఖ్యలు అర్ధరహితం

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఆపద్దర్మ మునిసిపల్‌ శాఖ మంత్రి కెటిఆర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త అన్నారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మంత్రి కెటిఆర్‌ ఓసభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సహాయసహకారాలు అందడం లేదని అన్నారని, ఇది ఆయన రాజకీయ నైపుణ్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ...

Read More »

మహిళలు పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు పౌష్టికాహార విషయంలో ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యకరంగా ఉండాలని ఐసిడిఎస్‌ ఆర్‌ఓ బంగారు నవనీత అన్నారు. శనివారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 49 శాతం మంది మహిళలకు లోపపోషణతో బాధపడుతున్నారని ఆమె అన్నారు. పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రధానంగా రక్తహీనత ఏర్పడి మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పౌష్టికాహారం విషయంలో శ్రద్ద వహించాలని, అలాగే కిషోర ...

Read More »

ఓటు వినియోగంపై బదిరులకు వారి భాషలో అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు వినియోగంపై బదిరులకు వారి భాషలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌ సమావేశమందిరంలో సంబంధిత అధికారులు, హెచ్‌పిడి పాఠశాల సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బదిరులకు అర్థమయ్యే విధంగా సంజ్ఞలతో అవగాహన కల్పించాలని, ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చినపుడు వారి ఓటరు కార్డు, గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు వారికి పంపినీ చేసిన చీటి, ఓటరు జాబితాలో వారి ...

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

రెంజల్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కళ్యాపూర్‌ గ్రామానికి చెందిన సయ్యద్‌ హుస్సేన్‌ నెలరోజుల క్రితం విద్యుత్‌షాక్‌తో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి బోధన్‌ తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్‌ బుధవారం రూ. 50 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. హుస్సేన్‌ కుటుంబానికి అండగా తెరాస పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఆయన వెంట మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు దనుంజయ్‌, రైతు సమన్వయసమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు, జలయ్య, సాయిలు, రాఘవేందర్‌ ఉన్నారు.

Read More »

ఆశీర్వదించండి – అభివృద్ది చేసి చూపిస్తా

రెంజల్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్దిని చూసి ఆదరించి ఆశీర్వదించండి మరోసారి అవకాశం కల్పిస్తే మళ్లీ అభివృద్ది చేసి చూపిస్తా అని తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అన్నారు. బుధవారం రెంజల్‌ మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేయని అభివృద్దిని 4 సంవత్సరాలలో చేసి చూపిన ఘనత తెరాస పార్టీకే దక్కుతుందన్నారు. అభివృద్ది అంటేనే తెరాస అని ఆయన ...

Read More »

వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం

రెంజల్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల ప్రయోజనం కోసం ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రెంజల్‌ ప్రాథమిక సహకార సంఘం ఛైర్మన్‌ మోహినుద్దీన్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఛైర్మన్‌ మోహినోద్దీన్‌ అధ్యక్షతన మండల మహాజన సభ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ముందుగానే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి ...

Read More »

బీడీ కార్మికులకు కూలీరేట్లు పెంచాలి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికులకు కూలీ రేట్లు పెంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీడీ కార్మికులు ఉన్న జిల్లా నిజామాబాద్‌ అని, పరిశ్రమపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు చేతినిండా పనిదొరక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం బీడీ పరిశ్రమల యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరించడంతోపాటు కార్మికుల కూలీరేట్లు, వేతనాలు సకాలంలో ...

Read More »

ఈవిఎంల పరిశీలన ప్రారంభం

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాకు చేరిన ఈవిఎంల తనిఖీ ప్రారంభమైందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. మంగళవారం ఈవిఎం గోదాముల్లో వాటి పనితీరుపై ఆయా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిదులకు ప్రత్యక్షంగా ప్రయోగాత్మకంగా చూపించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థ బిఇఎల్‌ తయారుచేసిన యంత్రాలు కొత్త సాంకేతికతతో తయారయ్యాయని అన్నారు. ప్రతి యంత్రాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, ఈ యంత్రాలు అతి సున్నితమైనవని అధిక ఉష్ణోగ్రతకు తట్టుకోలేవని తెలిపారు. ఏ నెంబరు యంత్రం ఏ ...

Read More »

ఐకెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌

రెంజల్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చభారత్‌ మిషన్‌ కార్యక్రమం చేపట్టి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఐకెపి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని గ్రంథాలయం వద్ద మహిళలు స్వచ్చభారత్‌ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎంపిడివో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ 150వ జయంతి, స్వచ్చభారత్‌ కార్యక్రమం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వచ్చతాహి సేవ పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. గ్రంథాలయ లైబ్రేరియన్‌ రాజేశ్వర్‌, సిసి శ్యామల, సాక్షరభారత్‌ ...

Read More »

ఘనంగా పండిత్‌ దీనదయాళ్‌ జయంతి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ సిద్దాంతకర్త పండిత్‌ దీన్‌దయాళ్‌ 120వ జయంతిని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ దీనదయాళ్‌ ఏకాత్మతా మానవతా వాదం సిద్దాంతంతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని, ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వరకు అందితేనే నిజమైన స్వరాజ్యం అని బోధించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా మోడి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. బిజెపిలో క్రమశిక్షణ కొనసాగుతుందంటే కారణం పండిత్‌ దీనదయాళ్‌ సూచించిన ...

Read More »

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఆకుల లలిత మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నందిపేట మండలం ఖుదావన్‌పూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ మైనార్టీ నాయకులు ఎమ్మెల్సీని కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం మండలంలోని ముల్లంగి గ్రామంలో పర్యటించి పార్టీ అంశాలపై స్థానిక నాయకులతో చర్చించారు. మోపాల్‌ మండలంలోని ముదక్‌పల్లి గ్రామంలో ఎమ్మెల్సీ నిదులతో మంజూరైన ముదిరాజ్‌ సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. ఇందుకు రూ. 3 లక్షలు మంజూరుచేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు తాహెర్‌, ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">