Breaking News

Tag Archives: Collector

ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసులను త్వరిత గతిన పరిష్కరించాలి

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌లో ఉన్న ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఎస్‌.కె.జోషి సూచించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్లలు, ఎస్‌పిలతో మాట్లాడారు. అట్రాసిటి కేసులను త్వరిత గతిన పరిష్కరించేందుకు హోం డిపార్టుమెంట్‌ చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. అట్రాసిటి కేసులు పరిష్కారమయ్యేలా జిల్లా విజిలెన్సు, మానిటరింగ్‌ కమిటీని రెగ్యులర్‌గా నిర్వహించాలన్నారు. హత్య, రేప్‌ బాధితులకు నష్టపరిహారం వెంటనే దఫాల వారిగా చెల్లించాలన్నారు. విద్యార్థులకు ...

Read More »

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జూన్‌ 2న జిల్లాలో పెద్దఎత్తున ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర గిరిజన, టూరిజం శాఖా మంత్రి చందులాల్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులకు సూచించారు. ఏర్పాట్లపై శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి వెంకటేశం మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి అవార్డుల ఎంపికకు అర్హులైన వారిని గుర్తించాలన్నారు. అనాధలు, వృద్దులు, రోగులకు పండ్లు పంపిణీ చేయాలన్నారు. పాఠశాలల్లో వేడుకలు ఘనంగా ...

Read More »

వ్యవసాయ అవసరాలకే రైతుబంధు చెక్కులు వినియోగించుకోవాలి

నిజామాబాద్‌ టౌన్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుబందు పథకంలో వచ్చిన నగదును వ్యవసాయ అవసరాలకే వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా కలెక్టర్‌ అర్గుల్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖకు వెళ్ళి నగదు చెల్లింపులను పరిశీలించారు. నగదు చెల్లింపు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. గ్రామంలో రైతుబంధు పథకాన్ని ఏరోజున పంపిణీ చేస్తున్నారు, ఏవిధంగా పంపిణీ చేస్తున్నారు, బ్యాంకు అదికారుల పనితీరును స్తానిక రైతులను అడిగి ...

Read More »

రైతుబంధుకు నగదు కొరతలేదు

నిజామాబాద్‌ టౌన్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుబంధు పథకానికి ఎలాంటి నగదు కొరత లేదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. మంగళవారం నవీపేట మండలం జన్నేపల్లిలోని సిండికేట్‌ బ్యాంకు కార్యాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు. నగదు చెల్లింపులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతుబంధు పథకానికి నగదు లోటు లేకుండా ముందస్తుగా సిద్దం చేసినట్టు తెలిపారు. రైతులు పుకార్లను నమ్మి మోసపోకుండా బ్యాంకుల్లో వచ్చి నగదు తీసుకెళ్లవచ్చని కలెక్టర్‌ సూచించారు. బ్యాంకు సిబ్బంది రైతుల పట్ల సత్ప్రవర్తనతో మెలగాలని ...

Read More »

అక్రమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని అడ్డుకోవాలి

నిజామాబాద్‌ టౌన్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండల కేంద్రంలో ఆర్మూర్‌కు చెందిన రాజన్న, కొందరు గ్రామస్తులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, సర్పంచ్‌ గంగాధర్‌ కుమ్ముక్కై అక్రమ లేఅవుట్‌లను ప్రోత్సహిస్తున్నారని బాల్కొండకు చెందిన ఎం.డి.నయీమ్‌ ఆరోపించారు. సోమవారం ఈ విషయంపై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాల్కొండ మండల కేంద్రంలో కొందరు వ్యక్తులు కుమ్ముక్కై అక్రమ లేఅవుట్‌లు వేసి పంచాయతీ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని, ఎలాంటి టౌన్‌ప్లానింగ్‌ నియమాలు పాటించకుండా ...

Read More »

నిఖత్‌ జరీన్‌ను అబినందించిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌ టౌన్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బేల్‌గ్రేడ్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌టోర్నిలో స్వర్ణపతకం సాధించిన నిజామాబాద్‌కు చెందిన క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తన చాంబరులో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాక్సింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి స్వర్ణపతకం సాధించడం గొప్పవిషయమని, అరుదైన విజయం సాధించి జిల్లాపేరును ప్రపంచవ్యాప్తంగా చాటిన జరీన్‌ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరారు. కార్యక్రమంలో డిఎస్‌డివో ముత్తన్న తదితరులున్నారు.

Read More »

గోదావరి జలాలపై కలెక్టర్‌కు వినతి

కామరెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో గోదావరి జలాల సరఫరా నిలిపివేయడంతో వార్డుల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంగళవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు ఆయా వార్డుల కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గోదావరి జలాల సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని చాలా మేరకు వార్డు వాసులు గోదావరి జలాలపైనే ఆధారపడ్డారని, గత 11 రోజులుగా నీటి సరఫరా ...

Read More »

ఖరీఫ్‌లో రైతులకు విత్తనాలు సజావుగా మంజూరుచేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే ఖరీఫ్‌లో రైతులకు సజావుగా విత్తన సరఫరా చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. జిల్లాలోని విత్తన డీలర్లతో సోమవారం జనహిత భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 220 విత్తన డీలర్లు ఉన్నారని, వీరు విత్తన సరఫరాను సజావుగా జరపాలన్నారు. విత్తన చట్టానికి లోబడి సరఫరా చేయాలని సూచించారు. నిషేదిత హెర్బిసైడ్‌ టాలరెంట్‌ పత్తి విత్తనాలను విక్రయించరాదని, విక్రయిస్తే కఠిన ...

Read More »

ప్రతిపౌరుడు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిపౌరుడు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. సోమవారం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన 29వ జాతీయ రహదారి, భద్రత వారోత్సవాల కరపత్రాలను, ఫ్లెక్సీలను కలెక్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు సడక్‌ సురక్ష -జీవన్‌ రక్ష అనే నినాదంతో నిర్వహిస్తున్నట్టు, ప్రతిపౌరుడు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. రోడ్డు ప్రమాద రహిత ...

Read More »

‘మహా’ దోపిడి ఆపాలి

– హున్సా, మందర్న గ్రామస్తుల డిమాండ్‌ నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్ర ఇసుక అక్రమ క్వారీ దోపిడి ఆపాలని కోరుతూ బోదన్‌ మండలం హున్సా, మందర్న గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. నామమాత్రానికి మహారాష్ట్రలో బోలేగాం, సగ్రోలి క్వారీ అనుమతి తీసుకొని తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకువస్తు రైతుల పంట పొలాలకు ఆనుకొని రాత్రిపగలు తేడా లేకుండా ఇసుక తవ్వుతున్నారని వారు ఆరోపించారు. ...

Read More »

హనుమాన్‌ ఆలయంలో కలెక్టర్‌ ప్రత్యేక పూజలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం హౌజింగ్‌ బోర్డులో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో పూజలు చేయగా, కలెక్టర్‌ను ఆశీర్వదించారు. సుమారు 12 మంది బాల విద్యార్థులు వేదమంత్రోచ్చారణలు నేర్చుకుంటున్నవారిని కలెక్టర్‌ అభినందించారు.

Read More »

విద్యార్థినిని అభినందించిన కలెక్టర్‌

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బైపిసి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రస్తాయి మార్కులు సాధించిన ఎస్‌.రసజ్ఞను జిల్లా కలెక్టర్‌ బుధవారం తన చాంబరులో అభినందించారు. రసజ్ఞ బైపిసిలో 1000/970 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎంసెట్‌లో కూడా మంచి ర్యాంకు సాధించి ఉన్నత చదువులు చదివి జిల్లాకు మంచిపేరు తేవాలని, రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకు సాధించినందున మిగతా వారు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని, ప్రభుత్వ ...

Read More »

సంక్షేమ పథకాలను వేగిరం చేసి పూర్తిచేయాలి

కామరెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను వేగవంతంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఏప్రిల్‌ 24 పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా గ్రామస్థాయిలో గ్రామశక్తి అభియాన్‌, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మహిళల కోసం సఖి కేంద్రాన్ని జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. 18 కోట్లతో రూర్బన్‌ పథకం పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. సత్యాగ్రహ ...

Read More »

మనోజ్‌ కుమార్‌ను సన్మానించిన కలెక్టర్‌

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమెరికాలో నేషనల్‌ ఎరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సదస్సుకు ఎంపికైన వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్‌ను జిల్లాకలెక్టర్‌ రామ్మోహన్‌రావు బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అతి చిన్న వయసులో మనోజ్‌కుమార్‌కు ఈ అవకాశం దక్కడం ఎంతో గొప్పవిషయమని, మనోజ్‌కుమార్‌ సైన్స్‌ పట్ల తనకున్న అభిరుచిని ఈ వేదిక ద్వారా నిరూపించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని సైన్స్‌ఫేర్‌లలో ప్రతిభ చాటాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు.

Read More »

విద్యార్థుల కవితా రచన ప్రశంసనీయం

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల స్థాయిలో చదువుతోపాటు కవితా రచన వంటి సృజనాత్మక కళలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ తన చాంబరులో జడ్పిహెచ్‌ఎస్‌ గుండారం విద్యార్థులు రచించిన ‘గుండారం గువ్వలు’ అనే కవితా పుస్తకాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి తెలుగు మహాసభల్లో జిల్లాస్థాయి కవితా రచనలో ప్రథమస్తానం పొందిన పూజశ్రీని ప్రశంసించారు. భావన, సాదియా విద్యార్థినిలు కవితలు చదివి వినిపించారు. కార్యక్రమంలో గుండారం పాఠశాల ...

Read More »

జ్యోతిబాఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిబాఫూలే 192వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు జయంతి వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి బీబీపాటిల్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తోపాటు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిపారు. బిసి సంఘాల ప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.

Read More »

మొక్కలు నాటడాన్ని బాధ్యతగా స్వీకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మొక్కలు నాటడాన్ని బాద్యతగా స్వీకరించాలని మొక్కలు నాటి హరితవిప్లవంలో భాగస్వాములు కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. హరితహారంలో భాగంగా ఆయన కామారెడ్డి రైల్వే స్టేషన్‌ ఆవరణలో అటవీశాఖాధికారులు, రైల్వే అధికారులు, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌తో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడం వల్ల భవిష్యత్‌ తరాలకు స్వచ్చమైన గాలిని, ప్రశాంత వాతావరణాన్ని అందించగలమన్నారు. అడవులను పెంపొందించడంతోపాటు ఇళ్లముందు పచ్చదనాన్ని కూడా పెంపొందించుకోవాలని సూచించారు.

Read More »

బోధన్‌ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు శనివారం బోధన్‌ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనికీ చేశారు. ఆసుపత్రిలో ప్రతి వార్డుకు వెళ్ళి చికిత్స పొందుతున్నరోగులను పరామర్శించి, వారికి అందుతున్న సేవలపట్ల అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు రిజిస్ట్రేషన్‌ సందర్భంగా గానీ, వైద్యం సందర్భంగా గానీవరుసలో నిలబడకుండా అవసరమైన మార్పులు సమకూర్చాలని కలెక్టర్‌ ఆదేశించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మందులు, రక్తపరీక్షలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ ఆదేశించారు. జియోలజిస్ట్‌ కేంద్రం బోధన్‌ ...

Read More »

తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో తాగునీరు సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన చాంబరులో ఆర్డీవోలు, ఎంఆర్‌వోలు, ఎంపిడివోలతో సమీక్షించారు. తాగునీరు, హరితహారం, ఓడిఎఫ్‌, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లడుతూ దినపత్రికల్లో తాగునీటి సమస్యలపై వచ్చిన వార్తలపై వెంటనే స్పందించి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొన్ని పత్రికల్లోని వార్తలను ఆయన అధికారుల దృష్టికి తెచ్చారు. ...

Read More »

పిపిసి సెంటర్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

కామారెడ్డి, మార్చి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిపిసి సెంటర్‌లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కామారెడ్డిలో గురువారం రబీ యాక్షన్‌ ప్లాన్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లా పౌరసరఫరాల శాఖ ద్వారా రబీ 2017-18 సంవత్సరానికి వరి నిలువ, కనీస మద్దతుదర, పిపిసి సెంటర్లలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. కనీస మద్దతుధరలపై బ్యానర్‌ పెట్టాలని, రైతులకు తాగునీరు, మరుగుదొడ్లు, నీడకోసం ఏర్పాట్లు చేయాలన్నారు. వారికి ...

Read More »