Breaking News

Tag Archives: Banswada

వ్యవసాయ ఉత్పత్తుల‌ కొనుగోలుకు రూ. 30 వేల‌ కోట్లు

బాన్సువాడ, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్‌ మండల‌ కేంద్రం, కోటగిరి మండలంలోని పోతంగల్‌, కోటగిరి, రాయకూర్‌ గ్రామాల‌లో సన్‌ ఫ్లవర్‌ గింజల‌ కొనుగోలు కేంద్రాల‌ను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. స్పీకర్‌ వెంట ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ఉన్నారు. వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘాల‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల‌లో ప్రభుత్వ మద్దతు ధరతో రైతుల‌ నుండి నేరుగా సన్‌ ఫ్లవర్‌ ...

Read More »

లాక్‌ డౌన్‌ పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలు, లాక్‌ డౌన్‌ నేపధ్యంలో ప్రజల‌ కష్టసుఖాల‌ను తెలుసుకోవడానికి బాన్సువాడ పట్టణంలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం పర్యటించారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి, ఇతర అధికారులు, ముఖ్యమైన ప్రజాప్రతినిధుల‌తో కలిసి బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారి, కాల‌నీలో స్పీకర్‌ పర్యటించారు.   ఈ సందర్భంగా కాల‌నీలో స్పీకర్‌ మాట్లాడుతూ సమర్ధవంతమైన చర్యల‌తో ...

Read More »

పోచారం ట్రస్టు ద్వారా ఉచిత బియ్యం

బాన్సువాడ, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిదిలోని పేదవారు ఒక్కరూ కూడా అన్నం లేక ఆకలితో బాదపడకూడదని, తెల్ల‌ రేషన్‌ కార్డు లేని పేదల‌ను గుర్తించి పోచారం ట్రస్ట్‌ ద్వారా ప్రతి కుటుంబానికి 25 కిలోల‌ బియ్యాన్ని ఉచితంగా అందిస్తానని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో బుధవారం స్పీకర్‌ విలేకరుల‌తో మాట్లాడారు. పనులు లేక పేదలు, కూలీలు కుటుంబం గడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ...

Read More »

బాసరకు పాదయాత్ర

బాన్సువాడ, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సరస్వతి మాల ధారణ స్వాముల బాసర పాద యాత్రను సరస్వతి ఆలయ ధర్మకర్త పోచారం శంభు రెడ్డి మంగళవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. మాల ధారణ స్వాములతో పాటు బాన్సువాడ ఎంపీపీ నీరజ రెడ్డి కూడా స్వాములతో పాదయాత్రలో పాల్గొంటూ బాసర వెళ్లనున్నారు. మంగళవారం రాత్రి వరకు బోధన్‌ చేరుకొని అక్కడ రాత్రి బసచేసి బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించి, సాయంత్రం వరకు బాసర చేరుకుంటామని ...

Read More »

విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే

బాన్సువాడ, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్‌లో ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌ నూతన సంవత్సర క్యాలెండర్‌ను బాన్సువాడ ఎంపీపీ నీరజ వెంకట్రామ్‌ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే భాద్యత ఉపాద్యాయులపైన ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. పిల్లలకు ప్రాధమిక స్థాయి నుండే నైతిక విలువలు, క్రమశిక్షణ కలిగిన మంచి విద్యార్థులుగా తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రావణ్‌, ఎంపీటీసీ రమణ, పిఆర్‌టియు నాయకులు పాల్గొన్నారు.

Read More »

సోమవారం ఆశ్రమ పాఠశాల భవన ప్రారంభోత్సవం

బాన్సువాడ, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11వ తేదీ సోమవారం కామారెడ్డి జిల్లా నసురల్లాబాద్‌ మండల కేంద్రంలో రూ. 4.20 కోట్లతో నిర్మించిన ఎస్‌టి గురుకుల ఆశ్రమ పాఠశాల నూతన భవనాన్ని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం ఉంటుందని నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

Read More »

కస్తూర్బా పాఠశాల తనిఖీ

బాన్సువాడ, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కెజివిపి కొత్తబాధి పాఠశాలను ఎంపిపి దొడ్ల నీరజ వెంకట్‌ రాం రెడ్డి పరిశీలించారు. మధ్యాహ్నం కెజివిపి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయగా పప్పులో పురుగులు ఉండడంతో ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్టాక్‌ రిజిస్టర్‌ మూడు నెలల నుండి నిర్వహించడం లేదని, సరకులు నాసిరకంగా పురుగులు పట్టి ఉన్నాయని గమనించారు. విషయం డిఈఓకు ఫోన్‌లో వివరించారు. ఆమె వెంట తిర్మలాపూర్‌ సర్పంచ్‌ రఘు, మల్లారెడ్డి, సాయిలు, ఎంఈ ఓ తదితరులు ఉన్నారు.

Read More »

విదేశీ పర్యటనకు స్పీకర్‌

బాన్సువాడ, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అధికారిక విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఆఫ్రికా ఖండంలోని ఉగాండా దేశ రాజధాని కంపాల నగరంలో జరుగుతున్న కామన్వెల్త్‌ దేశాల 64వ స్పీకర్ల సమావేశంలో పాల్గొనడానికి బుధవారం తెల్లవారుజామున శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరుతారు. కామన్వెల్త్‌ దేశాల స్పీకర్ల సమావేశంలో పాల్గొన్న అనంతరం యూరప్‌ లో పర్యటిస్తారు. అనంతరం అక్టోబర్‌ 6 న పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వస్తారు. ...

Read More »

సుభాష్‌రెడ్డి ఆర్థిక సాయం

బాన్సువాడ, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజక వర్గం నాగిరెడ్డిపేట్‌ మండలం రామక్కపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన గణేష్‌ నిమజ్జనంలో ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌తో బాలయ్య అనే యువకుడు మతి చెందిన విషయం తెలిసిందే. కాగా దాసరి బాలయ్య కుటుంబాన్ని సుభాష్‌రెడ్డి స్వచ్చంద సేవా సమితి ప్రతినిదులు పరామర్శించారు. వారికి ఇద్దరు పిల్లలు బీద కుటుంబం..ఆ ఇద్దరు పిల్లలు కూడా అంగవైకల్యంతో బాధపడుతున్నారు. విషయం తెలిసి కుటుంబానికి సుభాష్‌ రెడ్డి స్వచ్చంద సేవా సమితి ద్వారా రూ. 5 ...

Read More »

స్పీకర్‌ను కలిసిన యూనియన్‌ నాయకులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం అనుసంధాగా ఏర్పాటైన ది నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల యూనియన్‌ జిల్లా నాయకులు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని బాన్సువాడ స్వగహంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఉద్యోగుల ప్రమోషన్లు, సహకార వ్యవస్థలో రెండంచెల విధానాలపై వినతిపత్రం సమర్పించారు. రెండంచెల విధానం వల్ల ఇటు రైతులకు అలాగే ఉద్యోగులకు మేలు జరుగుతుందని వారు స్పీకర్‌కు వివరించారు. ఉద్యోగస్తుల వినతిపత్రాన్ని స్వీకరించిన ...

Read More »

వసతి గృహాన్ని తనిఖీ చేసిన స్పీకర్‌

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఎస్‌సి బాలికల కాలేజి హాస్టల్‌ను తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అకస్మీకంగా తనిఖీ చేశారు. ఉదయం అల్పాహారం సమయంలో హాస్టల్‌కు వెళ్లిన స్పీకర్‌ విద్యార్ధినుల కోసం వండిన పదార్ధాలను పరిశీలించారు. మేను ప్రకారం గురువారం వండిన ఉప్మాను పరిశీలించిన స్పీకర్‌ అందులో వాడాల్సిన పప్పు దినుసులు లేకపోవడం, రుచిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో ఇలాగే వండుతారా, మీ పిల్లలకు ఇలాగే తినిపిస్తారా ...

Read More »

భావితరాల మేలు కోసం మొక్కలు

బాన్సువాడ, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యసభ సభ్యులు జె. సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ చాలంజ్‌ను స్వీకరిస్తూ బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో శనివారం దేశాయిపేట పిఏసిఎస్‌ అధ్యక్షులు, తెరాస పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి మొక్కటు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ భావితరాల మేలుకోసం మొక్కలను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సమద్ధిగా వర్షాలు కురవాలన్నా, స్వచ్ఛమైన గాలి లభించాలన్నా మొక్కలను నాటాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు అవి ...

Read More »

అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్‌

బాన్సువాడ, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసరుల్లాబాద్‌ మండలం దుర్కి గ్రామ పరిదిలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ సోమలింగేశ్వర ఆలయం వద్ద రూ. 27 లక్షలతో నూతనంగా నిర్మాణం చేసిన కళ్యాణమండపం, రూ.10 లక్షలతో ఇతర వసతులు, రూ. 25 లక్షలతో మిషన్‌ భగీరధ పథకం ద్వారా మంచినీటి సౌకర్యాలను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు తెరాస నేతలు, అదికారులు పాల్గొన్నారు.

Read More »

శరవేగంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం

బాన్సువాడ, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఎస్‌సి కాలనీలో నూతనంగా నిర్మించిన 40 రెండు పడక గదుల ఇళ్లను శనివారం రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించి, లబ్ధిదారుల ఇళ్ళలో పాలు పొంగించి గహప్రవేశం చేయించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం సాగుతోందని, ఇళ్ళు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని స్పీకర్‌ అన్నారు. వంద ...

Read More »

రక్తనిది కేంద్రభవనాన్ని ప్రారంభించిన స్పీకర్‌

బాన్సువాడ, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో రక్తనిది కేంద్ర భవనాన్ని తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కామారెడ్డి కలెక్టర్‌ సత్యనారాయణ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Read More »

తెలంగాణకు హరితహారం

బాన్సువాడ, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించనున్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి మహిళ హాస్టళ్ల స్థలాన్ని తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం హరితహారంలో బాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. తెలంగాణకు హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మారుద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, నాయకులు ఉన్నారు.

Read More »

ఇంటింటికి కాంగ్రెస్‌

బాన్సువాడ, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఆదేశానుసారం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి కాంగ్రెస్‌, వాడ వాడ కాంగ్రెస్‌ జెండా కార్యక్రమం నిర్వహించనున్నారు. బాన్సువాడ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ కాసుల బాలరాజు ఆధ్వర్యంలో శనివారం నుంచి 30వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని రాజీవ్‌ గాంధీ చౌరస్తా వద్ద జెండా ఎగురవేసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కాసుల బాలరాజు మాట్లాడుతూ మున్సిపాలిటీ స్థాయికి అభివద్ధి చెందినా, సౌకర్యాలు మాత్రం ...

Read More »

పింఛన్లు పంపిణీ

బాన్సువాడ, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆసరా పింఛన్లు రూ. 2016, వికలాంగులకు రూ. 3016 బాన్సువాడ పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు.

Read More »

బోనమెత్తిన స్పీకర్‌

బాన్సువాడ, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీలో నూతనంగా నిర్మించిన కనకదుర్గ ఆలయంలో బోనాల ఉత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయం ఇటీవలే నిర్మించి ప్రారంభించారు. కాగా ఆదివారం కాలనీవాసులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో బోనాల పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. మహిళలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ పూజారి భాస్కర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి

బాన్సువాడ, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సంక్షేమం కోసం పాటుపడేవారే ప్రజా నాయకులు అవుతారని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ది పథకాల గురించి వివరించారు. సర్పంచ్‌ మొదలుకొని శాసనసభ్యుని వరకు ప్రజా సంక్షేమం ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. సంక్షేమం, అభివృద్ది పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం తాగు, సాగునీటి రంగాలకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. మిషన్‌ ...

Read More »