Breaking News

తాజా వార్తలు

హామీల అమలులో తెరాస విఫలం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హామీల అమలులో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్‌ అర్బన్‌ బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ ఆరోపించారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కెసిఆర్‌ ఏ కారణం లేకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా వందలకోట్ల భారం ప్రజలపై మోపారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 203 కోట్ల రూపాయలు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం మంజూరు చేయించానని, అదేవిధంగా 145 కోట్లు యుజిడి ...

Read More »

మాక్‌ పోలింగ్‌కు ఏజెంట్లను సన్నద్దం చేసుకోవాలి

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ రోజు ఉదయం 6 గంటలకే ఈవిఎం, వీవీప్యాట్‌ మాక్‌ పోలింగ్‌ జరిపేందుకు ఉదయం 5.45 గంటలకే పోలింగ్‌ ఏజెంట్లను సన్నద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం తన చాంబరునుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎలక్టోరల్‌ జాబితా, ఈవిఎం, వీవీప్యాట్‌, మాక్‌పోలింగ్‌, వెబ్‌ కాస్టింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌పై సమీక్షించారు. సలహాలు, సూచనలు ఇచ్చారు. ...

Read More »

ఒకటవ డివిసిన్ లో బిగాల విస్తృత ప్రచారం

నిజామాబాద్ తెరాస అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా ఆదివారం నగరంలో విసృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీ, మారుతి నగర్, ఇంటింటికి ఎన్నికల ప్రచారన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రజలు ముందుకొచ్చి స్వాగతం పలుకుతూ విధులలో రోడ్లు ఈరోజు ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు వేయించారు అని సంతోషం వ్యక్తం చేస్తూ మళ్లి తిరిగి TRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కి మద్దత్తు తెలుపుతూ కేసీఆర్ సర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేస్తాం అని తెలియజేశారు.తిరిగి ...

Read More »

యెండల కు మద్దతు గా న్యాయవాదులు ప్రచారం

నిజామాబాద్ బిజెపి అర్బన్ బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీ నారాయణ కీ మద్దతు గా జిల్లా కేంద్రం నికి చెందిన పలువురి న్యాయవాదులు ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఏ సందర్భంగా కేంద్రం ప్రభుత్వ పథకాలు ప్రజలు కు వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. నిజామాబాద్ అర్బన్ అబ్యర్థి యెండల లాక్షిణరాయన ను బారి మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Read More »

మహాత్రిపుర సుందరి అమ్మవారికి అభిషేకం

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని శ్రీసీతారామచంద్ర ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో కార్తీకమాస పర్వకాలాన్ని పురస్కరించుకొని ఆదివారం మహా త్రిపుర సుందరి అమ్మవారికి పసుపుకొమ్ములతో అభిషేకం నిర్వహించారు. సహస్రనామ పారాయణ యుక్తంగా గోపూజ చేశారు. ఆంజనేయ శర్మ, శ్రవణ్‌ శర్మ, వినోద్‌శర్మ, రామశర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గబ్బుల బాలయ్య, శ్రీనివాస్‌, విజయ్‌కుమార్‌, దామోదర్‌, ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

యెండల లక్ష్మీనారాయణ విస్తృత ప్రచారం

ఎన్నికల ప్రచార పాదయాత్ర ఈ రోజు 41,44,49 వ డివిజన్ లలో ఇంటింటికి విస్తృతంగా జరిగింది. ఈ సందర్భంగా బిజెపి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి యెండెల లక్ష్మినారాయణ గారు మాట్లాడుతూ ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని, బిజెపి గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటిగా మార్చడమే బిజెపి లక్ష్యం అని అన్నారు. నగరంలో నిరుపేద ప్రజలందరికీ ఇండ్లు కట్టించండమే తన ద్వేయం అని ప్రజలంతా నా పట్ల విశ్వాసంతో ఉన్నారు. నగరంలో నేలకోన్న ట్రాఫిక్ సమస్యకు ...

Read More »

గడీల దొరల పాలనను తరిమికొట్టండి

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గడీల దొరల పాలనను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి పిలుపునిచ్చారు. ఆమె ఆదివారం బాన్సువాడ, దోమకొండ, బీబీపేట్‌ తదితర ప్రాంతాల్లో రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు సంక్షేమం కోసం తెరాసకు అధికారం కట్టబెడితే ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాలుగున్నరేళ్లకే చేతులెత్తేసి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఆనాడు కెసిఆర్‌తో కలిసి ఉద్యమాలు చేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కనీస విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ...

Read More »

తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న మార్పు బిజెపితోనే సాద్యం

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పు బిజెపి ద్వారానే సాధ్యపడుతుందని జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోడి నాయకత్వంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కెసిఆర్‌ పాలనను విసిగి వేసారిన ప్రజలు బిజెపికి అభివృద్ది చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్ర పథకాలను ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రజల చెంతకు చేరకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రధానమంత్రి ...

Read More »

పోలీసుల కవాతు

రెంజల్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి, వీరన్నగుట్ట, దూపల్లి గ్రామాల్లో ఆదివారం పోలీసులు కవాతు నిర్వహించారు. గ్రామాల్లోని పలు వీదుల గుండా కవాతు నిర్వహించారు. త్వరలో జరగనున్న ముందస్తు ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ముందుగా గ్రామాల్లో ర్యాలీని బిఎస్‌ఎప్‌ జవాన్లతో నిర్వహించారు. కవాతులో సిఐ షకీల్‌ అలీ, ఎస్‌ఐ శంకర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

రూరల్‌ నియోజకవర్గంలో బాజిరెడ్డి విస్తృత ప్రచారం

– నీరాజనాలు పలుకుతున్న ప్రజలు – గెలుపుబాటలో బాజిరెడ్డి నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ తెరాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతు ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం డిచ్‌పల్లి మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి బాజిరెడ్డి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు బాజిరెడ్డిని హారతులతో స్వాగతం పలుకుతూ గెలుపునకు పునాదులు వేస్తున్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ...

Read More »

అల్జాపూర్‌ శ్రీనన్నను ఆదరించండి

రెంజల్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు, బలహీన వర్గాలనేత అల్జాపూర్‌ శ్రీనన్నను ఆదరించి ఆశీర్వదించి బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ అన్నారు. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్తి అల్జాపూర్‌ శ్రీనివాస్‌కు మద్దతుగా శుక్రవారం దూపల్లి, కూనేపల్లి, కల్యాపూర్‌, వీరన్నగుట్ట గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి చేసిందేమి లేదని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ...

Read More »

ఆశీర్వదించండి – అభివృద్ది చేసి చూపిస్తా

రెంజల్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు ఆశీర్వదించి ఆదరిస్తే అభివృద్ది చేసి చూపిస్తానని తెరాస బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్తి షకీల్‌ అన్నారు. రెంజల్‌ మండలంలోని కందకుర్తి, నీలా వీరన్నగుట్ట, కళ్యాపూర్‌, కూనేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో శుక్రవారం పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో తెరాస పార్టీ ఎప్పుడు ముందుంటుందని ప్రజలు ఆశీర్వదించి తిరిగి తెరాసని గెలిపిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తామన్నారు. తెరాస పార్టీ నాలుగున్నరేళ్లలో అన్ని విధాలుగా ...

Read More »

మహాకూటమికే ఎంఆర్‌పిఎస్‌ మద్దతు

రెంజల్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితులను మోసం చేసిన తెరాస పార్టీని రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఓడించి తీరుతామని ఎంఆర్‌పిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల హామీలను తుంగలో తొక్కి అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీని ఓడించి తీరుతామని వర్గీకరణకు మద్దతు తెలిపిన మహాకూటమికే ఎంఆర్‌పిఎస్‌ మద్దతు ఉంటుందని బోదన్‌ ఎమ్మెల్యేగా మహాకూటమి బలపర్చిన అభ్యర్తినే గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ...

Read More »

బాన్సువాడకు కేంద్ర మంత్రి రాక

బాన్సువాడ, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కేంద్ర మంత్రి సాద్వి నిరంజన్‌ జోషి బాన్సువాడకు రానున్నారు. భారతీయ జనతాపార్టీ అభ్యర్థి నాయుడు ప్రకాశ్‌ తరఫున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Read More »

మోడి పాలనలో అభివృద్ధి పథాన భారతదేశం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోడి పాలనలో బారతదేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుదేశ్‌ వర్మ అన్నారు. శుక్రవారం జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్మ మాట్లాడారు. భారతదేశ అభివృద్ది కొరకు నిరంతర సైనికునిలా మోడి కష్టపడుతున్నారని, ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గౌరవిస్తున్నాయని, ఒకప్పుడు భారతదేశం అంటే ఇతర దేశాలకు చిన్నచూపు ఉండేదని అన్నారు. మోడి పాలనలో నల్లధనం వెలికితీయడం జరుగుతుందని, ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">