Breaking News

Tag Archives: Elections

ఖాళీగా ఉన్న స్థానిక ఎన్నికల‌కు సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని 56 గ్రామ పంచాయతీల‌లో ఖాళీగా ఉన్న నాలుగు సర్పంచ్‌ 77 వార్డ్‌ మెంబర్‌ ఎన్నికల‌కు విధులు నిర్వహించే పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్ ‌ల‌త ఆధ్వర్యంలో శనివారం ఈ ప్రక్రియ నిర్వహించారు. అదనపు సిబ్బందితో కలిపి 106 మంది 106 మంది ప్రిసైడింగ్‌ అధికారులు 119 మంది అదనపు పోలింగ్‌ సిబ్బంది నియామకం గురించి ఈ ప్రక్రియ పూర్తి చేశారు. 26వ తేదీన ...

Read More »

రేపే ఎన్నికలు

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 31వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటల‌ నుండి సాయంత్రం 4:30 వరకు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జిల్లా కోర్టు రెండవ అంతస్తులో నిర్వహించనున్నట్టు ఎన్నికల‌ అధికారులు రాజ్‌ కుమార్‌ సుబేదార్‌, డి వెంకట్‌ రమణ గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు కోవిడ్‌ నిబంధనల‌కు అనుగుణంగా నిర్వహించ బడుతాయి కావున ఓటు హక్కు వినియోగించుకునె సభ్యులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాల‌ని, ...

Read More »

సిబ్బంది ఎన్నికల నియమావళి పాటించాలి

కామారెడ్డి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైక్రో అబ్జర్వర్లు ఈనెల 22న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించేలా చూడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. సోమవారం కామారెడ్డి జనహితలో పట్టభద్రుల ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఎన్నికల మైక్రో అబ్జర్వర్లు, ప్రీసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రీసైడింగ్‌ అధికారులతో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సంబంధించి ఏడుగురు, పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబందించి 17 మంది పోటీలో ఉన్నట్టు తెలిపారు. ఉదయం ...

Read More »

ప్రజలు అభివృద్దికే పట్టం కడతారు

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగున్నరేల్ల పాటు ప్రజలకు సంక్షేమ పాలన అందించిన తెరాసకే తిరిగి పట్టం కడతారని కామారెడ్డి తెరాస అభ్యర్థి గంప గోవర్దన్‌ అన్నారు. ఎన్నికల అనంతరం శనివారం ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల అనంతరం అన్ని ఛానెళ్లు, పత్రికలు విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఇదేవిషయం స్పష్టమైందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కెసిఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. మహాకూటమి ...

Read More »

బాన్సువాడలో పోచారం ఓటమి ఖాయం

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముందస్తు ఎన్నికల పేరిట ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన పతనాన్ని తానే కోరుకున్నారని బాన్సువాడలో మంత్రి పోచారంతోపాటు చాలా మంది ఓటమి పాలు కానున్నారని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ జోస్యం చెప్పారు. కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులతో షబ్బీర్‌ అలీ సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల వైపే ప్రజలు మొగ్గుచూపారని, ...

Read More »

ప్రజా వ్యతిరేక సునామిలో తెరాస కొట్టుకుపోవడం ఖాయం

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా వ్యతిరేకసునామిలో తెరాస కొట్టుకుపోవడం ఖాయమని కామారెడ్డి కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థి మహ్మద్‌ షబ్బీర్‌ అలీ అన్నారు. శనివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొందరపాటు నిర్ణయంతో కెసిఆర్‌ ముందస్తు ఎన్నికల పేరిట రాష్ట్రంపై ఎన్నికల ఖర్చు భారాన్ని రుద్దారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 6న అసెంబ్లీ రద్దుచేసి అదేరోజు అభ్యర్థులను ప్రకటించడం వెనక ఆయన కోట్లాది రూపాయల పార్టీ ఫండ్‌ సమకూర్చుకున్న విషయం స్పష్టమవుతుందన్నారు. 18 ...

Read More »

ఓటరు జాబితా పరిశీలన

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిదుల సమక్షంలో శనివారం ఓటరు జాబితా పరిశీలన (స్క్రూటిని) కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల స్ట్రాంగ్‌రూంలకు సీల్‌ వేశారు. నియోజకవర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకుడు అభిషేక్‌ కృష్ణ, బ్రిజ్‌రాజ్‌ రాయ్‌, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, జిల్లా ఎస్‌పి శ్వేత, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోత్రె, రిటర్నింగ్‌ అదికారులు దేవేందర్‌రెడ్డి, రాజేంద్రకుమార్‌, రాజేశ్వర్‌, ఎన్నికల ...

Read More »

పోలింగ్‌కు తరలివచ్చిన దివ్యాంగులు

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు దివ్యాంగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎన్నికల అధికారులు దివ్యాంగుల కోసం ఉచిత రవాణా సదుపాయంతోపాటు వీల్‌చైర్‌లు, ర్యాంపులు సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో మునుపెన్నడూ లేనివిధంగా దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దివ్యాంగుల పట్ల ఎన్నికల ఏర్పాట్లను అందరు అభినందించారు.

Read More »

ఆకట్టుకున్న మాడల్‌ పోలింగ్‌ స్టేషన్లు

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్లను ఆకర్షించేందుకు ఓట్ల శాతం పెరిగేందుకు రూపొందించిన మాడల్‌ పోలింగ్‌ స్టేషన్లు ఆకట్టుకున్నాయి. కామరెడ్డి మునిసిపాలిటి కార్యాలయం, ఎల్లారెడ్డి జడ్పిహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాలలో, బిచ్కుంద జడ్పిహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన మాడల్‌ పోలింగ్‌ కేంద్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటితోపాటు కామరెడ్డిలోని లింగాపూర్‌లో దివ్యాంగుల మాడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. ఓటింగ్‌ అనంతరం ఓటర్లు పోలింగ్‌ స్టేషన్ల బయట సెల్ఫీలు దిగుతూ తాము ఓటు వేశాము, మీరు ఓటు వేయండని సోషల్‌ ...

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ శుక్రవారం జరిగిన ఎన్నికల్లో సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ, తెరాస అభ్యర్తి గంప గోవర్ధన్‌, బిజెపి అభ్యర్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి వారి వారి పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితోపాటు ఇతర పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు సైతం వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read More »

వెబ్‌కాస్టింగ్‌ కేంద్రం నుంచి ఎన్నికల పర్యవేక్షణ

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన ఎన్నికల తీరును జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల వెబ్‌కాస్టింగ్‌ కంట్రోల్‌ రూం నుంచి అధికారులు పరిశీలించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి సాదారన పరిశీలకులు అభిషేక్‌ కృష్ణ, పోలీసు పరిశీలకులు సుఖ్‌వీర్‌ సింగ్‌, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, కో ఆర్డినేటర్‌ బల్విందర్‌ సింగ్‌, జిల్లా ఎస్‌పి శ్వేత, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోత్రెతోపాటు నోడల్‌ అధికారులు ఎన్నికల తీరును పరిశీలించారు. ...

Read More »

పోలింగ్‌ ప్రశాంతం

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన పోలింగ్‌ చెదురు మదురు సంఘటనలు మినహా సజావుగా సాగింది. ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసుల భద్రత మద్య ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల సమయానికి జుక్కల్‌ 70.58 శాతం, ఎల్లారెడ్డి 80.50 శాతం, కామారెడ్డి 68.09 శాతం మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 73.05 శాతం పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ సరళిపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు ...

Read More »

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన సిపి కార్తికేయ

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ కమీషనరేట్‌ పరిధిలోని పలు పోలింగ్‌ కేంద్రాలను విస్తృతంగా పరిశీలించారు. విదుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా పోలీసులతో పాటు మహారాష్ట్ర, పారా మిలటరీ బలగాలను రంగంలోకి దించినట్టు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని కమీషనర్‌ పేర్కొన్నారు. ఆర్మూర్‌, బోదన్‌, నిజామాబాద్‌ డివిజన్‌లో పోలీసులు తమ విధులు విజయవంతంగా నిర్వహించారని అన్నారు. మొత్తం మీద ...

Read More »

పోలింగ్‌ కేంద్రంలో తుదిశ్వాస

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం బీబీపేట్‌ తాండాకు చెందిన గుగులోత్‌ దేశయ్యనాయక్‌ (65) పోలింగ్‌ కేంద్రంలోనే ఓటు వేసి తుదిశ్వాస విడిచారు. ఓటు వేయడానికి వచ్చిన దేశయ్యనాయక్‌ ఈవిఎం మిషన్‌ వద్దకు చేరుకొని ఓటు వేశారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

Read More »

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన శాసనసభ ఎన్నికలు చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం వరకు ఊపందుకుంది. ఎన్నికల ఓటింగ్‌పై ప్రజలకు కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం చైతన్యం కలిగించినా ప్రజల నుంచి అంతగా స్పందన రాలేదని చెప్పాలి. గతంతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్‌ శాతం తగ్గింది. నిజామాబాద్‌ అర్బన్‌తోపాటు రూరల్‌ నియోజకవర్గాల్లో, బోధన్‌, ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ...

Read More »

కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అదికారం చేపట్టడం ఖాయమని టిపిసిసి కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. బుధవారం కాంగ్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెరాస ప్రభుత్వం పథకాల అమలులో విఫలమైందని, వారు చెబుతున్న పథకాల్లో ఏ ఒక్క పథకం కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలు కమీషన్లకోసమే చేపట్టారని ఆయన అన్నారు. మహాకూటమి పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, కాంగ్రెస్‌ పార్టీ వల్ల ప్రజలకు ...

Read More »

నల్లవెల్లిలో బాజిరెడ్డి విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస రూరల్‌ అభ్యర్తి బాజిరెడ్డి గోవర్దన్‌ ఇందల్వాయి మండలం, నల్లవెల్లి గ్రామంలో బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ పార్టీ అనవసర ఆరోపణలు చేస్తున్నారని, వారికి పథకాలపై అవగాహన లేదని, ఓటమి భయంతో నోటికొచ్చి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస పాలనలో ప్రజలందరు సుభిక్షంగా ఉన్నారని, స్వచ్చమైన పాలన అందిస్తున్నామని, రానున్న ఎన్నికల్లో తనను ...

Read More »

మద్యం పట్టివేత

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో ఆబ్కార్‌ ఆధికారులు దాడులు నిర్వహించి మద్యం పట్టుకున్నారు. సుదర్శన్‌రావు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన 140 క్వాటర్‌ సీసాలతో పాటు పది ఎంసి ఫుల్‌బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. సుదర్శన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Read More »

ఎన్నికల వరకు చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీ తనిఖీలు చేపట్టాలి

రెంజల్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల రోజు వరకు చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనికీలు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని కందకుర్తి అంతరాష్ట్ర చెక్‌పోస్టును పరిశీలించి తనిఖీల వివరాలు సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనుమానిత నగదు, మద్యంతోపాటు పెద్ద సంఖ్యలో బహుమతులు దొరికినా సీజ్‌ చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను ...

Read More »

యెండల విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ మంగళవారం 8,11,18వ డివిజన్‌లలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని బిజెపిని ప్రజలు ఆదరిస్తు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. బిజెపి గెలుపుపట్ల దీమా వ్యక్తం చేశారు. మార్కెట్‌ను సుందరీకరణ చేస్తామని, డ్రైనేజీ సమస్య పరిష్కరించి నగరాన్ని స్మార్ట్‌ సిటిగా మార్చడమే బిజెపి లక్ష్యమని అన్నారు. యువతకు ముద్ర పథకం ...

Read More »