Breaking News

Tag Archives: cm kcr

30న క్యాబినెట్ స‌మావేశం

హైద‌రాబాద్‌, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఈ నెల 30 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలో వ్యవసాయం, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు, కరోనా, లాక్ డౌన్ తదితర అంశాల మీద క్యాబినెట్ చర్చించనున్నది.

Read More »

సీఎం కేసీఆర్ కు దత్తాపూర్ దళిత కుటుంబాల రైతుల లేఖలు

ఆర్మూర్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మంత్రి ఈటెల రాజేందర్ విషయంలో రైతులు రాసిన లేఖలతో సీఎం కేసీఆర్ రెవెన్యూ యంత్రాంగాన్ని విచారణ చేయాలని ఆదేశించినట్టుగానే, నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం దత్తపూర్ గ్రామ శివారులో గల వ్యవసాయ భూమి విషయంలో కూడా విచారణ చేపట్టాలని ఎమ్ఆర్ పిఎస్ జిల్లా అధ్యక్షులు బాలు గురువారం డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలం దత్తపూర్ గ్రామంలో ఉన్న 24 ఎకరాల భూమిని స్థానికం గా లేని వేరే ...

Read More »

వృద్ధ కళాకారుల పెన్షన్ రూ. 3016 కు పెంపుద‌ల‌

హైద‌రాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం తెలంగాణ రాష్ట్రం లో వృద్ధ కళాకారులకు 1500 వందల రూపాయల నుండి రూపాయలు 3016 కు వృధ్యాప్య పెన్షన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కి రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. పెంచిన వృద్ధ కళాకారుల పెన్షన్లు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 – 2021 నుండి కళాకారులకు వర్తింపజేయాలని ప్రభుత్వం ...

Read More »

స‌మ్మె విర‌మించి విధుల్లో చేరాలి

హైద‌రాబాద్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జూనియర్ డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల పట్ల ఏనాడూ వివక్ష చూపలేదని వారి సమస్యలను పరిష్కరిస్తూనే వున్నదని ఇప్పుడు కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నదని సీఎం స్పష్టం చేశారు. బుధ‌వారం ప్రగతి భవన్లో వైద్యశాఖ అధికారులతో రాష్ట్రంలో కరోనా ...

Read More »

కేసీఆరే నా నిండు ప్రాణం…

హైదరాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటల‌కు ఎంజీఎం దవాఖానకు చేరుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నేరుగా కోవిడ్‌ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగుల‌ను పరామర్శించారు. కోవిడ్‌ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్‌ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్‌ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్‌ జిందాబాద్‌ కేసీఆరే ...

Read More »

లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేయండి

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల‌ కోట్ల నష్టాన్ని భరించడానికి సిద్ధమై ప్రజల‌ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విధించిన లాక్‌ డౌన్‌ పకడ్బందీగా అమల‌య్యేలా పోలీస్‌ శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాల‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశించారు. శుక్రవారం ఆయన వరంగల్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వితో కలిసి రాష్ట్ర డిజిపి మహేందర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌తో ...

Read More »

నకిలీ వాగ్దానాలు, తప్పుడు వాదనలు సరికావు…

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎం కెసిఆర్‌ తప్పుడు వాదనలు చేస్తూ, కోవిడ్‌ను అరికట్టడంలో నిర్వహిస్తున్న వైఫల్యాల‌ను కప్పిపుచ్చడానికి నకిలీ వాగ్దానాలు చేస్తున్నారని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ ఆలీ షబ్బీర్‌ విమర్శించారు. ప్రజల‌ను తప్పుదోవ పట్టించడానికి మరియు కోవిడ్‌ -19 పరిస్థితిని నిర్వహించడంలో తన ప్రభుత్వ వైఫల్యాల‌ను కాపాడటానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ కోవిడ్‌ -19 పరిస్థితిని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వైఫల్యాల‌ను హైకోర్టు ఎత్తిచూపినప్పుడల్లా సిఎం కెసిఆర్‌ ఒక సమీక్ష సమావేశం ...

Read More »

ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాం…

హైదరాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల‌ భగత్‌కు ఆశీర్వచనమిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్‌ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్‌ హృదయపూర్వక కృతజ్జతలు, ధన్యవాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని సీఎం తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్‌తో పాటు నాగార్జున సాగర్‌ నియోజక వర్గం సందర్శించి ప్రజల‌ సమస్యల‌న్నీ పరిష్కరిస్తామని సీఎం స్పష్టం చేశారు. దేవరకొండ, నాగార్జున సాగర్‌, మిర్యాల‌గూడ, హుజూర్‌ నగర్‌, కోదాడ ...

Read More »

సిఎం కెసిఆర్ కీల‌క నిర్ణయం తీసుకున్నారు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా అనూహ్యంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల‌కు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తేవడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు యుద్ధ ప్రాతిపదికన మరో కీల‌క నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగుల‌కు మెరుగైన వైద్యం అందేలా 114 దవాఖానాల్లో సరిపోను సిబ్బందిని నియమించాల‌ని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 144 మంది డాక్టర్లు, 527 మంది నర్సులు, 84 మంది లాబ్‌ టెక్నీషియన్లు, మొత్తం 755 పోస్టుల‌ను ...

Read More »

నిల‌కడగా సిఎం ఆరోగ్యం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకి సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో సిటి స్కాన్‌ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సీఎం వ్యక్తిగత వైద్యులు ఎం.వి. రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షల‌ను నిర్వహించారు. సీఎం ఊపిరితిత్తులు సాధారణంగా వున్నాయని, ఎటువంటి ఇన్‌ఫెక్షన్‌ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల‌ నిమిత్తం కొన్ని రక్త నమూనాల‌ను సేకరించారు. రక్త పరీక్షల‌కు సంబంధించిన రిపోర్టులు రేపు రానున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిల‌కడగా వుందని, ...

Read More »

ప్రైవేటు పాఠశాల‌ల సిబ్బందికి గుడ్‌న్యూస్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా పరిస్థితుల‌ దృష్ట్యా తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణయం తీసుకున్నారు. ప్రయివేటు పాఠశాల‌ల సిబ్బందికి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో విద్యాసంస్థల‌ను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలల‌ ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం ప్రకటించారు. నెల‌కు రూ.2 వేల‌ ఆపత్కాల‌ ఆర్థిక సాయం, రేషన్‌ దుకాణాల‌ ద్వారా 25 కిలోల‌ బియ్యం అందివ్వాల‌ని సీఎం నిర్ణయించారు. గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంక్‌ అకౌంట్‌ ...

Read More »

250 యూనిట్ల వరకు నాణ్యమైన ఉచిత విద్యుత్తు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్షవర వృత్తి శాలల‌కు (కటింగ్‌ షాపుల‌కు), లాండ్రీ షాపుల‌కు, దోభీఘాట్లకు నెల‌కు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాల‌ని సీఎం కె. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్జప్తుల‌ను పరిశీలించిన మీదట సీఎం నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకు సంబంధించి తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా సీఎంఓ కార్యదర్శి భూపాల్‌ రెడ్డికి సీఎం ఆదేశించారు. ...

Read More »

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

బాన్సువాడ, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర రావు చిత్ర పటానికి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార బ్యాంక్‌ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి మంగళవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల‌ ద్వారా యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయడానికి అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా రైతులు ...

Read More »

సభా స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని జక్కాపూర్‌ గ్రామ శివారులో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా సభావేదిక, హెలిప్యాడ్‌ స్థలం పనుల‌ను జుక్కల్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సభావేదిక పనుల‌ను త్వరితగతిన పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మాజీ సీడీసీ చైర్మన్‌ దుర్గారెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గైని విఠల్‌, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, మండల‌ సర్పంచ్ల‌‌ సంఘం ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి చెప్పుల‌ దండ

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌.ఎస్‌.యూ.ఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్‌.టి.ఆర్‌ చౌరస్తా వద్ద కే.సీ.ఆర్‌ చిత్ర పటానికి చెప్పుల‌ దండ వేసి పిండ ప్రదానం చేశారు. సిఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌.ఎస్‌.యూ.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణు రాజ్‌ మాట్లాడుతూ ఉద్యోగుల‌కు 30 శాతం పీ.అర్‌.సీ పెంచి, వయో పరిమితిని 61 సంవత్సరాల‌కు పెంచడం వ‌ల్ల‌ యాభై వేల‌ నుండి ల‌క్షల‌ మంది ఉద్యోగులు ఇంకా 3 ...

Read More »

నిరుద్యోగుల‌ను నిండా ముంచిన ఘనత కేసీఆర్‌దే

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి, ల‌క్షలాది ఉద్యోగాలు వస్తాయి అని భావించిన నిరుద్యోగుల‌కు కన్నీళ్లు , ఆత్మహత్యలే మిగిలాయని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు ఆరోపించారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ నుండి ఆంధ్ర ఉద్యోగుల‌ను తరిమి కొడదామని, రాష్ట్రం వస్తే ల‌క్షలాది ఉద్యోగాలు వస్తాయని, ఉద్వేగ ప్రసంగాల‌తో యువకుల‌ను నిరుద్యోగుల‌ను రెచ్చగొట్టి రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేకపోవడంతో రాష్ట్రంలోనే ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ...

Read More »

సిఎం ఏ మొక్క నాటారో తెలుసా…

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీఎం కేసిఆర్‌ జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ వినతి మేరకు సీఎం కేసిఆర్‌ కోటి వృక్షార్చనలో స్వయంగా పాల్గొని రుద్రాక్ష మొక్క నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్‌ కుమార్‌ ...

Read More »

సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి

హైదరాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సష్టించడంతో పాటు, నాగార్జున సాగర్‌ ఆయకట్టును కూడా కలుపుకుని పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును అత్యంత ముఖ్యమైనదిగా భావించాలని సీఎం అన్నారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి గురువారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, వేముల ప్రశాంత్‌ ...

Read More »

రిజిస్ట్రేషన్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధన ఎత్తివేత

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలగినట్లయింది. రిజిస్ట్రేషన్‌ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్‌ కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని కొత్త ప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతి నిరాకరించింది. అనుమతులు ఉన్న, క్రమబద్ధీకరణ అయిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 41 వార్డ్‌కు చెందిన సాజిద బేగం అనే మహిళకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందజేశారు. నియోజకవర్గంలో రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 506 మందికి 3 కోట్లల 28 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ...

Read More »