Breaking News

Tag Archives: formation day

చిన్న జిల్లాల ద్వారా ప్రజలవద్దకు పాలన

  కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజల వద్దకు పాలన, శాంతిభద్రతలు పూర్తిగా చేరాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా ప్రథమ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రూ. 50 కోట్లతో అడ్లూర్‌ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్‌ భవనం, రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఎస్‌పి కార్యాలయాలకు మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం ...

Read More »

అలరించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రథమ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. తెలంగాణ సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద గీతాలు, నృత్యాలు అబ్బురపరచాయి. విద్యాశాఖ ద్వారా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్వహించారు. అనంతరం కామారెడ్డి జిల్లా ప్రథమ వార్షికోత్సవ సూచికను విడుదల చేశారు. అందులో జిల్లా ఏర్పడిన నాటినుంచి ఏడాదిలో చేసిన అభివృద్ది పనుల ...

Read More »

పిట్లంలో ఘనంగా యూత్‌కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

  పిట్లం, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలో బుధవారం యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఇందిరాగాంధి విగ్రహం వద్ద మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిఖిల్‌గౌడ్‌ జెండా ఆవిష్కరణ చేసి, జాతీయ రహదారి వరకు కాంగ్రెస్‌ పార్టీ నినాదాలు చేస్తు ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం యువకులు బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నిఖిల్‌గౌడ్‌ మాట్లాడుతూ ఇందిరాగాంధీ 1960లో యువజన కాంగ్రెస్‌ను ...

Read More »

యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయండి

బీర్కూర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కాంగ్రెస్‌ సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు విజయవంతం చేయాలని బాన్సువాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ హైమద్‌ అన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలోని కామప్ప చౌరస్తాలో ఘనంగా వేడుకలు నిర్వహించి జెండా ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజు పాల్గొంటారన్నారు. పార్టీ కార్యకర్తలు, యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు విజయవంతం చేయాలని కోరారు.

Read More »

ఘనంగా టిజివిపి ఆవిర్భావ దినోత్సవం

  కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం టిజివిపి 6వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల నవీన్‌ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగ సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టిజివిపి ప్రధానపాత్ర పోషించిందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేపడుతున్నట్టు తెలిపారు. ఆగష్టు 2 వరకు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌ నాయక్‌, ప్రతినిధులు రాజు, ఓంకార్‌, పృథ్వీ, ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం పలువురు రక్తదానం చేశారు. మాజీ కౌన్సిలర్‌ కాంశెట్టి, కెవిఎస్‌ మెంబరు బుచ్చయ్యతోపాటు పలువురు అధికారులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరు రక్తదానం చేయాలని, ప్రతి ఒక్కరి రక్తదానం ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తిని కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపి బి.బి.పాటిల్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి, ...

Read More »

అమరవీరుల స్థూపం వద్ద నివాళులు

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులు అర్పించారు. అవతరణ ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణ శివారులోని హౌజింగ్‌ బోర్డు వద్ద అమరుల స్థూపాన్ని నిర్మించారు. స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అమరులకు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కోసం అమరవీరులు చేసిన త్యాగాలు మరువలేనివన్నారు. వారి పోరాటాల ఫలితంగానే తెలంగాణ సిద్దించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ ...

Read More »

మహిళలకు ముగ్గుల పోటీలు

  కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళలు, బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన వారికి ఆవిర్భావ వేడుకల్లో బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు చంద్రమోహన్‌, గంగాదర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

జిల్లాస్తాయి పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

  కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా యువజన, క్రీడల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొనదలచుకున్న క్రీడాకారులు మే 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్‌రెడ్డి తెలిపారు. అథ్లెటిక్స్‌ను ఇందిరా గాంధీ స్టేడియంలో, కబడ్డి, వాలీబాల్‌, ఖోఖోలను సరస్వతి శిశుమందిర్‌ విద్యాలయంలో నిర్వహించనున్నామన్నారు. వివరాలకు 08468-220090 నెంబర్లో సంప్రదించాలని కోరారు. 19 సంవత్సరాల యువత పోటీలకు అర్హులని వివరించారు.

Read More »

అవతరణ దినోత్సవ వేడుకలు పండగలా జరపాలి

  – జిల్లా కలెక్టర్‌ కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 3వ తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను పండగ వాతావరణంలో జరుపుకునేందుకు అవసరమగు ఏర్పాట్లు పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయం నుంచి తహసీల్దార్లు, ఎంపిడివోలతో హరితహారం, ఉపాధి హామీ పథకం, రాష్ట్ర అవతరణ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ, మండలం, డివిజన్‌, జిల్లా స్థాయిలో అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. గ్రామ పంచాయతీ ...

Read More »

కూలీ పనిచేసిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

  నందిపేట, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌లో నిర్వహించనున్న తెరాస 16వ ఆవిర్భావ సభకు వెళ్లేందుకు అవసరమైన త్రోవ ఖర్చుకోసం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నందిపేటలో బుధవారం కూలీపనిచేసి లక్ష 50 వేలు సంపాదించారు. సిలిండర్ల గోదాములో సిలిండర్లు ఎత్తినారు, అలాగే హోటల్‌లో ఛాయ్‌ విక్రయించారు. పెట్రోల్‌ బంక్‌లలో పెట్రోల్‌ విక్రయించి రూ. 40 వేలు, రెండు రైస్‌మిల్లుల్లో సంచులుమోసి రూ. 35 వేలు, లక్కంపల్లి సెజ్‌లో లేబర్‌ పనిచేసి రూ. 50 వేలు సంపాదించారు.

Read More »

తెరాస సభకు ముమ్మర ఏర్పాట్లు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌లో నిర్వహించనున్న తెరాస ఆవిర్భావ దినోత్సవ సభకు జనసమీకరణ చేసేందుకు ప్రజాప్రతినిధులు, తెరాసశ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బాన్సువాడ, కామారెడ్డిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌లు ట్రాక్టర్లనుసిద్దం చేస్తున్నారు. ఎండ వేడిమి నుంచి రక్షణ పొందేందుకు వెదురుబొంగులు, తడకలతో ట్రాక్టర్లపై ప్రత్యేకంగా పైకప్పులు ఏర్పాటు చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోనే వందకు పైగా ట్రాక్టర్లను ఇందుకోసం సిద్దం చేస్తున్నారు. కామారెడ్డిలోనూ ఏర్పాట్లు సాగుతున్నాయి.

Read More »

ఘనంగా కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ ఆద్వర్యంలో పార్టీ కార్యాలయ ఆవరణలో కేక్‌ కట్‌ చేసి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఇందిరా గాంధీ స్టేడియంలో కామారెడ్డి,నిజామాబాద్‌ జిల్లాల అండర్‌-17 క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన సాందీపని కళాశాల జట్టుకు ట్రోఫీ బహుకరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి 131 సంవత్సరాలు పూర్తయి ...

Read More »

ఘనంగా కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలు

  బీర్కూర్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బీర్కూర్‌ గ్రామంలో, నసురుల్లాబద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ దివిటి శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడి నేటికి 138 సంవత్సరాలు గడుస్తుందని ఆయన అన్నారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న పార్టీని నిన్న, మొన్న పుట్టిన పార్టీలు చులకనగా మాట్లాడడం తగదని హెచ్చరించారు. ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి తెలంగాణ ఇచ్చే వరకు ...

Read More »

మంచుకొండలపై అవతరణ సంబరాలు

నిజామాబాద్‌ అర్బన్‌: తెలంగాణ రాష్ట్ర అవతర ఉత్సవాల సందర్భంగా జిల్లా నుంచి పర్వాతారోహణకు వెళ్లిన యువకులు మంచుకొండలపై గురువారం తెలంగాణ ఆవిర్భావ సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులావ్యాలీలో ఉన్న 5,226 మీటర్ల ఎత్తు ఉన్న పర్వతంపై ఈ సంబరాలు నిర్వహించారు. తెలంగాణ పార్టీ జెండాను, తెలంగాణ జాగృతి జెండాను, జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సంబరాలలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మలోవత్‌ రాజశేఖర్‌, విశాల్‌ శర్మ, బాస వినీత్‌ రావు ఉన్నారు. వీరు పర్వాతారోహణకు ఎంపి కవిత రూ. లక్ష ...

Read More »

బోధన్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

  బోధన్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బోధన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌, తహసీల్దార్‌ సుదర్శన్‌, ఎంపిపి గంగాశంకర్‌, ఎంఇవో శంకర్‌, తెరాస నాయకులు, కుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద, తహసీల్‌ కార్యాలయం, మునిసిపల్‌ కార్యాలయం, ఎంపిపి కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయజెండాలు ఆవిష్కరించారు. అనంతరం అంబేడ్కర్‌ చౌరస్తాలోఅన్నదాన ...

Read More »