Breaking News

Tag Archives: gandhari

నీటి దినోత్సవంలో పాల‌నాధికారి

గాంధారి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటి దినోత్సవం సందర్బంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ మొక్కల‌కు నీళ్లు పట్టారు. గాంధారి మండలం పొతంగల్‌ కలాన్‌ గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ నాటిన మొక్కల‌కు నీళ్లు పట్టారు. అక్కడ రెండు మొక్కల‌ను నాటారు. ప్రకృతి వనంలోని మొక్కల‌ను తిల‌కించారు. మొక్కలు ఏపుగా పెరగడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిదంగా గ్రామానికి సమీపంలో కోతుల‌కు ఆహార కేంద్రం ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. మొక్కల‌ను ...

Read More »

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎంఎల్‌సి జన్మదిన వేడుకలు

గాంధారి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత జన్మదిన వేడుకలు రామారెడ్డి మండల‌ కేంద్రంలోని కాల‌భైరవ స్వామి ఆల‌యంలో శనివారం నిర్వహించారు. ఆల‌యంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు అనంత రాములు ఆధ్వర్యంలో రామారెడ్డి జాగృతి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం పులిహోర ప్రసాదాన్ని వితరణ చేశారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా బాద్యులు వంశీ, వెంకటరెడ్డి, చక్రధర్‌, రాజు, పద్మజా, జీవన్‌ గౌడ్‌, చంద్రం తదితరులు పాల్గొన్నారు.

Read More »

చికిత్స పొందుతూ యువతి మృతి

గాంధారి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పురుగుల‌ మందు తాగి ఆత్మహత్యకు పాల్ప‌డిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్దరాత్రి మృతి చెందినట్లు గాంధారి ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. మండలంలోని మాధవపల్లి గ్రామానికి చెందిన రాయల‌ సౌందర్య (21) గత నెల‌ 18 వ తేదీన వారి ఇంటి వద్ద ఖాలీ స్థలంలో పురుగుల‌ మందు తాగి ఆత్మహత్యకు పాల్ప‌డినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి యువతిని నిజామాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ ...

Read More »

గాంధారిలో వాటర్‌ ప్లాంట్లు ప్రారంభం

గాంధారి, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని వివిధ గ్రామాల‌లో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను సోమవారం ప్రారంభించారు. సఫ ఆర్గానిక్‌ లిమిటెడ్‌ అధినేత, శాస్త్రవేత్త అయిన పైడి ఎల్లారెడ్డి తన సొంత ఖర్చుల‌తో మండలంలోని మేడిపల్లి, సితాయిపల్లి, పెట్‌ సంగేమ్‌, నర్సాపూర్‌ గ్రామాల‌లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా అయన ఆయా గ్రామాల‌ ప్రజాప్రతినిధుల‌తో కలిసి వాటిని ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజల‌కు మినరల్‌ వాటర్‌ అందించాల‌నే ఉద్దేశ్యంతో ...

Read More »

నేరల్‌ తండాలో సీసీ కెమెరాలు ఏర్పాటు

గాంధారి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం నేరల్‌ తండా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. తండా వాసుల సహకారంతో గ్రామ రక్షణ కొరకు ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. తండాలోని ప్రధాన కూడళ్లలో కెమెరాలు బిగించినట్లు అయన తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం గ్రామ పెద్దల సమక్షంలో వాటిని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కామెది బాయి చందా నాయక్‌, ఉప సర్పంచ్‌ నర్సింగ్‌, వైస్‌ ఎంపీపీ భజన్‌ లాల్‌ ...

Read More »

బాధితునికి ఆర్థిక సహాయం అందజేత

గాంధారి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల మొక్కజొన్న కేంద్రం వద్ద ప్రమాదానికి గురైన హమాలీ కుటుంబానికి పలువురు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన కల మల్లేష్‌ స్థానిక మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద హమాలీ పనిచేస్తుండగా ఆర్టీసి బస్సు ఢీకొనడంతో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక సొసైటీ చైర్మన్‌ ఐడీసీఎంస్‌ డైరెక్టర్‌ సాయికుమార్‌, స్థానిక సర్పంచ్‌ సంజీవ్‌ యాదవ్‌, వీడీసీ చైర్మన్‌ మల్లేష్‌ ...

Read More »

సమాచార హక్కుచట్టం క్యాలండర్‌ ఆవిష్కరణ

గాంధారి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాచార హక్కుచట్టం క్యాలండర్‌ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ శనివారం ఆవిష్కరించారు. 2021 కు సంబందించిన మొత్తం 12 నెలల క్యాలండర్‌ ఎంతో బాగుందని ఎమ్మెల్యే అన్నారు. సమాచార హక్కుచట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం, జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సత్యం, సమాచార హక్కుచట్టం జిల్లా కార్యదర్శి రమేష్‌, సంజీవులు, మండల ప్రతినిధులు సురేష్‌, కష్ణ, సాయిలు, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

నర్సరీలలో మొక్కలు సంరక్షించాలి

గాంధారి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నర్సరీలలో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని కామారెడ్డి ఏపిడి, ఇంచార్జ్‌ డిపిఓ సాయన్న అన్నారు. శనివారం గాంధారి మండలకేంద్రంలో నర్సరీని అయన పరిశీలించారు. ఈ సందర్బంగా సీడ్‌ దిబ్లింగ్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించగా దానిని తిలకించారు. మొక్కలు పెంచే క్రమంలో వాటి విత్తనాలు నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. మొక్కలకు ఎప్పటికప్పుడు నీటిని అందించాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు నర్సరీల బాధ్యతలు స్వీకరించి వాటిని కాపాడే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌, ఎంపీపీ ...

Read More »

అటవీఅధికారుల నుండి భూములకు రక్షణ కల్పించాలి

గాంధారి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం నిరుపేదలైన తమకు అన్ని హక్కులు కల్పించి ఇచ్చిన వ్యవసాయ భూములకు అటవీ అధికారుల నుండి కాపాడి రక్షణ కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. గాంధారి మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామశివారులో గత 40 సంవత్సరాలనుండి సర్వే నెంబర్‌ 118 లో నిరుపేద రైతులు వ్యవసాయం సాగిస్తున్నారు. వీరికి ప్రభుత్వం సర్వ హక్కులు కల్పించి నూతన పట్టా పాసుపుస్తకాలు కూడా జారీచేసింది. ఇట్టి భూమికి పట్టతో సహా అన్ని హక్కులు కల్పించింది. ఇట్టి భూమిని ...

Read More »

కరోనా డ్రై రన్‌లో నిర్లక్ష్యం ..మెడికల్‌ ఆఫీసర్‌ పై బదిలీ వేటు

గాంధారి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా డ్రై రన్‌లో మెడికల్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ హెచ్చరించారు. జిల్లాలోని గాంధారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న డ్రై రన్‌ కార్యక్రమంలో భాగంగా నిబంధనలు సరిగ్గా పాటించని మెడికల్‌ ఆఫీసర్‌పై కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్బంగా శుక్రవారం గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. నిబంధనలు పాటించని మెడికల్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌పై బదిలీ వేటు వేశారు. నిర్లక్ష్యంగా ...

Read More »

మొక్కలు సంరక్షించాలి

గాంధారి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నర్సరీలలో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని కామారెడ్డి జడ్పీ సీఈఓ చందర్‌ నాయక్‌ అన్నారు. మంగళవారం గాంధారి మండలంలో ప్రభుత్వంచే నిర్వహిస్తున్న పలు నర్సరీలను అయన పరిశీలించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలో నర్సరీలో పెంచుతున్న మొక్కలను దగ్గరినుండి పరిశీలించారు. నర్సరీలతో పాటు ఇటీవల హరితహారంలో నాటిన మొక్కలకు ఎప్పటికప్పుడు నీటిని అందించాలన్నారు. నాటిన ప్రతి మొక్క బ్రతకాలన్నారు. ప్రత్యేకంగా నర్సరీలలో పెరుగుతున్న మొక్కలపై శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. అయన వెంట ఎంపీడీఓ ...

Read More »

బాధిత కుటుంబానికి కాంగ్రెస్‌ సాయం

గాంధారి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితునికి కాంగ్రెస్‌ నాయకులు సహాయం అందించారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన మద్దెల కాశయ్య ఇల్లు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న గాంధారి మండల కాంగ్రెస్‌ నాయకులు తగిన సహాయం అందించారు. బాధితునికి, కుటుంబానికి దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాలరాజ్‌, కాంగ్రెస్‌ నాయకులు మదార్‌, లైన్‌ రమేష్‌, గడ రాజు, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

మంగళవారం గాంధారికి మంత్రి రాక

గాంధారి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మంగళవారం పర్యటించనున్నట్లు మండల తెరాస నాయకులు తెలిపారు. పలు అభివద్ధి కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు గిరిజన గురుకుల పాఠశాల ఆవరణలో జరిగే సభలో పాల్గొంటారని అన్నారు. మండల కేంద్రాలోని కేజీబీవీ ఆవరణలో నూతనంగా కోటి యాభై నాలుగు లక్షలతో నిర్మించిన నూతన కళాశాల భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మండలంలో నిర్మించే ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన ...

Read More »

రైతులకు మద్దతుగా వామపక్షాల ధర్నా

గాందారి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు మద్దతుగా దేశవ్యాప్త వామపక్షాల పిలుపులో భాగంగా సోమవారం వామపక్ష నాయకులు గాంధారి మండలంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వామపక్ష నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ ఆందోళన చేస్తున్నారని అన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఆధాని, అంబానీలకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రధాన మంత్రి మోడీకి రైతులు ...

Read More »

ప్రేమ జంట ఆత్మహత్యయత్నం

గాంధారి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓ ప్రేమజంట ఆత్మహత్యయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ ప్రియురాలు మతిచెంది, ప్రియుడు చికిత్స పొందుతున్న సంఘటన గాంధారి మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండలం పొతంగల్‌ కలాన్‌కు చెందిన గాండ్ల సాయికుమార్‌ వడ్లూర్‌ గ్రామానికి చెందిన తన మరదలు గాండ్ల రమ్య (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని ఈ నెల 11 వ తేదీన శుక్రవారం గాంధారి ...

Read More »

మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం

గాంధారి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని పొతంగల్‌ కలాన్‌ గ్రామంలో ఆదివారం స్థానిక సర్పంచ్‌ బాలరాజ్‌ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఐడీసీఎంస్‌ ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతుల వద్దనుండి మక్కలను కొనుగోలు చేస్తున్నట్లు అయన తెలిపారు. ముక్కలకు మద్దతు ధర క్వింటాలుకు 1850 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. పంచాయతీ పరిధిలో గల రైతులు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద టోకెన్‌లు పొంది కొనుగోలు కేంద్రంలో తాము పండించిన మక్కలను విక్రయించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ...

Read More »

గాంధారి లాక్‌ డౌన్‌

గాంధారి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజు రోజుకి కరోన మహమ్మారి విస్తరిస్తున్నందున గాంధారిలో చాలా పాజిటివ్‌ కేసులు నమోదై ఉన్నాయని, ఇంకా పాజిటివ్‌ కేసులు వస్తూనే ఉన్నాయని గాంధారి గ్రామ పంచాయతీ పాల‌కవర్గ సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో గాంధారి నిత్యావసరాల‌ వస్తువుల‌ దుకాణ సముదాయాల‌ వారు, వర్తక వాణిజ్య సంఘాల‌ వారు స్వతహాగా గాంధారి పాల‌కవర్గంతో పాటు గ్రామాభివృద్ధి కమిటీతో కలిసి పలు తీర్మానాలు చేశారు. దుకాణ సముదాయాలు జూలై 21వ తేదీ ...

Read More »

16, 17 తేదీల్లో పూర్తిగా బంద్‌

గాంధారి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజు రోజుకి కరోన మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో గాంధారిలో చాలా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఇంకా పాజిటివ్‌ కేసులు వస్తూనే ఉన్నాయని గాంధారి గ్రామ పంచాయతీ పాల‌కవర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా మంగళవారం జరిగిన సమావేశంలో గాంధారిలో నిత్యావసరాల‌ వస్తువుల‌ దుకాణ సముదాయాల‌ వారు, వర్తక వాణిజ్య సంఘాల‌ వారు స్వతహాగా గాంధారి పాల‌కవర్గంతో పాటు గ్రామాభివృద్ధి కమిటీతో కలిసి పలు విషయాలు తీర్మానించారు. దుకాణ సముదాయాలు 16, 17వ తేదీలు ...

Read More »

గాంధారిలో ఒకరికి పాజిటివ్‌

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో మరొకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ తెలిపారు. 18 మందికి పరీక్షలు నిర్వహించగా గాంధారికి చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. మిగతా 17 మందికి నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు. కాగా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని హైదరాబాద్‌ తరలించామన్నారు. కరోనా విజృంభనతో కామారెడ్డి వ్యాపారులు బుధవారం నుండి పట్టణంలో వ్యాపార సంస్థలు ఉదయం 9 గంటల‌ నుండి సాయంత్రం 4 గంటల‌ వరకు ...

Read More »

స్వచ్ఛ గాంధారి

గాంధారి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం గాంధారి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ గాంధారిలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తడి పొడి చెత్త బుట్టలు ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ చేతుల‌ మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా పరిశుభ్రత కొరకు చెత్తబుట్టలు సద్వినియోగం చేసుకొని పరిసరాల‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాల‌ని కోరారు. కార్యక్రమంలో గాంధారి మండల‌ నాయకులు పాల్గొన్నారు.

Read More »