Breaking News

Tag Archives: covid 19

షబ్బీర్‌ అలీ రూ. ల‌క్ష విరాళం

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ గాంధీభవన్‌లో టీపిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్‌ రెడ్డిని కలిసి మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్ ల‌క్ష రూపాయల‌ చెక్కు విరాళంగా అందజేశారు. కరోన మహమ్మారి వల‌న ఎంతోమంది వల‌స కూలీలు కాలినడకన వారి రాష్ట్రాల‌కు వెళ్తూ మార్గమధ్యంలో ఆకలితో అల‌మటిస్తూ ప్రాణాలు వదులుతున్నారని, వారిని కాపాడడానికి తన వంతుగా వల‌స కూలీల‌ ప్రయాణ ఖర్చుల‌ కొరకు ల‌క్ష రూపాయలు అందజేసినట్టు పేర్కొన్నారు.

Read More »

హ్యుమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అవార్డుకు ఎంపికైన మదన్‌మోహన్‌ రావు

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌, రాష్ట్ర ఐటీ సెల్‌ చైర్మన్‌ మదన్‌ మోహన్‌ రావు హ్యుమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు సంబంధించిన కోవిడ్ – 19 ప్రశంసా అవార్డును అందుకున్నారు. హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. కరోనా కోవిద్‌ 19 వైరస్‌ ప్రబల‌ కుండ ఓజోన్‌, హైపో క్లోరైడ్‌ ద్రావణం స్ప్రే చేస్తూ, మదన్‌ మోహన్‌ రావు చేస్తున్న ఉద్యోగ ఉపాధి సహాయము, పేద ...

Read More »

సిఎం సహాయనిధికి రూ.61 ల‌క్ష‌లు

హైదరాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల‌కు సాయంగా తెలంగాణ రాష్ట్రంలోని న్యాయాధికారులు, జ్యూడిషియల్‌ అధికారులు తమ ఒకరోజు వేతనాన్ని రూ. 61 ల‌క్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి అందించారు. న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌ రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్‌ కార్యక్రమంలో పాల్గొనారు.

Read More »

కరోనా కట్టడిలో భాగంగా రసాయన ద్రావణం పిచికారీ

నిజాంసాగర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగిరెడ్డి పెట్‌ మండలం గోలి లింగా గ్రామంలో గురువారం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేశారు. మండల‌ కేంద్రంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మదన్‌ మోహన్‌ రావు ట్రస్టు సంఘం సౌజన్యంతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఓజెన్‌ రసాయనం, సోడియం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణాన్ని పూర్తి స్థాయిలో పిచికారి చేసే కార్యక్రమాన్ని జెడ్పిటిసి మనోహర్‌ రెడ్డి, ఎంపీపీ రాజు దాసు ప్రారంభించారు. అంతకుముందు మండల‌ ప్రజల‌ క్షేమం కోసం కరోనా వైరస్‌ ...

Read More »

కామారెడ్డి ప్రజల‌కు పోలీసుల‌ హెచ్చరిక

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ సందర్భంగా కొంతమంది పాత నేరస్థులు, ఆర్థిక సంక్షోభంలో ఉన్న వారు దొంగతనం చేసేందుకు అవకాశం ఉన్నందున కనీస జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో అవసరమని కామారెడ్డి పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులు ఇంటి ముందుకు వచ్చినపుడు వారిని దూరంగా ఉంచి మాట్లాడాల‌ని, అనుమానితులు మీ వీధుల్లో సంచరించినట్లయితె వెంటనే సంబందిత పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాల‌ని పేర్కొన్నారు. మీరు ఇంటికి తాళం వేసి పక్క ఉళ్ళకు వెళ్ళినపుడు ...

Read More »

కోవిడ్‌ పరిశోధనల‌కు కామారెడ్డిలో రక్తనమూనాల‌ సేకరణ

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఎంపిక చేసిన ఐదు మండలాల్లోని ఐదు గ్రామాల్లో ప్రతి గ్రామంలో 40 కుటుంబాల‌ చొప్పున ఐసిఎంఆర్‌ బృందం రక్తనమూనాలు సేకరించినట్టు డిఎం అండ్‌ హెచ్‌వో చంద్రశేఖర్‌ తెలిపారు. సేకరించిన రక్తాన్ని పరీక్షల‌ నిమిత్తం చెన్నై వైరాల‌జీ కేంద్రానికి పంపామన్నారు. ఈ సందర్భంగా డిఎం అండ్‌ హెచ్‌వో మాట్లాడుతూ అన్ని డివిజన్‌ల‌ పరిధిలో మండలాల‌ను ఎంపిక చేశామని, రక్త పరీక్షల వల‌న వైరస్‌ సంక్రమించడానికి ...

Read More »

మిగిలిన ఒక్కరు డిశ్చార్జ్‌

నిజామాబాద్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నుండి హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మిగిలిన ఒక్క కోవిడ్‌ పేషెంట్‌ కూడా శనివారం డిశ్చార్జ్‌ అయినట్లు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నుండి 61 మందికి కరోనా పాసిటివ్‌ నిర్ధారణ కాగా వారందరినీ హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేర్చిన విషయం అందరికీ తెలిసిందే. వారంతా శనివారంతో డిశ్చార్జ్‌ కావటం సంతోషించదగ్గ విషయమని అలాగే దాదాపు గత నెల‌ రోజులుగా జిల్లాలో ...

Read More »

ప్రభుత్వాలు ప్రజల‌కు ధైర్యం చెప్పాలి

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండల‌ కేంద్రంలో శుక్రవారం మాజీ మంత్రి, మండలి మాజీ ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆటోడ్రైవర్లకు, వృద్ధుల‌కు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం ఆధారంగానే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాడని, కానీ పోతిరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఆంధ్రాకు నీటిని తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పోతిరెడ్డి ప్రాజెక్టు ద్వారా రోజుకు మూడు టీఎంసీ నీళ్లు ఆంధ్రకు వెళ్తే సంగారెడ్డి, ...

Read More »

హెల్ప్‌ టు అదర్స్‌ ఆధ్వర్యంలో ఆహార పదార్థాల‌ పంపిణీ

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద మంగళవారం జాతీయరహదారి మీదుగా నాగ్‌పూర్‌ వైపు నడిచి వెళ్తున్న వల‌స కూలీల‌కు అమెరికాకు చెందిన హెల్ఫ్‌ టు అదర్స్‌ సంస్థ ఆద్వర్యంలో ఆహారపదార్ధాలు, వాటర్‌ బాటిళ్ళు, మాస్కులు అందజేశారు. అనంతరం ఇందల్వాయి టోల్‌ గేట్‌ వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న శిబిరం ప్రతినిధుల‌కు వల‌స కూలీల‌కు పంచేందుకు ఆహార పదార్థాలు, వాటర్‌ బాటిళ్ళు బిస్కట్లు అందజేశారు. ఈ సందర్భంగా హెల్ఫ్‌ టు అదర్స్‌ సంస్థ ఇండియా ...

Read More »

అంబులెన్సులో ప్రసవం

కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని లింగంపేట్‌ మండలం జల్దిపల్లి గ్రామానికి చెందిన పోతుగంటి సాయవ్వ (30) కి పురిటి నొప్పు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే సాయవ్వని హాస్పిటల్‌కు తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికమవడంతో, మార్గ మధ్యలో అంబులెన్సులో సుఖ ప్రసవం చేశారు. 3వ కాన్పు కావడంతో పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చింది. తదుపరి వైద్య సేవల‌ నిమిత్తం దగ్గరలోని లింగంపేట్‌ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. 108 ...

Read More »

లాక్‌ డౌన్ ఉల్లంఘించిన వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 131 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 111, ఆటోలు 19, ఫోర్ వీల‌ర్స్‌ 1 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు శనివారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

105 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 105 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 87, ఆటోలు 17, ఫోర్ వీల‌ర్స్‌ 1 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు బుధవారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

దుబాయిలో ఆర్మూర్‌ వాసి కోవిడ్‌-19తో మృతి

ఆర్మూర్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణం అరుంధతినగర్ కాల‌నీకి చెందిన గోసం బాబు (45) గత నెల‌ 21 న గుండె పోటుతో దుబాయ్‌లో మరణించాడ‌ని కుటుంబ స‌భ్యులు భావించారు. బాబు ఒక ప్రవేట్‌ కంపెనీలో పని చేసేవాడు, అతని మృతదేహాన్ని తెప్పించడం కొరకు కుటుంబీకులు ప్రవాస భారతీయుల‌ సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడును కలిసి విషయం వివరించారు. కాగా దేశంలో ఉన్న ఫోరమ్‌ అధ్యక్షుడు రమేష్‌, జంగం బాల‌కిషన్‌ ద్వారా ప్రయత్నించి ...

Read More »

కరోనా బాధితుల‌కు అన్నదానం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించినందున ఎంతో మంది వల‌స కార్మికులు, నిరుపేదలు అన్నానికి అల‌మటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన ఎన్నోళ్ల అంజలి మంగళవారం అన్నదానం చేశారు. మొత్తం 70 మందికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో కుచి కిషన్‌ పంతులు, పివైఎల్‌ డివిజన్‌ అధ్యక్షుడు సాయినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో నమూనా సేకరణ కేంద్రం ఏర్పాటు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కరోనా వైరస్‌ నమూనాను సేకరించడానికి ప్రత్యేక కేంద్రాన్ని సిద్ధం చేయించినట్టు నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నమూనాలు తీసుకునే వైద్య సిబ్బందికి మరింత రక్షణగా కేంద్రాన్ని సిద్ధం చేశామని 5 రోజుల్లో దీనిని పూర్తి చేయడానికి మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆసుపత్రి పర్యవేక్షకులు నాగేశ్వరరావు, కృషి చేశారని కలెక్టర్‌ తెలిపారు. పేషెంట్లు ఒకరికొకరు కలిసే అవకాశం లేకుండా వేరువేరుగా శాంపిల్స్‌ తీసుకోవడానికి కేంద్రం ...

Read More »

అనాధల‌ను ఆదుకునే కార్యక్రమమే నిజామాబాద్‌ అన్నదాతలం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌లో చిక్కుకున్న అనాధల‌ను అభాగ్యుల‌ను ఆదుకొని వారికి భోజనం అందించడమే నిజామాబాద్‌ అన్నదాతలం కార్యక్రమ ల‌క్ష్యమని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్‌ ఫుడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుచేసిన అన్నదాత కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్‌ పేదల‌కు భోజనం వడ్డించారు. వల‌స కూలీల‌కు, నిరాశ్రయుల‌కు లాక్‌ డౌన్‌లో చిక్కుకున్న వారికి ఇతర రాష్ట్రాల‌ నుండి వచ్చిన పేదల‌కు భోజనం ...

Read More »

స్టాఫ్‌ నర్సుల‌ నియామకం…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 నివారణ చర్యల్లో భాగంగా రోగుల‌కు మరింత మెరుగైన సేవ‌లు అందించేందుకు గాను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుల‌ నియామకం చేసినట్టు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నాగేశ్వర్‌ రావు తెలిపారు. స్టాఫ్‌ నర్సుల‌ పోస్టుకు ఎంపికైన అభ్యర్థుల‌కు శనివారం జీజీహెచ్‌లో ధ్రువపత్రాలు పరిశీలించి నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్బంగా నాగేశ్వర్‌ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాల‌తో జిల్లాలో 60 మంది ...

Read More »

24 ల‌క్షల‌ భారీ జరిమానాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడిలో భాగంగా నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోదన్‌, డివిజన్‌ స్థాయిలో పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   నిజామాబాద్‌లో మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 24 వరకు సీజ్ చేసిన వాహనాల‌కు గాను మొత్తం 24 ల‌క్షల‌ 28 వేల‌ 100 రూపాయల‌ జరిమానాలు విధించినట్టు తెలిపారు. మొత్తం లాక్‌ డౌన్‌ కేసులు 170 రిపోర్టు కాగా, ...

Read More »

లాక్‌ డౌన్‌ పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలు, లాక్‌ డౌన్‌ నేపధ్యంలో ప్రజల‌ కష్టసుఖాల‌ను తెలుసుకోవడానికి బాన్సువాడ పట్టణంలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం పర్యటించారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి, ఇతర అధికారులు, ముఖ్యమైన ప్రజాప్రతినిధుల‌తో కలిసి బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారి, కాల‌నీలో స్పీకర్‌ పర్యటించారు.   ఈ సందర్భంగా కాల‌నీలో స్పీకర్‌ మాట్లాడుతూ సమర్ధవంతమైన చర్యల‌తో ...

Read More »

అంబేడ్కర్‌ యూత్‌ ఆధ్వర్యంలో చపాతీలు, అన్నం పంపిణీ

బాల్కొండ, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనతా గ్యారేజ్‌ అంబేద్కర్‌ యూత్‌ బాల్కొండ మండలం ఆధ్వర్యంలో గురువారం బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్ద గంగారెడ్డి చేతుల‌ మీదుగా ఐదు వందల‌ మంది వల‌సకూలీల‌కు చపాతీలు, అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనతా గ్యారేజ్‌ అంబేద్కర్‌ యూత్‌ సభ్యులు, బొట్టు వెంకటేష్‌, తాళ్ల వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »