Breaking News

Tag Archives: bodan

వార్డు అభివృద్దికి పాటుప‌డ‌తా…

బోధ‌న్‌, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బోధన్ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కౌన్సిలర్ ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. బెంజర్ గంగారాం ను కమిషనర్ రామలింగం ప్రమాణ స్వీకారం చేయించారు. భారత రాజంగ్య సాక్షిగా దేశసార్వ భౌమాధికారన్ని దృష్టిలో ఉంచుకొని సమగ్రతను కాపాడుతనని కర్రోళ్ల గంగారాం సభాముఖంగా ప్రమాణం చేశారు. చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి, వైస్ చైర్మన్ సోహెల్, ముఖ్య నాయకులు వి ఆర్ దేశాయ్, టీఆర్ఎస్‌ శ్రేణులు నూతన కౌన్సిలర్‌ను సన్మానించారు. బోధన్ మునిసిపాలిటీ 18 ...

Read More »

దేశానికే అన్నం పెడుతున్న రైతుకు అప్పులు-ఉరి తాళ్ళూ!

బోధ‌న్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతు పంటల కు అవసర మయ్యే 20:20 ,డీఏపీ ,అన్ని కాంప్లెక్స్ ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ బోధన్ పట్టణం లోని ఆర్డీవో కార్యాలయం ముందు అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఏంఎస్) బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యం లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఏంఎస్ జిల్లా నాయకులు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ ప్ర‌స్తుత‌ కరోనా విజృంభన సమయం లో ప్రజలందరూ ...

Read More »

బోధన్‌లో న‌ల్ల‌జెండాల‌తో ప్రదర్శన

బోధన్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐకేఎస్‌సీసీ పిలుపు మేరకు బోధన్‌ పట్టణంలో సీపీఐ (ఎం- ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో న‌ల్ల‌ జండాల‌తో అంబేద్కర్‌ చౌరస్తాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి మల్లేష్‌ మాట్లాడుతూ ఈ రోజుకు (2021 మే 26) రైతు సంఘాలు సంయుక్తంగా డిల్లీని చుట్టి వేసి రైతులు చేస్తున్న ఆందోళనకు 6 నెల‌లు (180 రోజులు) గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం ...

Read More »

బోధన్‌లో లాక్‌ డౌన్‌ కఠినతరం

బోధన్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజమాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో లాక్‌ డౌన్‌ను కఠినతరం చేసిన పోలీసులు బైక్ ల‌పై తిరుగుతూ ప్రజలెవరు బయటకి రావద్దని హెచ్చరించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనదారుల‌ను చెదర గొట్టారు. బోధన్‌ ఏసీపీ రామారావు నేత ృత్వంలో పకడ్బందీ చర్యల‌ను పోలీసులు చేపడుతున్నారు. బోధన్‌ పట్టణం ఆచన్‌ పల్లి, శక్కర్‌ నగర్‌, పోస్ట్‌ ఆఫీసు, రాకాసిపెట్‌ గుండా పోలీసులు బైక్‌ ర్యాలీ చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపార షాపుల‌ను మూసివేయించారు. లాక్‌ డౌన్‌ సమయంలో ...

Read More »

బెడ్లు, ఆక్సీజన్‌ కొరత లేకుండా చూడాలి

బోధన్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాల‌యంలో నియోజకవర్గ వైద్యారోగ్య అధికారుల‌తో కరోనా పరిస్థితుల‌పై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే షకీల్‌ నిర్వహించారు. ప్రజల‌కు కరోనా సౌకర్యాలు గ్రామస్థాయిలో కూడా కల్పించాల‌ని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని మెడికల్‌ ఆఫీసర్లకు సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల‌ గురించి ఆరా తీశారు. కరోనా రోగుల‌కు బెడ్లు మరియు ఆక్సిజన్‌ కొరతలేకుండా చూడాల‌న్నారు. బ్లాక్‌ ఫంగస్‌తో ప్రజల‌కు ఇబ్బందులు రానివ్వద్దని డాక్టర్లకు ...

Read More »

కొనసాగుతున్న జ్వర సర్వే

బోధన్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం శాసనసభ్యులు ఎండీ. షకీల్‌ ఆమ్మేర్‌ ఆదేశాల‌ మేరకు బోధన్‌ మండలం కుమ్మన్‌ పల్లి, కొప్పర్తి క్యాంపు గ్రామంలో ఇంటింటి జ్వరం సర్వే జరుగుతున్న తీరును ఎన్‌డిసిసిబి బ్యాంక్‌ డైరెక్టర్‌ గిర్దవర్‌ గంగారెడ్డి, మాజీ రైసస మండల్‌ కోఆర్డినేటర్‌ బుద్దె రాజేశ్వర్‌లు పరిశీలించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేయంటువంటి విధముగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఏఎన్‌ఎం, అంగన్వాడీ టీచర్‌, ఆశవర్కర్‌ గ్రామ కార్యదర్శితో టీం లు ఏర్పాటు చేసి ...

Read More »

పేదల‌కు ఉచిత వైద్యం చేయాలి

బోధన్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కరోనా సోకిన ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరియైన వైద్య సేవ‌లు అందక ప్రైవేట్‌ కార్పొరేటు హాస్పిటల్‌కు వెళ్ళితే, రోగుల‌ ప్రాణ భయ బల‌హీనతల‌ను ఆసర చేసుకొని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, అందుకే హెల్త్‌ ఎమర్జెన్సీగా పరిగణించి, ప్రైవేట్‌ హాస్పటల్‌ను ప్రభుత్వం స్వాదీనం చేసుకొని ప్రజలందరికి ఉచిత వైద్య సేవ‌లు అందించాల‌ని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. ఐఎఫ్‌టీయూ తెలంగాణ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మంగళవారం బోధన్‌ పట్టణం ...

Read More »

నెల‌కు 7,500 రూపాయల‌ ఆర్థిక సహాయం ఇవ్వాలి

బోధన్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్ వల‌న కార్మికులు, వల‌స కార్మికులు, చిన్న వ్యాపార వర్గాలు తీవ్ర ఇబ్బందులు పాలు అవుతున్నారని, కావున ప్రజల‌కు నెల‌కు రూ. 7,500 లు ఆర్థిక సహాయం, 50 కిలోల‌ బియ్యం ఇవ్వాల‌ని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. ఐఎఫ్‌టీయూ తెలంగాణ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు సోమవారం కరోనా మరియు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ నిబంధన ప్రకారం బోధన్‌ ...

Read More »

కోవిడ్‌ సేవల‌పై నిరంతర పర్యవేక్షణ

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఊహించకుండానే విరుచుకుపడి ప్రజల‌ను భయాందోళనకు గురిచేస్తూ ప్రాణాలు తీస్తున్న కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల‌ మేరకు మంత్రిగా తాను, జిల్లా కలెక్టర్‌ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని సేవల‌ను మెరుగు పరచడంతో పాటు సదుపాయాల క‌ల్ప‌నకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి ఆర్మూర్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రుల‌లోనూ ...

Read More »

పటిష్ట మైన బందోబస్తు ఏర్పాట్లు

బోధన్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌లో వార్డ్‌ నెంబర్‌ 18 శ్రీనివాస్‌ నగర్‌ కాంప్‌, ధ్యాకం గల్లీలో ఈనెల‌ 30 న జరిగే మున్సిపాలిటి బై ఎల‌క్షన్‌ పోలింగ్‌ కేంద్రాల‌ వద్ద మరియు రాకాసి పేట్‌ వద్ద గల‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద తీసుకోవల‌సిన పటిష్ట బందోబస్తు మరియు భద్రత చర్యల‌ గురించి నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పరిశీలించారు. అనంతరం తీసుకోవల‌సిన జాగ్రత్తల‌ గురించి సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీచేశారు. సిపి వెంట ...

Read More »

27న ప్రచారం ముగించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 30 వ తేదీన బోధన్‌ మున్సిపాలిటీ లోని 18 వ వార్డ్‌కు ఎల‌క్షన్‌ జరగనున్నందున రాష్ట్ర ఎన్నికల‌ కమిషన్‌ ఆదేశాల‌ మేరకు 72 గంటల‌ ముందుగా అనగా 27వ తేదీ సాయంత్రం 5 గంటల‌ లోగా ప్రచారం ముగించాల‌ని స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్ ల‌త తెలిపారు. శనివారం రాష్ట్ర ఎన్నికల‌ కమిషనర్‌ పార్థసారధి మున్సిపల్‌ ఎన్నికలు జరిగే జిల్లా అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారని, ఈ సందర్భంగా పోటీచేసే అభ్యర్థులు ...

Read More »

బోధన్‌ ప్రాంత ప్రజలు అల‌ర్ట్‌

బోధన్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వ‌ల్ల‌ బోధన్‌ ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాల‌ని, అవసరమైతేనే బయటకు రావాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కోరారు. బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్‌ సోమవారం తనిఖీ చేశారు. కరోనా రోగుల‌కు అందుతున్న వైద్య సేవల‌ గురించి అడిగి తెలు‌సుకున్నారు. మహారాష్ట్రలో కరోనా విజ ృంభణ అధికంగా ఉందని తెలిపారు. బోధన్‌ ప్రాంతానికి మహారాష్ట్రతో సత్సంబంధాలు ఎక్కువగా ఉండటం వ‌ల్ల‌ అక్కడి నుంచి తరచూ అనేక మంది ...

Read More »

కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలి

బోదన్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం వారి ఆధ్వర్యంలో కోవిడ్‌ 19 నిబంధనలు ప్రజలు అందరూ తప్పనిసరిగా పాటించాల‌ని బోధన్‌ టౌన్‌ పరిధిలోని బస్టాండ్‌, అంబెడ్కర్‌ చౌరస్తా, పాతబస్టాండ్‌, ఫ్రూట్‌ మార్కెట్‌, దుకాణ యాజమానుల‌కు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బోధన్‌ టౌన్‌ సిఐ రామన్‌, పోలీస్‌ కళాబృందం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read More »

నిజామాబాద్‌లో బార్లు దక్కించుకున్న వారు వీరే…

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో నిజామాబాద్‌ కార్పొరేషన్‌ 7 బార్లకు, బోధన్‌ మునిసిపాలిటీలో 3 బార్లకు కొత్తగా నోటిఫై చేయబడిన బార్లకు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి దరఖాస్తు దారుల‌ సమక్షంలో శనివారం నిజామాబాద్‌ జిల్లా ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ కార్యాల‌యంలో డ్రా తీసినట్టు సంబంధిత అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో విజేతలు… 1. బండి దయానంద్‌ : టోకెన్‌ నెంబర్‌ 3 2. కె.సతీష్‌ : టోకెన్‌ నెంబర్‌ 9 3. బి.రాజు ...

Read More »

బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీని పరిశీలించిన కలెక్టర్‌

బోధన్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి బుధవారం బోధన్‌ నిజాం దక్కన్‌ షుగర్‌ ఫ్యాక్టరీని సందర్శించి పరిశీలించారు. ఫ్యాక్టరీలోని యంత్రాల‌ను, కెపాసిటీ ఆల్క‌హాల్‌ తయారీ, షుగర్‌ ఫ్యాక్టరీ రా మెటీరియల్‌ మిషనరీ గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీకి సంబంధించి బయట లోపల గల‌ ఆస్తుల ‌వివరాల‌ గురించి వివరాలు అడిగారు. కలెక్టర్‌ వెంట ఆర్‌డిఓ రాజేశ్వర్‌, ఫ్యాక్టరీ ఇన్‌చార్జి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ముగిసిన బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

బోధన్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఉదయం 9:30 గంటల‌ నుండి మధ్యాహ్నం 2 గంటల‌ వరకు జరిగాయి. మొత్తం 86 ఓట్లకు గాను, 78 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షునిగా వీ.ఆర్‌. దేశాయ్‌ ఎన్నిక కాగా, ఉప అధ్యక్షుగా సయ్యద్‌ అప్సర్‌ పాషా ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కోటేశ్వరరావ్‌ ఎన్నిక కాగా, సంయుక్త కార్యదర్శిగా సమ్మయ్య ఎన్నికయ్యారు. కోశాధికారిగా వాజీద్‌ హుస్సేన్‌ ఎన్నికయ్యారని ఎన్నికల‌ ...

Read More »

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ పథకాల‌ను చూసి పట్టభద్రుల‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల‌కు పట్టం కట్టారని మాజీ రైతు బంధు మండల కోఆర్డినేటర్‌ బుద్దె రాజేశ్వర్‌ తెలిపారు. పట్టభద్రుల‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణిదేవి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డిల‌ను ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సాలూరలొ తెరాస నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. బస్టాండ్‌ వద్ద బాణా సంచా పేల్చి మిఠాయిలు పంచుకొన్నారు. ...

Read More »

ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది

బోధన్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ పాల‌నలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌ అన్నారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌ ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రయివేటికరణ, కార్పోరేటికరణ వ్యతిరేక దినంగా నిరసన కార్యక్రమాలు చేయాల‌ని కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయని, దాంట్లో భాగంగానే నిరసన కార్యక్రమమన్నారు. కేంద్రంలోని మోడి నాయకత్వంలోని బీజేపీ పార్టీ ప్రభుత్వ రంగ ...

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

బోధన్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూరు గ్రామంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ బుద్దె సావిత్రి, సీనియర్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు బుద్దే రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో గ్రామంలోని హనుమాన్ ఆల‌యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాదు జిల్లాలోని అనేక చోట్ల గత కొన్ని సంవత్సరాల‌ నుంచి పేద ప్రజల‌కు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఎంతో మందికి ఉత్తమ సేవ‌లు అందిస్తున్న ఎమ్మెల్సీ కవిత సేవ‌లు ...

Read More »

బార్లకు భారీగా దరఖాస్తులు

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యందు నోటిఫై చేయబడి డ్రా వాయిదా పడిన 11 బార్లకు దరఖాస్తుల‌ స్వీకరణ శనివారంతో ముగిసింది. 1.నిజామాబాద్‌ కార్పొరేషన్‌ 7 బార్లకు గాను 23 దరఖాస్తులు 2. ఆర్మూరు మున్సిపాలిటీ 1 బార్లకు గాను 16 దరఖాస్తులు 3. బోధన్‌ మున్సిపాలిటీ 3 బార్లకు గాను 9 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ అధికారి డాక్టర్‌ నవీన్‌ చంద్ర తెలిపారు. ఈనెల‌ 8వ తేదీ సోమవారం ఉదయం ...

Read More »