Breaking News

Tag Archives: covid 19

కోటగిరిలో కోవిడ్‌ నిబంధనల‌పై అవగాహన

బాన్సువాడ, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రచ్చగల్లి, చావిడి గల్లి, బస్టాండు, మార్కెట్‌, బిసి కాల‌నీ, వినాయక్‌ నగర్‌లో ప్రజల‌కు, దుకాణ యాజమానుల‌కు ‘‘కోవిడ్‌ 19’’ నిబంధనలు ప్రజలు అందరూ తప్పనిసరిగా పాటించాల‌ని నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం వారి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలు అందరు మాస్క్‌ తప్పకుండా ధరించాల‌ని, సోషల్‌ డిస్టెన్స్‌ తప్పకుండా పాటించాల‌ని, సానీటైజర్‌ వాడాల‌ని సూచించారు. అలాగే ప్రజలు అనవసరంగా బయట తిరుగవద్దని, ఎవరికైనా కరోన ...

Read More »

దేగాంలో వ్యాక్సినేషన్‌ అభియాన్‌

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన వ్యాక్సినేషన్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం దేగాం గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంలో కరోన వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌ రెడ్డి ఆధ్వర్యంలో వాటర్‌ బాటిల్స్‌, బిస్కేట్స్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల‌ అధ్యక్షు రోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోన రెండవ దశ చాలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కట్టడికి ఉన్న మార్గాలు ఒకటి వ్యాక్సిన్‌ వేయించుకోవడం, రెండవది మాస్క్‌ ...

Read More »

కోవిడ్‌ చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మరియు వాక్సినేషన్‌పై నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల‌ కలెక్టర్లతో, నిజామాబాద్‌ జనరల్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ తో మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. కోవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల‌ని ఈ సందర్బంగా సూచించారు. ఉభయ జిల్లాలోని బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా హాస్పిటల్స్‌లో సరిపడా సదుపాయాలు ఏర్పాటు చేయాల‌ని ఉభయ జిల్లా కలెక్టర్లు నారాయణరెడ్డి, డా.శరత్‌ ను ...

Read More »

టీకాతోనే రక్షణ

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆయా గ్రామాల‌ ప్రజలు టీకా తీసుకొని కోవీడు మహమ్మారిని తరిమివేయాల‌ని మోర్తాడ్‌ ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ ఆయా గ్రామాల‌ ప్రజల‌కు సూచించారు. టీకా తీసుకొని ప్రాణాలు రక్షించుకోవాల‌న్నారు. టీకాతో ప్రాణానికి వంద శాతం మేలు జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాల‌ని, ప్రజలందరూ మాస్కు ధరిస్తే లాక్‌ డౌన్‌తో సమానమేనని ఎస్‌ఐ వివరించారు. ప్రజలు ఎవరూ కూడా గుంపులుగుంపులుగా ఉండరాదని సభలు సమావేశాలు నిర్వహించకూడదని ప్రజలు ...

Read More »

కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలి

బోదన్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం వారి ఆధ్వర్యంలో కోవిడ్‌ 19 నిబంధనలు ప్రజలు అందరూ తప్పనిసరిగా పాటించాల‌ని బోధన్‌ టౌన్‌ పరిధిలోని బస్టాండ్‌, అంబెడ్కర్‌ చౌరస్తా, పాతబస్టాండ్‌, ఫ్రూట్‌ మార్కెట్‌, దుకాణ యాజమానుల‌కు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బోధన్‌ టౌన్‌ సిఐ రామన్‌, పోలీస్‌ కళాబృందం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కోవిడ్‌ చికిత్సల‌కు సిద్ధం కండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్తంగా, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు విస్తృతంగా పెరుగుతున్నందున ప్రభుత్వ ఆసుపత్రుల‌తో పాటు అనుమతించిన ప్రైవేట్‌ ఆసుపత్రుల‌లో కూడా తిరిగి పెద్ద సంఖ్యలో సేవ‌లు అందించడానికి సిద్ధంగా ఉండాల‌ని, ఏర్పాటు చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రైవేట్‌ ఆస్పత్రుల‌ యాజమాన్యాల‌ను‌ కోరారు. మంగళవారం తన ఛాంబర్లో ప్రైవేట్‌ ఆస్పత్రుల‌ యాజమాన్యాల‌తో కోవీడు వ్యాప్తిపై, తీసుకోవాల్సిన చర్యల‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకు వైరస్‌ ఉదృతి ఆందోళనకరంగా కనిపిస్తున్నదని ...

Read More »

కామారెడ్డిలో సెంచరీ దాటిన కరోనా కేసులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో సోమవారం కరోనా కేసులు సెంచరీ దాటాయి. జిల్లా వ్యాప్తంగా 103 కేసులు నమోదు కాగా, 14,434 కు చేరుకుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా బాధితుని ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వివరాలు సేకరించడంలో అధికారులు విఫల‌మవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా ల‌క్షణాల‌తో మాస్కులు లేకుండానే ప్రజలు బయట తిరుగుతున్నారు. గత మార్చి నెల‌లో 464 కరోనా కేసులు నమోదు కాగా, గడిచిన ...

Read More »

ఆసుపత్రి మూసివేత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో నిష్కల్‌ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహిస్తున్న యజమాని డాక్టర్‌ నిష్కల్‌ ప్రభుకు కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్నప్పటికీ అతను పేషెంట్లకు చికిత్సలు అందిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో ఆస్పత్రిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బందికి కోవిడ్‌ చికిత్సలు నిర్వహించగా ఆస్పత్రిలోని 30 మందికి, సిబ్బంది 10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డిఎంఅండ్‌హెచ్‌వో తెలిపారు. ఆసుపత్రి యజమాని ప్రభుకు కూడా ...

Read More »

కామారెడ్డిలో కరోన డేంజర్‌ బెల్స్‌…

కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి ఆర్‌టిపిఎస్‌, రాండమ్‌ రిపోర్ట్స్‌లో జిల్లాలో 93 మందికి పాజిటివ్‌ తేలింది. వీటిలో ఒక్క కామారెడ్డి పట్టణంలోనే 45 మందికి పాజిటివ్‌ వచ్చింది. భౌతిక దూరం, సానిటైజర్‌ వాడకం, మాస్క్‌ ధరించడం వంటి నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

Read More »

అందరు తప్పక వ్యాక్సిన్‌ తీసుకోవాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారతీయ జనతా పార్టీ మాక్లూర్‌ మండల‌ శాఖ ఆధ్వర్యంలో దేశ ప్రధాని మోదీ ప్రజలందరికీ తప్పనిసరిగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ను అందించాల‌నే ఉద్దేశంతో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ గురించి అవగాహన కల్పించే పోస్టర్‌ను జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. నరసింహ రెడ్డి, ఆర్మూర్‌ కొవిడ్‌ కన్వీనర్‌ ద్యాగ ఉదయ్‌ చేతుల‌ మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌ వినయ్‌, మాక్లూర్‌ మండల‌ నాయకులు సంతోష్‌, బిజెవైఎం ...

Read More »

కోవిడ్‌ వ్యాక్సిన్‌ గోడప్రతుల‌ ఆవిష్కరణ

ఆర్మూర్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలందరికీ తప్పకుండా వ్యాక్సిన్‌ అందించాల‌నే ఉద్దేశంతో విస్తృత ప్రచారంలో భాగంగా కోవిడ్‌-19 టీకా యొక్క పోస్టర్‌ని బీజేపీ సీనియర్‌ నాయకులు లోక భూపతి రెడ్డి చేతుల‌ మీదుగా ఆర్మూర్‌ పీవీఆర్‌ భవన్‌లో బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్మూర్‌ నియోజకవర్గ ఇంచార్జి వినయ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహారెడ్డి, జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు నూతుల‌ శ్రీనివాస్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్‌, ...

Read More »

రేపే ఎన్నికలు

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 31వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటల‌ నుండి సాయంత్రం 4:30 వరకు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జిల్లా కోర్టు రెండవ అంతస్తులో నిర్వహించనున్నట్టు ఎన్నికల‌ అధికారులు రాజ్‌ కుమార్‌ సుబేదార్‌, డి వెంకట్‌ రమణ గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు కోవిడ్‌ నిబంధనల‌కు అనుగుణంగా నిర్వహించ బడుతాయి కావున ఓటు హక్కు వినియోగించుకునె సభ్యులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాల‌ని, ...

Read More »

మాస్కు లేకుంటే జరిమానాలు తప్పవు – ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌

మోర్తాడ్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌-19 దృష్టిలో పెట్టుకొని మోర్తాడ్‌ పోలీస్ స్టేష‌న్‌ పరిధిలోని ఆయా గ్రామాల‌ ప్రజలందరూ మాస్కు లేకుండా బయట తిరగవద్దు అని మోర్తాడ్‌ ఎస్సై సురేష్‌ కుమార్‌ తెలిపారు. మాస్కు లేకుండా తిరగడం నేరమని అందుకు తగిన జరిమాన విధించబడుతుందని ఎస్సై పేర్కొన్నారు. కోవీడు 19 ముందస్తు చర్యల్లో భాగంగా ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని దీన్ని ప్రజలెవరూ తిరస్కరించవద్దని తప్పనిసరిగా మాస్కు ధరించాల‌ని ఎస్‌ఐ అన్నారు. ప్రజలు ఎవ్వరు గుంపులుగుంపులుగా తిరగవద్దు అని ...

Read More »

ఐదుగురికి కరోన పాజిటివ్‌

నిజాంసాగర్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ జవహర్‌ నవోదయ విద్యాల‌యంలో ముగ్గురికి, తుంకి పల్లి తండాలో ఒకరికి, కోనతండాలో ఒకరికి, మొత్తం ఐదు కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు మండల‌ వైద్య అధికారి రాధా కిషన్‌ తెలిపారు. నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 51 మందికి ర్యాపిడ్‌ టెస్టు చేయగా అందులో నలుగురికి కరోన పాజిటివ్‌ నిర్ధారణ అయిందని, అలాగే కోన తండాకు చెందిన ఒకరికి బాన్సువాడలో ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయగా కరోన పాజిటివ్‌ నిర్ధారణ ...

Read More »

అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్షలు యథాతధం

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ పరీక్షలు యధాతధంగా నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఉండడానికె నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్ల‌డించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే పరీక్షల‌కు హాజరయ్యే విద్యార్థులు కోవిడ్‌ – 19 నిబంధనలు తప్పకుండా పాటించాల‌ని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ తెలిపారు.

Read More »

రేపట్నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు బంద్‌

హైదరాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్కూళ్ల మూసివేతపై తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సెల‌వులు ప్రకటిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభ వేదికగా ప్రకటన చేశారు. పాఠశాల‌ల్లో కరోనా పాజిటివ్‌ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో మంత్రి సబిత, విద్యా, వైద్యారోగ్య శాఖ అధికారుల‌తో సీఎం కేసీఆర్‌ సమావేశమై చర్చించారు. పాఠశాల‌లకు సెల‌వులు ఇవ్వాల‌ని వైద్యారోగ్య శాఖ సూచించింది.

Read More »

శుక్రవారం ఉదయం 7.30 గంటల‌కు ఎఫ్‌.ఎం వినండి….

నిజామాబాద్‌, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాపై అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎం.సుదర్శనం గురువారం ఆకాశవాణి కేంద్రంలో రేడియో ప్రసంగం చేశారు. రేడియో మాధ్యమంగా ప్రజల‌కు సల‌హాలు, సూచనలు చేశారు. 19వ తేదీ శుక్రవారం ఉదయం 7.30 గంటల‌కు అవగాహన కార్యక్రమం ప్రసారం కానుంది. ప్రజలందరు శ్రద్దగా విని సద్వినియోగం చేసుకోవాల‌ని తెలిపారు.

Read More »

వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ రెండవ డోస్‌ టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు 60 సంవత్సరాలు దాటిన, 45 సంవత్సరాల‌ నుండి 59 సంవత్సరాల‌ లోపు డయాబెటిక్‌, బిపి, క్యాన్సర్‌ ఉన్నవారు తప్పకుండా వ్యాక్సినేషన్‌ తీసుకోవాల‌న్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్‌లో ఇవ ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ టీకా ...

Read More »

మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న మాజీ మంత్రి

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన దేశంలో, రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. జనవరి 16 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తొలి దశలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు సహా ఇతర ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు టీకాలు వేయించుకున్నారు. అయితే ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు భయం పోగొట్టేందుకు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ శనివారం అపోలో ఆస్పత్రి జూబ్లీహిల్స్‌లో కో వ్యాక్సిన్‌ టీకా మొదటి ...

Read More »

అధికారులు పనులు పూర్తయ్యేలా చూడాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనులు పూర్తి చేయించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణ ప్రజల‌కు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనందున 60 సంవత్సరాలు దాటిన వారు 45 సంవత్సరాలు దాటి ఎంపిక చేయబడిన వ్యాధుల‌తో బాధపడుతున్నవారు వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాల‌న్నారు. ఉద్యోగులు వారి ఇంట్లో 60 సంవత్సరాలు పై ...

Read More »