Breaking News

Tag Archives: Collector

అలా చేస్తే రూ. 5 వేల‌ జరిమానా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ, క్రిమటోరియం, తడి పొడి చెత్త సేకరణ తదితర అంశాల‌పై వీడియో కాన్ఫరెన్సులో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి. శుక్రవారం ఎంఆర్వోలు, ఎండిఓలు, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు, ఎంపీవోల‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి గ్రామంలో నాలుగు రకాల‌ పనులు తీసుకోవడమైనదని, గ్రామానికి సాంక్షన్‌ అయిన పైప్‌ లైన్‌, టాప్‌లు పాత వాటర్‌ ట్యాంక్‌లు, సిసి రోడ్లు లీకేజీల‌కు సంబంధించిన రిపైర్లు వెంటనే చేయాల‌ని, పూర్తికాని ...

Read More »

15 లోగా డెలివరీ చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 15 లోగా కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ డెలివరీ పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్ మిల్ల‌ర్స్‌ యజమానుల‌ను ఆదేశించారు. గురువారం జనహితలో బాయిల్డ్‌ రైస్ మిల్ల‌ర్స్‌, సివిల్‌ సప్లయ్‌ అధికారుల‌తో మిల్లుల‌ వారిగా సమీక్షించారు. జిల్లాలో మిల్ల‌ర్ల వద్ద ఉన్న రెండు ల‌క్షల‌ మెట్రిక్‌ టన్నుల‌ ధాన్యాన్ని ఎఫ్‌సిఐ గోదాముల‌కు వచ్చే ఈ నెల‌ 15 లోగా డెలివరీ చేయాల‌ని రైస్ మిల్ల‌ర్ల యాజమానుల‌ను ఆదేశించారు. సివిల్‌ సప్లయ్‌ డిప్యూటీ ...

Read More »

పంచాయతీకి ఆదాయాన్ని సమకూరుస్తాం

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకృతి వనాల‌ను గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణ కేంద్రాలుగా తీర్చిదిద్దాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్‌లో శుక్రవారం ఆయన పల్లె ప్రకృతి వనం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మియావాకి విధానంలో మొక్కల‌ను దగ్గర దగ్గరగా నాటి చిట్టడివి వాతావరణం కల్పించాల‌ని సూచించారు. నాటిన మొక్కల‌కు క్రమ సంఖ్య కేటాయించడంపై సర్పంచి రవి తేజ గౌడ్‌ను అభినందించారు. భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డిలో కంపోస్ట్‌ షెడ్డు సందర్శించారు. ...

Read More »

22న సమీక్షకు అన్ని వివరాల‌తో హాజరు కావాలి

నిజామాబాద్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పనుల‌పై మండలాల‌ వారీగా అధికారుల‌తో నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం డీఆర్‌డివో, ఎంపిడివోలు, ఎపిఓలు తదితర అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంజూరైన రైతు కళ్ళాలు వారాంతంలోపు మొదల‌య్యేలా చర్యలు తీసుకోవాల‌ని, నెల‌లోపు పూర్తయ్యేలా చూడాల‌ని, ఇకపై వారంలోపు మొదలుపెట్టి నెల‌ లోపు పూర్తి చేయగలిగే కళ్ళాల‌కు సంబంధించిన ఎస్టిమేషన్లు మాత్రమే తయారుచేసి సాంక్షన్‌ ఆర్డర్లు తీసుకోవాల‌ని, పూర్తి చెయ్యలేని ప్రపోసల్స్‌ ...

Read More »

ఉపాధి కూలీలు చేపట్టిన వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలి

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధిహామీ కూలీలు భౌతిక దూరం పాటిస్తేనే కరోనా కట్టడి చేయవచ్చని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో సోమవారం పంచాయతీ కార్యదర్శిల‌తో ఉపాధి హామీ పనుల‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి కూలికి మూడు మాస్కుల‌ చొప్పున అందజేయాల‌ని, పది రూపాయల‌కు ఒకటి చొప్పున మాస్క్‌ల‌ను స్వయం సహాయక సంఘాల‌ వద్ద కొనుగోలు చేయాల‌ని కోరారు. మాస్కులు ధరించడం వ‌ల్ల‌ కరోనా 99 శాతం ...

Read More »

జగిత్యాల‌లో శాంతికమిటీ సమావేశం

జగిత్యా, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో లాక్‌ డౌన్‌ ఉన్నందున రంజాన్‌ పండుగ సందర్భంగా తీసుకోవల‌సిన ముందు జాగ్రత్తల‌పై కలెక్టర్‌ చాంబర్‌లో ముస్లిం పెద్దల‌తో జిల్లా కలెక్టర్‌ జి.రవి, ఎస్పీ సింధూశర్మ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల‌ ప్రకారం లాక్‌ డౌన్‌ మే 7వ తేదీ వరకు ఉందని, రంజాన్‌ మాసం ప్రారంభమవుతున్నందున సామూహికంగా ప్రజలు ఒకే దగ్గర గుమిగూడి ఉండకుండా చూడాల‌న్నారు. గతంలో జరిగిన పండుగల‌లో క్రిస్టమస్‌, శ్రీరామనవమి, హనుమాన్‌ ...

Read More »

ప్రజావాణిలో 61 ఫిర్యాదులు

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 61 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 28 పిర్యాదులు, వ్యవసాయశాఖ- 7 ఫిర్యాదులు, డిపివో – 4, వైద్యశాఖ – 4 ఫిర్యాదులు, బిసి వెల్పేర్‌- 4, మిగతా శాఖలకు సంబందించి పిర్యాదులు అందాయన్నారు. వాటిని వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు.

Read More »

స్వచ్ఛ సుందర్‌ శౌచాలయ్‌ పోటీలు

కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్వచ్ఛ సుందర్‌ శౌచాలయ్‌ పోటీలకు సంబంధించి ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శౌచాలయ్‌ ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వ డ్రింకింగ్‌ వాటర్‌ శానిటేషన్‌ మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ మహేష్‌ ఠాకూర్‌ తెలంగాణ రాష్ట్ర జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెలంగాణ, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర జిల్లా కలెక్టర్లతో ఆయన స్వచ్చసుందర్‌ శౌచాలయ్‌ పోటీలకు సంబంధించి ...

Read More »

కౌంటింగ్‌ రోజు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11న ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్‌ సిబ్బంది అప్రమత్తంగా, ఏకాగ్రతతో పనిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శనివారం జనహిత భవనంలో కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లతో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కౌంటింగ్‌ రోజు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. ఉదయం 6 గంటలకే కౌంటింగ్‌ సిబ్బంది హాజరుకావాలని ఆదేశించారు. మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్‌, 1 రిటర్నింగ్‌ అధికారిని ఏర్పాటు ...

Read More »

పోలింగ్‌ ఏర్పాట్లు సర్వం పూర్తి

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ రోజు ఓటు వేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అదికారి సత్యనారాయణ తెలిపారు. పోలింగ్‌ ఏర్పాట్లలో భాగంగా గురువారం కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలను ఆయన సందర్శించి పోలింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్‌కు సంబందించి 740 పోలింగ్‌ కేంద్రాల్లో 5 లక్షల 78 వేల 050 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ప్రజలు ఎలాంటి ...

Read More »

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది విధులను పకడ్బందీగా నిర్వహించాలని నిర్లిప్తతకు తావివ్వద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం కామరెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై పూర్తిస్తాయి అవగాహన కలిగి ఉండాలని, ముందే సందేహాలు నివృత్తిచేసుకోవాలని సూచించారు. పోలింగ్‌రోజున ప్రతి రెండు గంటలకు పోలింగ్‌ శాతాన్ని తెలియజేయాలని చెప్పారు. మాక్‌పోల్‌, క్లియరెన్సుపై శ్రద్ద ...

Read More »

ఎన్నికల వరకు చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీ తనిఖీలు చేపట్టాలి

రెంజల్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల రోజు వరకు చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనికీలు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని కందకుర్తి అంతరాష్ట్ర చెక్‌పోస్టును పరిశీలించి తనిఖీల వివరాలు సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనుమానిత నగదు, మద్యంతోపాటు పెద్ద సంఖ్యలో బహుమతులు దొరికినా సీజ్‌ చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను ...

Read More »

చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలి

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం నవీపేట మండలం యంచ, రెంజల్‌, కందకుర్తి వద్ద అంతర్‌జిల్లా చెక్‌పోస్టులను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల రోజు వరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. తనిఖీల సమయంలో వివరాలను అడిగి తెలుసుకోవాలని, నమోదు చేసి రిజిస్ట్రేషన్లు, ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్‌ సూచించారు. ...

Read More »

వెబ్‌కాస్ట్‌ కెమెరామెన్‌ ఓటరు ప్రవేశాన్ని రికార్డు చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వెబ్‌కాస్ట్‌ కెమెరామెన్‌ ఓటరు ప్రవేశాన్ని తప్పకుండా రికార్డు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ రోజున వెబ్‌కాస్టింగ్‌ కోసం 74 మంది విద్యార్థులకు సోమవారం స్థానిక ఆర్‌కె డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటు వేసే కంపార్టుమెంటును రికార్డు చేయకూడదని తెలిపారు. పోలింగ్‌ ముందురోజు 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు 74 వెబ్‌కాస్టింగ్‌ స్క్రీనింగ్‌ ఉంటుందని, ఈ ...

Read More »

దివ్యాంగుల ఉత్పత్తులను వసతి గృహాల్లో వినియోగిస్తాం

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు చిన్నతరహా పరిశ్రమల ద్వారా తయారుచేసే ఉత్పత్తులను ప్రభుత్వ సంక్షేమ వసతి గృహలకు వినియోగిస్తామని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక రాజీవ్‌నగర్‌లో శాంతిసేన దివ్యాంగుల సమితి వారి చిన్నతరహా కుటీర పరిశ్రమను కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులు తయారుచేసిన సర్ప్‌, పినాయిల్‌ ఉత్పత్తులను చూసి అభినందించారు. దివ్యాంగులను ప్రేమపూర్వకంగా, కుటుంబ సభ్యుల్లా చూసి ఆదరించాలని, ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ అధికారి రాధమ్మ, డిఆర్‌డిఎ ...

Read More »

ఎన్నికల విధులపై పూర్తి అవగాహన అవసరం

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు పోలింగ్‌ నిర్వహణ పట్ల, విదుల పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. గురువారం జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబందించి బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలింగ్‌ విధులపై నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ...

Read More »

ఈవిఎం, వీవీప్యాట్‌లపై సిబ్బందికి పూర్తి స్థాయి అవగాహన ఉండాలి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నేపథ్యంలో భాగంగా డిసెంబరు 7న పోలింగ్‌ రోజు నిర్వహించాల్సిన పనులపై, ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం స్థానిక డిగ్రీ కళాశాలలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబందించి 300 మంది ప్రిసైడింగ్‌ అదికారులకు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు రెండోవిడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబరు 6న ఉదయం డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల వరకు, తిరిగి ...

Read More »

చురుకుగా సాగుతున్న ఎన్నికల ఏర్పాట్లు

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబరు 7న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వాటికి సంబందించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఎన్నికలు, కౌంటింగ్‌ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం జిల్లాకు కేటాయించిన బ్యాలెట్‌ యూనిట్‌ రిజర్వుగా ఉన్నవాటిలో రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో 269 బ్యాలెట్‌ యూనిట్లను మేడ్చల్‌ జిల్లాకు తరలించారు. కామారెడ్డి, జుక్కల్‌, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించి ...

Read More »

ఓటర్లు ప్రలోబాలకు గురికావద్దు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్లు ఎలాంటి ప్రలోబాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు సూచించారు. ఆదివారం తన చాంబరులో ఎన్నికల నోడల్‌ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రముఖుల ఫోటోలతో హోర్డింగ్‌లు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు, వివిధ వర్గాలతో అవగాహన ర్యాలీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్‌ సిబ్బందికి పోలింగ్‌రోజు దివ్యాంగులకు ఓటు వేసేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని అన్నారు. మండలం, గ్రామాల వారిగా ఆటోల వివరాలు అందజేయాలని రవాణా ...

Read More »

ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తే చర్యలు

కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణలో భాగంగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఎవరైనా సరే ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం కలెక్టర్‌ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఎల్లారెడ్డిలోని జీవదాన్‌ హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలోని స్ట్రాంగ్‌రూంను పరిశీలించారు. అనంతరం ఎల్లారెడ్డి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు సంబంధించి 50 వేల రూపాయల వరకు స్టార్‌ క్యాంపెయిన్‌ ...

Read More »