Breaking News

Tag Archives: Collector

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు

  కామారెడ్డి, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో తొలిరోజు ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్ష సరళిని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. ఆయా పరీక్షా కేంద్రాలకు వెళ్ళి పరీక్షల నిర్వహణ తీరును సమీక్షించారు. మొత్తం 10,052 విద్యార్థులకుగాను మొదటిరోజు 389 మంది గైర్హాజరయ్యారని, 9663 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదుకాలేదని విద్యాశాఖాధికారులు తెలిపారు. ప్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లతో పాటు విద్యాశాఖాధికారులు జిల్లాలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

Read More »

ధర్మోరాలో స్పెషల్‌ డ్రైవ్‌

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని ధర్మోరా గ్రామంలో మంగళవారం మండల కార్యదర్శులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో ఇంటింటికి తిరుగుతు ఇంటి పన్ను బకాయిలు చెల్లించి గ్రామాభివృద్దికి సహకరించాలంటూ 41 వేల రూపాయలు వసూలు చేసినట్టు మండల కార్యదర్శులు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శులు స్వప్న, గంగాదాస్‌, సాజన్‌కుమార్‌, కేశవనాథ్‌ స్వామి, రమేశ్‌, తిరుపతిరెడ్డి, కారోబార్‌ సాయన్న ఉన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ బృందానికి కానిస్టేబుల్‌ను ...

Read More »

సుంకెట్‌లో స్పెషల్‌ డ్రైవ్‌

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని సుంకెట్‌ గ్రామంలో మంగళవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో మండల కార్యదర్శులు ఇంటింటికి తిరుగుతూ ఇంటి పన్ను బకాయిలు 31 వేల రూపాయలు వసూలు చేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మంగళవారం 1 లక్ష 43 వేలు ఇంటి పన్ను బకాయిలు వసూలు చేసినట్టు ఎంపిడివో శ్రీనివాస్‌ తెలిపారు.

Read More »

ఇంటర్‌ పరీక్షలకు సన్నద్దం కండి

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి పరీక్షలకు సన్నద్దం కావాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ చాంబరులో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోమొదటి సంవత్సరం 10 వేల మంది, రెండో సంవత్సరం 8500 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్టు తెలిపారు. ఇందుకోసం జిల్లాలో ...

Read More »

‘పది’ పరీక్షలకు సన్నద్దంకండి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 13వ తేదీ నుంచి 30 వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలను సాఫీగా నిర్వహించేలా అధికారులు సన్నద్దం కావాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశాలుజారీచేశారు. మంగళవారం కలెక్టర్‌ చాంబరులో 10వ తరగతి పరీక్షలపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో మొత్తం 13,592 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, వీరిలో 13090 రెగ్యులర్‌ విద్యార్థులు కాగా, ...

Read More »

తహసీల్దార్‌లతో కలెక్టర్‌ సమీక్ష

  కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టరేట్‌ కార్యాలయ భవనంలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, వాటి అమలుతీరుపై తహసీల్దార్లతో చర్చించారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయి, వాటిని ఎన్నిరోజుల్లో పరిశీలించి డబ్బు పంపినీ చేస్తున్నారన్న విషయాలపై ఆరా తీశారు. సాదాబైనామాలను విచారించి పరిష్కరించాలని సూచించారు. అసైన్‌మెంట్‌ భూములను గుర్తించి సర్వేపూర్తిచేసి రికార్డులు సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య, ...

Read More »

చిత్రకళ పోటీలను సందర్శించిన జిల్లా కలెక్టర్‌

  కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన చిత్రకళ పోటీలను జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్దిలో ఎన్నికలు, ఓటుహక్కు వినియోగం ప్రధాన పాత్ర పోసిస్తుందన్నారు. దేశం, రాష్ట్రం అభివృద్ది పథంలో నడవాలంటే చిత్తశుద్ది,సమర్థవంతులైన నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనవరి 01, 2017 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ...

Read More »

అటవీ, నర్సరీల తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

  గాంధారి, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండలంలో అటవీశాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న అటవీ, నర్సరీల తీరుపై జిల్లాకలెక్టర్‌ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని తిమ్మాపూర్‌, ముదెల్లి గ్రామాల్లో అటవీశాఖ నర్సరీలను పరిశీలించారు. తిమ్మాపూర్‌లో నర్సరీ పరిస్థితి అధ్వాన్నంగా ఉండడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటిన మొక్కలు ఎండిపోయి ఉండడాన్ని గమనించిన కలెక్టర్‌ అధికారులతీరుపై మండిపడుతూ వెంటనే విచారణ జరిపి సంబందిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎండివోకు సూచించారు. అదేవిధంగా ముదెల్లి నర్సరీలో మొక్కల ...

Read More »

చుక్కాపూర్‌ ఆలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్‌

  కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ అటవీ ప్రాంతంలోని లక్ష్మినర్సింహస్వామి ఆలయాన్ని శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కుటుంబసమేతంగా సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ది కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. అర్చకులు కలెక్టర్‌కు శాలువాతో సన్మానించారు. ఆలయ ఇవో ప్రభు వెంట ఉన్నారు.

Read More »

ట్రస్మా ఆధ్వర్యంలో జిల్లాకలెక్టర్‌కు సన్మానం

  కామారెడ్డి, అక్టోబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం (ట్రస్మా) ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతో పాటు డిఇవో మదన్‌మోహన్‌, జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్యలను సన్మానించారు. ఈ సందర్భంగా ట్రస్మా ప్రతినిదులు మాట్లాడుతూ కామారెడ్డి నూతన జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో వచ్చిన అధికారులను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు, శాలువాలతో సన్మానించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షుడు ఆనంద్‌రావు, ఉపాధ్యక్షుడు రమేశ్‌, ప్రతినిదులు రాజశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌, కృష్ణమూర్తి, హన్మంత్‌రావు, గోవర్ధన్‌రెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు.

Read More »

తహసీల్దార్లతో సంయుక్త కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్సు

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను పరిష్కరించడంలో చొరవ తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ క్లియర్‌గా ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వ్యవసాయేతర భూముల దరఖాస్తులను తిరస్కరించాలని చెప్పారు. ప్రభుత్వ పరంగా వివిద కార్పొరేషన్ల ద్వారా అందజేసిన భూములను సంబంధిత లబ్దిదారుడు సాదాబైనామాలతో విక్రయిస్తే, ప్రభుత్వ నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి, ...

Read More »

ప్రజల స్పందన కలెక్టర్ యోగితారాణాబాగుంది

డిచ్‌పల్లి : నిజామాబాద్ రూరల్, బా ల్కొండ, బాన్సువాడ, ఆర్మూర్ నియోజకవర్గాలను నూరుశా తం మరుగుదొడ్లు కలిగిన నియోజకవర్గాలుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ప్రక్రియలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని కలెక్టర్ యోగితారాణా తెలిపారు. మంగళవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని కేఎన్‌ఆర్ గార్డెన్‌లో రూరల్ నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీవో లు, ఛేంజ్ ఏజెంట్లు, ఈజీఎస్, ఏపీవోలు, గ్రామ సమాఖ్య అ ధ్యక్షులకు ఓడీఎఫ్ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన స దస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న 343 గ్రామ ...

Read More »

11 నుంచి డెహ్రడూన్‌ వెళ్తున్న కలెక్టర్‌

ఇందూరు, న్యూస్‌టుడే: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రడూన్‌కు ఈ నెల 11 నుంచి 13 వరకు జిల్లా పాలనాధికారిణి యోగితారాణా, జిల్లా అధికారుల బృందం వెళ్తొంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ 289 జీవోను సోమవారం జారీ చేసింది. అక్కడ జాతీయ అంధుల సంస్థను సందర్శించి వారు ఉపయోగించే పరికరాలను పరిశీలించనున్నారు. జిల్లాలో అంధులకు కావాల్సిన చేతి కర్రలే కాకుండా మెరుగైన పరికరాలు సమకూర్చుకోవడానికి ఈ పర్యటన ఉపయోగపడనుంది.

Read More »

బాల్యమే భవిష్యత్తుకు పునాది – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా విద్యార్థులు బాల్యంలోనే గట్టి పునాదులు ఏర్పాటు చేసుకునే విధంగా పిల్లలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు దిశా నిర్దేశం చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఉద్భోదించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్వశిక్షా అభియాన్‌ జిల్లాశాఖ భాగస్వామ్యంతో జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో చదువులో వెనకబడ్డ విద్యార్తులకు తర్పీదు ఇవ్వడానికి వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 195 కేంద్రాలను ఏర్పాటు చేసి 9098 మంది విద్యార్థులకు ...

Read More »

డాక్‌ సేవక్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి

నిజామాబాద్‌, మార్చి 16   నిజామాబాద్‌ న్యూస్‌ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆలిండియా పోస్టల్‌ ఎంప్లాయిస్‌ గ్రామీణ డాక్‌ సేవక్‌ సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన సమ్మెకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడంతో సోమవారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం నిజామాబాద్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఏ.సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయిస్తు సరైన వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. జిల్లా కేంద్రంతోపాటు సిరికొండ, డిచ్‌పల్లి మండల ...

Read More »

కలెక్టర్‌ సారూ నన్ను గుర్తు పట్టారా?

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 24: నిజామాబాద్‌ న్యూస్‌: నమస్తే సారూ నాపేరు అంగూరు లక్ష్మి(24), నన్ను గుర్తు పట్టలేదా పట్టలేక పోవచ్చు ఎందుకంటే మీరు మస్తుగా తీరిక లేకుండా ప్రజల పరేషాన్లు తీర్చేందుకు మీరూ పరేషాన్లు పడుతుండ్రు. మరి గదే పరేషాన్‌తో నన్ను కూడా గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు గుర్తొచ్చిన్నా…హా.. నేనే లక్ష్మిని సారూ మీ ఆఫీసుల కూడా రోజు ఛాయి లమ్ముకుంటా, మీ ఆఫీసుల సార్లందరూ నాకాడకోచ్చి ఓయ్‌ లక్ష్మీ ఛాయి పొయ్యు అంటారు కానీ ఒక్కలు గూడా నీకు ఫించన్‌ వచ్చిందా ...

Read More »

కామారెడ్డిలో కలెక్టర్‌ అకస్మీక తనిఖీ

  పథకాల అమలుపై ఆరా నిజామాబాద్‌, జనవరి 13; కామారెడ్డి నగరంలోని బతుకమ్మకుంటలో జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు అకస్మీకంగా పర్యటించి తనిఖీలు చేసారు. మంగళవారం బతుకమ్మకుంటలో పర్యటించి హల్‌చల్‌ చేసి అధికారులను హడలేత్తించారు. స్థానికంగా పెద్ద సంఖ్యలో ఫిర్యాదలు రావడంతో అక్కడే అరుగు మీదా కూర్చుని కలెక్టర్‌ ఫిర్యాదులను స్వీకరించారు. ఎవరు కూడా మద్యవర్తులను నమ్మోద్దని, సరాసరి సంబంధిత అధికారులకు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 2.36 లక్షల పెన్షన్లు మంజూరి కాగా వీటిలో 2.23 లక్షల పెన్షన్లు పంపిణీ చేసామన్నారు. ...

Read More »

కలెక్టర్‌ హల్‌చల్‌

తాండలో ఇంటింటి తనిఖీ సమస్యల ఎకరవు నిజామాబాద్‌, జనవరి 13; జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు డిచ్‌పల్లి మండలం దేవనగర్‌ క్యాంపు లెప్రసీ కాలనీలో ఇంటింటి తిరిగి హల్‌చల్‌ సృష్టించారు. కాలనీలోని వారి సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే వాటిని పరిష్కారించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. మంగళవారం మద్యాహ్నం కలెక్టర్‌ రాసు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తాండకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా కాలనీల ఉన్న వారంతా లెప్రసీ వ్యాధిగ్రస్తులు కావడంతో తమ సమస్యలను కలెక్టర్‌కు ఏకరువు పెట్టారు. సమగ్ర సర్వే జరిగినప్పుడు చాల మంది ...

Read More »

హరితహారం నర్సరీలను సందర్శించిన కలెక్టర్‌

  నిజామాబాద్‌, జనవరి 7; హరితహారం కార్యక్రమంలో విసృతంగా మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బుధవారం పిట్లం మండలంలోని సిద్దాపూర్‌ గ్రామంలోని నర్సరీలను ఆయన సందర్శించారు. అక్కడ హరితహారం కార్యక్రమం కొరకు పెంచుతున్న నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోధన్‌ ఆర్‌డిఓ శ్యామ్‌ ప్రసాద్‌, యూడీసి అధ్యక్షులు రజినీకాంత్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More »

శాశ్వత ఫిర్యాదు కౌంటర్లు

నిజామాబాదు, నవరబరు 6; ప్రభుత్వర జారీ చేసిన మార్గదర్షకాలకనుగునరగా, ప్రణాళికబద్దరగా ఆసరా పిరచన్లను ఆర్హులకు పరపిణీ చేయుటకు చర్యలు తీసుకొవాలని ఫిర్యాదులు స్వీకరిరచదానికి సరబదిత కార్యాలయాల్లో కఉరటర్లు ప్రారరబిరచాలని జిల్లా కలెక్టరు రోనాల్డు రోసు యరపిడిఓలను ఆదేశిరచారు. పేదలకు ఆహర భద్రత, ఆసరా ఫిరచన్లు మరజూరు చేస్తురనరదున ఇరదుకు సరబరదిరచి ప్రజల నురడి ఫిర్యాదులు స్వీకరిరచదానికి యరపిడిఓ కార్యాలయాలు, తహశీల్దారు కార్యాలయాలు, మున్సిపలు కార్యాలయాలు శాస్వతరగా ఫిర్యాదు కౌంటర్లు  ప్రారరబిరచాలని ఫ్లెక్సిలు ప్రదర్షిరచాలని సూచిరచారు. ప్రజలనురడి వచ్చిన ఫిర్యాదులను 7 రోజుల్లో పరిష్కరిరచాలని, మరడల/మున్సిపలు ...

Read More »