Breaking News

Tag Archives: Gampa Govardhan

ప్రజలు అభివృద్దికే పట్టం కడతారు

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగున్నరేల్ల పాటు ప్రజలకు సంక్షేమ పాలన అందించిన తెరాసకే తిరిగి పట్టం కడతారని కామారెడ్డి తెరాస అభ్యర్థి గంప గోవర్దన్‌ అన్నారు. ఎన్నికల అనంతరం శనివారం ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల అనంతరం అన్ని ఛానెళ్లు, పత్రికలు విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఇదేవిషయం స్పష్టమైందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కెసిఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. మహాకూటమి ...

Read More »

సొంత గ్రామంలో అభివృద్ది చేయలేనివారు నియోజకవర్గంలో ఏంచేస్తారు

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన సొంత గ్రామమైన బస్వాపూర్‌ను అబివృద్ది చేసుకోలేని గంప గోవర్దన్‌ ఇక నియోజకవర్గాన్ని ఏం అబివృద్ది చేస్తారని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. సోమవారం భిక్కనూరు మండలం బస్వాపూర్‌, కాచాపూర్‌లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస నాయకులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తెరాసకు ఓటు వేయకపోతే తరువాత వారి అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో కొందరు తెరాస కార్యకర్తలను గుండాలను, రౌడీలుగా మార్చి ...

Read More »

తెరాసలో చేరిన మైనార్టీలు

కామారెడ్డి రూరల్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపూర్‌కు చెందిన కొందరు మైనార్టీలు శుక్రవారం ప్రయివేటు ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెరాస పార్టీ అభ్యర్తి గంప గోవర్దన్‌ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందన్నారు. కార్యక్రమంలో ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, నాయకులు జమీల్‌, అంజద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

గంపకు ఘన స్వాగతం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి నియోజకవర్గ తెరాస అభ్యర్తిగా ముఖ్యమంత్రి గంప గోవర్ధన్‌ను ప్రకటించిన అనంతరం సోమవారం తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ కామారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా తెరాస శ్రేణులు భారీ బైక్‌ ర్యాలీతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక పార్శి రాములు కళ్యాణమండపంలో జరిగిన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో తెరాస యువజన విభాగం, గోవన్న సైన్యం ఆధ్వర్యంలో గోవర్ధన్‌ను గజమాలతో సన్మానించి కత్తిని అందించి ఎన్నికల ప్రచారానికి ...

Read More »

తెలంగాణ ప్రభుత్వంలోనే అభివృద్ది పనులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస హయాంలోనే అభివృద్ది పనులు ఎక్కువగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. శనివారం దోమకొండ మండలంలో నూతనంగా నిర్మించిన బిటి రోడ్డు పనులను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలను అభివృద్ది చేసింది సిఎం కెసిఆర్‌ నాయకత్వంలోనేనని కొనియాడారు. అనంతరం కామారెడ్డి పట్టణంలో యంత్రలక్ష్మి పథకం కింద భవానిపేటకు చెందిన గోపు సంతోష్‌కు ట్రాక్టర్‌ అందించారు. కార్యక్రమంలో నాయకులు మధుసూదన్‌రావు, నందరమేశ్‌, పిప్పిరి ఆంజనేయులు, బల్వంత్‌రావు తదితరులున్నారు.

Read More »

ఐదుగురికి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శుక్రవారం ఐదుగురికి చెక్కులు పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని ఐదుగురు బాధితులు వివిధ రోగాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన లక్ష 69 వేల రూపాయలను అందించారు.

Read More »

కార్మికశాఖ కార్యాలయంలో సిబ్బందిని నియమించాలని వినతి

  కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ కార్యాలయంలో తగినంత సిబ్బందిని నియమించాలని గురువారం కార్మిక నాయకులు ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికశాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌లు బదిలీపై వెళ్ళారని, సిబ్బంది లేకపోవడంతో కార్యాలయానికి వచ్చిన వారిని తిప్పి పంపుతున్నారన్నారు. జిల్లాలో 50 వేల గుర్తింపు కార్మికులు, 9 వేల భవన కార్మికులు ఉన్నారని, వీరికోసం అధికారులు అవసరమని పేర్కొన్నారు. ఏర్పాటు ...

Read More »

కామారెడ్డిని అగ్రగామిగా నిలపాలి

నిజామాబాద్‌, మార్చి 13 – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి న్యూస్‌ : కామారెడ్డిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వ విప్‌ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్దన్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కిరాణ వర్తక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే ప్రసంగించారు. కామారెడ్డి వ్యాపారులకు రాష్ట్ర స్థాయిలో పేరుందని, వ్యాపారాన్ని మరింత అభివృద్ది పరచాలని ఆకాంక్షించారు. కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మారుస్తానని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వ్యాపారుల సంక్షేమానికి తనవంతు ...

Read More »