Breaking News

Tag Archives: Collector

విఆర్వో పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 16న జరిగే విఆర్వో పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అదికారులను ఆదేశించారు. గురువారం తన చాంబరులో సంబంధిత అధికారులతో విఆర్వో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విఆర్వో పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 52 వేల 170 మంది అభ్యర్థులు దరఖాస్తుచేశారని, ఇందుకు నిజామాబాద్‌, డిచ్‌పల్లి, మాక్లూర్‌, ఆర్మూర్‌, బోధన్‌, నవీపేట, నందిపేటలలో 156 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం ...

Read More »

రోడ్ల విస్తరణ భూసేకరణ 25 లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులైన నేషనల్‌ హైవే అథారిటి ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ హైవే రోడ్ల విస్తరణకు అవసరమైన భూ సేకరణను సంబంధిత గ్రామ పరిధిలోని రైతుల నుంచి సేకరించి సంబంధిత భూమిని ఈనెల 25 లోగా ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులకు సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో మాట్లాడారు. కామారెడ్డి కలెక్టర్‌ చాంబరులో ఏర్పాటైన కాన్ఫరెన్సులో ...

Read More »

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని 23 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రణాళిక విభాగం అధికారుల రాతపరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు పరిశీలించారు. మాదవనగర్‌లోని శ్రీమేధా కళాశాలతోపాటు, విజయ్‌రూరల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, కేర్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన సిసి టివి ఫుటేజీలను పరిశీలించారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ...

Read More »

హరితహారం లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలి

నిజామాబాద్‌ టౌన్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారులు సమష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. శనివారం తన చాంబరులో కలెక్టర్‌ అటవీశాఖ, డిఆర్‌డిఎ, ఇంజనీరింగ్‌, మునిసిపల్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్‌, జాతీయ రహదారులు, నీటిపారుదల, వ్యవసాయ శాఖకు చెందిన లక్ష్యాలకు అనుగుణంగా ఎక్కడెక్కడ మొక్కలు నాటారో వాటిని కాపాడడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రోడ్లకిరువైపులా, రోడ్డు మధ్యలో గన్నేరు, మందార ...

Read More »

కంటివెలుగుపై విస్తృత ప్రాచుర్యం కల్పించాలి

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రజల కోసం నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత ప్రాచుర్యం, అవగాహన చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శాంతికుమారి, కమిషనర్‌ వాకటి కరుణలు అన్నారు. శనివారం కలెక్టర్‌ చాంబరులో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, డిఎంఅండ్‌హెచ్‌వో చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ కంటివెలుగు స్క్రీనింగ్‌ క్యాంపుల్లో తప్పకుండా విటమిన్‌ ఎ,డి, లు అందుబాటులో ఉంచాలని, నిరంతర విద్యుత్తు సరఫరా క్యాంపులకు అందించాలని, జిల్లా కలెక్టర్‌ ...

Read More »

కంటి వెలుగు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

రెంజల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ఐకెపి భవనంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు శుక్రవారం పరిశీలించారు. కంటి వెలుగు కేంద్రాల్లో ఉన్న పరికరాలను పరిశీలించారు. వసతులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఆయన వెంట రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ సాయిలు, వైద్య సిబ్బంది ఉన్నారు.

Read More »

ప్రతి పాఠశాలలో హరితహారం

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి పాఠశాలను హరితపాఠశాలగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. ఆదివారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో పర్యటించి మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పాఠశాలల్లో మొక్కలునాటి హరితహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి విద్యార్థి కనీసం 6 మొక్కలునాటాలని కలెక్టర్‌ సూచించారు. బాల్కొండలోని ఆదర్శ పాఠశాల, జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులతో కలిసి మొక్కలునాటి నీరుపోశారు. పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ ...

Read More »

పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసతి గృహాల సంక్షేమాధికారుల పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ఆదివారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోగల నిశిత డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అబ్యర్థులు పరీక్ష రాస్తున్న తీరును గమనించారు. కేంద్రంలో అన్ని గదులు కలియతిరిగి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్ష ప్రశాంతంగా జరిగేలా చూడాలని, అబ్యర్థులను క్షుణ్ణంగా గమనించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Read More »

స్వచ్చభారత్‌లో అధికారుల పాత్ర క్రియాశీలకం

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చబారత్‌లో భాగంగా మునిసిపాలిటీలు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో అదికారుల పాత్ర క్రియాశీలకమని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జనహితలో శుక్రవారం ఏర్పాటైన వైద్య, అంగన్‌వాడి శాఖల సమీక్షలో ఆయన మాట్లాడారు. చెత్తను పూర్తిగా నిర్మూలించి బ్యాక్టీరియా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడి కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. వీటికోసం 60 లక్షలు కేటాయించనున్నట్టు తెలిపారు. మార్కెట్‌ యార్డు, వైకుంఠధామం, డంప్‌ యార్డులను వెంటనే అమల్లోకి తేవాలన్నారు. హరితహారాన్ని ఈనెల ...

Read More »

23న స్వచ్చ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ను ప్రారంభించాలి

కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 23న తెలంగాణ రాష్ట్రంలో స్వచ్చ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ను ప్రారంభించాలని జాతీయ స్వచ్చ భారత్‌ మిషన్‌ డైరెక్టర్‌ సోనాలి ఘోష్‌ తెలిపారు. దేశంలోని వివిధ జిల్లాల కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనాలి మాట్లాడుతూ తాగునీరు, పారిశుద్యంపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. మురుగు కాలువలు, వీధులు శుభ్రం చేయడం, నీటి నిలువలను అరికట్టడం, వ్యర్తాలను తీసివేయడం చేయాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణాలపై సమన్వయంతో పనిచేయాలని ...

Read More »

పర్యావరణ పరిరక్షణకు మట్టి పాత్రలు వాడాలి

కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి పాత్రలు, మట్టి విగ్రహాలు వినియోగించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. గురువారం ఇందిరాగాంధీ స్టేడియంలో వెనకబడిన తరగతుల అభివృద్దిశాఖ ఆధ్వర్యంలో కుమ్మరి శాలివాహన వారికి మట్టి గణపతి, మట్టి దీపాల తయారీపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేతి వృత్తుల వారిని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా జిల్లా నుంచి మొదటి విడతగా ఐదుగురికి, నల్గొండలో శిక్షణ ఇప్పించామన్నారు. శిక్షణ పొందినవారు ...

Read More »

హరితహారానికి స్థలాలు ఎంపిక చేసుకోవాలి

కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 4వ విడత హరితహారం కార్యక్రమానికి సంబంధించి మొక్కలునాటేందుకు స్థలాలు ఎంపిక చేసుకోవాలని, వాటిని హరితహారం సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని చీఫ్‌ సెక్రెటరీ ఎస్‌.కె.జోషి సూచించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా కలెక్టర్లు, అధికారులతో మాట్లాడారు. 4వ విడత హరితహారాన్ని త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ భూపాలపల్లిలో ప్రారంభిస్తారన్నారు. నర్సరీ డైరెక్టరీ ద్వారా ఏ గ్రామానికి ఎన్ని మొక్కలు పంపుతున్నామో సమాచారాన్ని సంక్షిప్తంగా పొందుపరచాలన్నారు. హరితహారంలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ...

Read More »

తెవివిలో పర్యటించిన కలెక్టర్‌

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా తెవివిలో మొక్కలు నాటడానికి గల పరిస్థితులను, ఇతర అంశాలను కలెక్టర్‌ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించడానికి తేదీ ప్రకటించిన తర్వాత జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన అధికారులతో కలిసి తెవివిలో పర్యటించారు. యూనివర్సిటీలో ఖాళీ స్థలాన్ని పరిశీలించి వైస్‌ఛాన్స్‌లర్‌తో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం తిర్మన్‌పల్లి అటవీశాఖ ...

Read More »

జర్నలిస్టు పిల్లలకు పాఠశాల పీజులో రాయితీ

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2018-19 విద్యాసంవత్సరానికి గాను జర్నలిస్టు పిల్లలకు ప్రయివేటు పాఠశాలల్లో రుసుము 50 శాతం మినహాయింపు సంబందించిన ఉత్తర్వులు సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నుంచి టియుడబ్ల్యుజె నాయకులు అందుకున్నారు. జర్నలిస్టు పిల్లల ఫీజు రాయితీకి సంబంధించి టియుడబ్ల్యుజె, టిఇఎంజెయు నాయకులు జిల్లా కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖాధికారులకు గతంలో వినతి పత్రాలు సమర్పించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ మినహాయింపునకు సంబంధించి ఉత్తర్వులు జారీచేశారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు భాస్కర్‌, అంజి, రాము, ...

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై నివేదిక అందించాలి

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలపై ఈనెల 26వ తేదీలోగా నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ ఎంపి కవిత అధ్యక్షతన జరిగిన దిశ సమావేశంలో వివిధ పథకాలపై పలు అంశాలను కలెక్టర్‌ ప్రస్తావించారు. ఈనెల 26వ తేదీన దిశ సమావేశం ఉన్నందున సమగ్ర నివేదికతో ఆయా శాఖల అధికారులు హాజరై అడిగిన ప్రశ్నలకు సరైన విధంగా ...

Read More »

ఇంటింటి సర్వే పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు వివరాల గురించి తెలుసుకునేందుకు స్వయంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ వెల్ళారు. శనివారం కామారెడ్డి మండలం టేక్రియాల్‌ గ్రామంలో ఓటరు నమోదు చేసుకోని వారి వివరాల గురించి ఆరా తీశారు. సర్వే నిర్వహించి ఫారం-6ద్వారా ఓటరు నమోదు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రవిందర్‌, గ్రామ సర్పంచ్‌ నారాయణ, సిబ్బంది ఉన్నారు.

Read More »

పారిశుద్య పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు మంగళవారం నగరంలో పారిశుద్య కార్యక్రమాలను మునిసిపల్‌ అదికారులతో కలిసి పరిశీలించారు. మిర్చికాంపౌండ్‌, గాంధీచౌక్‌, కుమార్‌గల్లి, నెహ్రూపార్కు, ఖిల్లారోడ్డు, సీతారాంనగర్‌ కాలనీ, గాజుల్‌పేట్‌, న్యాల్‌కల్‌రోడ్డు, వినాయక్‌నగర్‌లోని వినాయకుల బావి వరకు రోడ్లను, మురికి కాలువలను కలెక్టర్‌ పరిశీలించారు. మిర్చికాంపౌండ్‌ ప్రాంతంలో వర్షం కురిసిన చోట రోడ్లపై నీరు నిలిచే అవకాశమున్నందున నీరంతా ఒకేవైపు వెళ్ళేలా చూడాలని, మురికి కాలువలు ప్రతిరోజు శుభ్రం చేస్తు ఎప్పటికప్పుడు చెత్త ఎత్తి డంపింగ్‌ ...

Read More »

యోగా ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యోగా ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్‌ మైదానం నుంచి యోగా అవగాహన వాక్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ యోగాపై అవగాహన పెంచుకోవాలని, యోగాచేసి ఆరోగ్యం కాపాడుకోవాలని, ప్రపంచానికి భారతదేశం యోగారూపంలో ఒక వరాన్ని అందించిందని కలెక్టర్‌ అన్నారు. పాశ్చాత్య దేశాల్లో యోగాకు ప్రాధాన్యత పెరిగిందని, ...

Read More »

ఎన్నికల్లో నిబద్దతతో విధులు నిర్వహించాలి

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో పాల్గొనబోయే అధికారులు క్రమశిక్షణ, నిబద్దతతో విధులు నిర్వహించాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. గ్రామ, వార్డు ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు మంగళవారం కామారెడ్డిలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంలో ఎన్నికలు అతిముఖ్యమని, వీటిని పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరముందన్నారు. 526 సర్పంచ్‌, 4642 వార్డు ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించనున్నట్టు చెప్పారు. మొదటి దఫా కామారెడ్డి, బాన్సువాడ,ఎల్లారెడ్డిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ...

Read More »

పాసుపుస్తకాల్లో తప్పులు సవరించాలి

కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాసుపుస్తకాల్లో నమోదైన తప్పులను ధరణి వెబ్‌సైట్‌లో సవరించాలని ప్రభుత్వ ఓఎస్‌డి స్మితా సబర్వాల్‌, రెవెన్యూ శాఖాధిపతి రజత్‌కుమార్‌ సైనిలు అధికారులకు సూచించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్‌, అదికారులతో మాట్లాడారు. రైతులకు పంపిణీ చేసిన డిజిటల్‌ పాసుపుస్తకాలు, పుస్తకాల్లో నమోదైన తప్పుల సవరణలపై మాట్లాడారు. పాసుపుస్తకాల పంపిణీ వివరాలు సేకరించారు. రెవెన్యూ అధికారులకున్న సవరణల సందేహాలు నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జేసి సత్తయ్య, ఆర్డీవో శ్రీను ...

Read More »