Breaking News

Tag Archives: Cm

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గిర్నీ తండాలో సర్పంచ్‌ చందర్‌, నాయకులు రెడ్యానాయక్‌, గ్రామస్తులు అందరూ కసి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టు లోకి నీరు చేరడంతో హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోనే గ్రామాల‌ అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవల‌, రాము, అబ్బార్‌ సింగ్‌, ...

Read More »

2న మాక్లూర్‌కు సిఎం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాక్లూరు రానున్నందున జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం వారు సంబంధిత అధికారులతో కలిసి మాక్లూర్‌ మండల కేంద్రంలో పర్యటించి హెలిప్యాడ్‌, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిజాంబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బీగాల గణేష్‌ గుప్తా యొక్క తండ్రి మరణించినందున ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి రానున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అధికారులు ...

Read More »

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

బాన్సువాడ, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గం, బాన్సువాడ పట్టణంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క‌ల్వ‌కుంట్ల చంద్రశేకర్‌ రావు రైతుల‌ కోసం రైతు బంధు పెట్టుబడి కోసం 7 వేల‌ కోట్ల రూపాయలు విడుదల‌ చేసిన శుభ సందర్భంలో బాన్సువాడ పట్టణంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి సిఎం చిత్రపటానికి, రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ...

Read More »

సిఎం మతిభ్రమించి మాట్లాడుతున్నారు…

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, అసెంబ్లీ సాక్షిగా పారాసెట్మాల్‌ టాబ్లెట్‌ వేసి కరోనా కట్టడి చేయచ్చు అంటాడా అని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ప్రశ్నించారు. మంగళవారం భిక్కనూరు మండల‌ కేంద్రంలో ఏఎన్‌ఎం నర్సుల‌కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. డాక్టర్లకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని శాలువాలు కప్పి సన్మానించారు. గర్గుల్‌ గ్రామంలో 7 గ్రామాల‌ ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ ...

Read More »

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంసాగర్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ రైతుల‌కు 25 వేల‌ రూపాయల‌ లోపు అప్పు ఉన్నవారికి ఒకేసారి రుణమాఫీ డబ్బును విడుదల‌ చేసిన సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్‌ రాంసింగ్‌, కల్హేర్‌ జడ్పీటీసీ నర్సిహ్మారెడ్డి ఆధ్వ‌ర్య‌లో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌ రెడ్డి ఆదేశాల‌మేరకు కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు కళ్ళలో ఆనందం చూస్తే కడుపునిండినట్టు ఉందని వారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కొఆప్షన్‌ సభ్యులు అలీ, వైస్‌ ఎంపిపి నారాయణ రెడ్డి, మండల‌ కోఆప్షన్‌ ఘనీ, ...

Read More »

ల‌లితా జ్యువెల్ల‌ర్స్‌ కోటి రూపాయల‌ విరాళం

హైదరాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వ్యాప్తి నివారణకు, లాక్‌ డౌన్ వ‌ల్ల‌ ఇబ్బంది పడుతున్న పేదల‌ను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల‌కు సహాయంగా ఉండడం కోసం ల‌లితా జ్యువెల్ల‌ర్స్‌ కోటి రూపాయల‌ విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును ల‌లిత జ్యువెల్ల‌ర్స్‌ సిఎండి డాక్టర్‌ ఎం.కిరణ్‌ కుమార్‌ సీఎంకు అందించారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రభుత్వాల‌కు కూడా చెరో కోటి రూపాయల‌ విరాళం అందిస్తున్నట్లు కిరణ్‌ కుమార్‌ తెలిపారు.

Read More »

డిమాండ్ల సానుకూలతపై టిఎన్జీవోస్‌ నాయకుల హర్షం

నిజామాబాద్‌ టౌన్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్లను సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్ణయంపై టీఎన్జీవోస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి టీఎన్జీవోస్‌ రాష్ట్ర నాయకులు కారం రవీందర్‌రెడ్డి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి టీఎన్జీవోస్‌ల 18 ప్రధాన డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన శుభసందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్‌ కార్యాలయంలో అధ్యక్షుడు కిషన్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత ...

Read More »

మహిళలకు ప్రాధాన్యత ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

  నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గీతారెడ్డి ఆరోపించారు. మంగళవారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తన క్యాబినెట్‌లో ఒక్క మహిళను కూడా మంత్రిగా నియమించలేదని, ఇది మహిళా సమాజానికి అవమానకరమని, దేశ వ్యాప్తంగా పలు రాస్ట్రాల్లో మహిళలు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారని అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మంత్రి ...

Read More »

బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక శాతం నిధులు కేటాయించాలి

  గాంధారి, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చివరి బడ్జెట్‌ సమావేశంలోనైనా విద్యారంగానికి 30 శాతం నిదులు కేటాయించాలని పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ నాయక్‌, ప్రేమ్‌సింగ్‌ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి విద్యారంగానికి సవతి తల్లిప్రేమ చూపిస్తుందన్నారు. కనీసం ఈ చివరి బడ్జెట్‌ సమావేశంలోనైనా విద్యారంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు విద్యారంగానికి ఎన్నో హామీలిచ్చినా తెరాస పార్టీ కెజి ...

Read More »

చెక్కుల పంపిణీ

  కామారెడ్డి, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలో ఆరుగురు బాధిత కుటుంబాలకు సిఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా మంజూరైన చెక్కులను గురువారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తన నివాసంలో అందజేశారు. వివిధ రోగాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్సపొంది దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి చెక్కులను అందించారు.   ట్రాక్టర్‌ పంపిణీ మాచారెడ్డి మండలంలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన ఓ లబ్దిదారునికి గురువారం సబ్సిడీపై ట్రాక్టర్‌ను అందజేశారు.   కార్యక్రమాల్లో నాయకులు ప్రేమ్‌కుమార్‌, బల్వంత్‌రావు, పిప్పిరి ఆంజనేయులు ...

Read More »

వంతెన లేదు…పడవ ప్రయాణం…

  నందిపేట, మార్చి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని ఉమ్మెడ పుష్కర ఘాట్‌ వద్ద నిర్మిస్తున్న గోదావరిపై వంతెన నిర్మాణ పనులు గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతుంది. సంబంధిత గుత్తేదారులు, అదికారుల నిర్లక్ష్యం మూలంగా పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదమని తెలిసినప్పటికి వంతెన లేకపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పడవ ప్రయాణం చేస్తున్నారు. నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలను కలపడానికి సిఎం కెసిఆర్‌ ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానం ప్రకారం అదికారంలోకి వచ్చిన వెంటనే ...

Read More »

రైతుల పట్ల సిఎం కపట ప్రేమ

  నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కపట ప్రేమ ఉందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్‌టిఆర్‌ మినీ స్టేడియంలో బహిరంగ సభనుద్దేశించి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది లేదని, రైతులను నిలువునా మోసం చేసి పబ్బం గడుపుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్ని పేపరుకే పరిమితమయ్యాయని, వాస్తవ రూపంలో ఏపథకమూ అమలుకు నోచుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి ...

Read More »

ముఖ్యమంత్రి మోడికి బహిరంగ క్షమాపణ చెప్పాలి

  కామారెడ్డి, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రధాని మోడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని మోడికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బిజెపి నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగ బద్దుడై రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కెసిఆర్‌ దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన పదవికి తగదన్నారు. కెసిఆర్‌ మాటలను, చేతలను రాష్ట్ర ప్రజలందరు గమనిస్తున్నారని చెప్పారు. సిఎం చేసిన వ్యాఖ్యలపై కవిత, కెటిఆర్‌లు మాట్లాడడం ...

Read More »

సిఎం కెసిఆర్‌ దిష్టిబొమ్మ దగ్దం

  నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడిపట్ల అనుచితంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ దిష్టిబొమ్మను గురువారం జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దగ్దం చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త మాట్లాడుతూ దేశ ప్రధాని అయిన మోడిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన స్థాయిని మరిచి దూషించడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆయన అన్నారు. సిఎం కెసిఆర్‌ దొరల పాలనను గుర్తుచేస్తున్నారని, అహంకార ...

Read More »

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం ఆధ్వర్యంలో ప్రతినిదులు సిఎం కెసిఆర్‌కు పోస్టుకార్డులు రాసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మేదరులు 15 లక్షల మంది ఉన్నట్టు రాష్ట్ర నాయకుడు పుట్ట మల్లికార్జున్‌ పేర్కొన్నారు. 90 శాతం మంది మేదరులు ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, అయినప్పటికి సరైన ఉపాధి లభించడం లేదన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రతినిధులు శ్రీనివాస్‌, ధర్మపురి, నర్సయ్య, తదితరులు ఉన్నారు.

Read More »

సంక్షేమ పథకాలు అందరికి వర్తింపజేయాలి

  బీర్కూర్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికి వర్తింపజేయాలని, స్వంత పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందించడం ఏమిటని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మల్యాద్రిరెడ్డి విమర్శించారు. నసురుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌ గ్రామనికి చెందిన మోహన్‌ అనే వ్యక్తి శనివారం విద్యుత్‌సాక్‌తో మృతి చెందిన సందర్భంగా ఆదివారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు తెరాస పార్టీ నాయకులకే అందుతున్నాయని, వ్యక్తిని చూసి సంక్షేమ పథకాలు అందించడం తెరాస పార్టీ నాయకులకే ...

Read More »

ఇంటికో ఉద్యోగం వెంటనే ప్రకటించాలి

  బీర్కూర్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వెంటనే ఇంటికో ఉద్యోగం ప్రకటించాలని నిజామాబాద్‌ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు దొరబాబు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రం బీర్కూర్‌లో బుధవారం మండల బిజెపి ఆధ్వర్యంలో ఉద్యోగుల ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళు గడిచినా నామమాత్రంగా 15 వేల ఉద్యోగాలు భర్తీచేశారని పేర్కొన్నారు. విద్యార్థులను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారని, ఇపుడు వారికి అన్యాయం ...

Read More »

కంఠేశ్వర్‌ ఆలయానికి రూ. 50 లక్షల నిధులు మంజూరు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు కంఠాభరణం నీలకంఠేశ్వరాలయానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నిధులు మంజూరుచేసినట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు కె.జగన్‌ తెలిపారు. గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ డి.ఇ నిజామాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఈ విషయంపై ప్రకటన చేశారు. నిదులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి, నిజామాబాద్‌ఎంపి కవితకు, అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లకు జగన్‌ సన్మానించారు.

Read More »

అబద్దాల పునాదులపై తెరాస

  – శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌అలీ గాంధారి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అబద్దాల పునాదులపై తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ ధ్వజమెత్తారు. మంగళవారం గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అవినీతి పునాదిపై తెరాస ప్రభుత్వం కొనసాగుతుందని, మోసాలతోనే ముఖ్యమంత్రి కెసిఆర్‌ మూడున్నర సంవత్సరాలు గడిపారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు. ఇచ్చిన హామీలన్ని మరిచిపోయి తెలంగాణలో ...

Read More »

పేదల పక్షపాతి సిఎం కెసిఆర్‌

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేదల పక్షపాతి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వర్ని మండలం అక్బర్‌నగర్‌లో బుధవారం జరిగిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ గృహప్రవేశం సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రతి మనిషికి సొంత ఇల్లు ఒక కల అని, ఈరోజుల్లో సొంత ఇల్లు కట్టుకోవడమంటే గగనమైపోయిందని, ముఖ్యంగా పేదలకు సొంత ఇల్లు కలలాగే మిగిలిపోయేదని, ...

Read More »