Breaking News

Tag Archives: Kamareddy

ప్రజా వ్యతిరేక సునామిలో తెరాస కొట్టుకుపోవడం ఖాయం

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా వ్యతిరేకసునామిలో తెరాస కొట్టుకుపోవడం ఖాయమని కామారెడ్డి కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థి మహ్మద్‌ షబ్బీర్‌ అలీ అన్నారు. శనివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొందరపాటు నిర్ణయంతో కెసిఆర్‌ ముందస్తు ఎన్నికల పేరిట రాష్ట్రంపై ఎన్నికల ఖర్చు భారాన్ని రుద్దారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 6న అసెంబ్లీ రద్దుచేసి అదేరోజు అభ్యర్థులను ప్రకటించడం వెనక ఆయన కోట్లాది రూపాయల పార్టీ ఫండ్‌ సమకూర్చుకున్న విషయం స్పష్టమవుతుందన్నారు. 18 ...

Read More »

కామరెడ్డి జిల్లాలో 83.05 శాతం పోలింగ్‌

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన పోలింగ్‌లో 83.05 శాతం పోలింగ్‌ నమోదైనట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శనివారం స్థానిక ఏఎంసి గోదాములో కామరెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు ముగిసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఓటింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్న ఓటర్లకు, సహకరించిన మీడియా, ఎన్నికల సిబ్బంది, పోలీసులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు నియోజకవర్గాలు కలిపి 5 లక్షల 78 వేల మంది ఓటర్లు ...

Read More »

ఘనంగా అయ్యప్ప పడిపూజ

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అయ్యప్ప భక్తులు అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు. మాలధారులు పడిపూజలో అయ్యప్ప నామస్మరణ చేస్తు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణతో బక్తులు లీనమయ్యారు.

Read More »

ఆకట్టుకున్న మాడల్‌ పోలింగ్‌ స్టేషన్లు

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్లను ఆకర్షించేందుకు ఓట్ల శాతం పెరిగేందుకు రూపొందించిన మాడల్‌ పోలింగ్‌ స్టేషన్లు ఆకట్టుకున్నాయి. కామరెడ్డి మునిసిపాలిటి కార్యాలయం, ఎల్లారెడ్డి జడ్పిహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాలలో, బిచ్కుంద జడ్పిహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన మాడల్‌ పోలింగ్‌ కేంద్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటితోపాటు కామరెడ్డిలోని లింగాపూర్‌లో దివ్యాంగుల మాడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. ఓటింగ్‌ అనంతరం ఓటర్లు పోలింగ్‌ స్టేషన్ల బయట సెల్ఫీలు దిగుతూ తాము ఓటు వేశాము, మీరు ఓటు వేయండని సోషల్‌ ...

Read More »

కామరెడ్డి అభివృద్ది చెందింది కాంగ్రెస్‌ హయాంలోనే

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ది చెందింది తాను కాంగ్రెస్‌నుంచి గెలిచి రెండు సార్లు మంత్రిగా పనిచేసిన హయాంలోనేనని కాంగ్రెస్‌ అభ్యర్తి షబ్బీర్‌ అలీ అన్నారు. బుధవారం ఆయన కామారెడ్డి పట్టణంతోపాటు ఉగ్రవాయి గ్రామాల్లో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్‌షోలో జనాన్ని చూస్తుంటే విజయోత్సవ ర్యాలీని తలపిస్తుందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి ఎన్నికల్లో గెలుస్తానన్న నమ్మకాన్ని కల్పించిందని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నపుడు నియోజకవర్గ అభివృద్ది కోసం ఎన్నో పనులు చేశానని, ...

Read More »

మద్యం పట్టివేత

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో ఆబ్కార్‌ ఆధికారులు దాడులు నిర్వహించి మద్యం పట్టుకున్నారు. సుదర్శన్‌రావు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన 140 క్వాటర్‌ సీసాలతో పాటు పది ఎంసి ఫుల్‌బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. సుదర్శన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Read More »

తెరాసకు ఓటు వేసి సంక్షేమానికి మద్దతు పలకాలి

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాసకు ఓటు వేసి సంక్షేమానికి మద్దతు పలకాలని కామారెడ్డి అసెంబ్లీ తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్‌ అన్నారు. సోమవారం ఆయన లచ్చాపేట్‌, కాకులగుట్ట, రాజీవ్‌నగర్‌ కాలనీతో పాటు పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెరాస ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, బడుగు, బలహీన వర్గాలు రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు ప్రగతి పనుల్లో ముందుకెళ్లేందుకు తెరాసను ...

Read More »

అవినీతో, సంక్షేమమే ప్రజలే తేల్చాలి

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ది కావాలో, అవినీతి కావాలో ప్రజలే ఓటు ద్వారా తేల్చుకోవాలని కామారెడ్డి అసెంబ్లీ బిజెపి అబ్యర్తి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాచారెడ్డి మండలం ఆరేపల్లితోపాటు పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లకు పైగా వివిధ పార్టీల నాయకులు కామారెడ్డిని ఏలారని, వారు చేసిన అవినీతి తప్ప అభివృద్ది ఎక్కడుందని ప్రశ్నించారు. అభివృద్ది గురించి ప్రశ్నిస్తే కామారెడ్డి గాంధీ విగ్రహం సాక్షిగా ఇద్దరు మాజీ ...

Read More »

కామారెడ్డిలో జ్యోతిబాఫూలే వర్ధంతి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహుజన ఐక్యవేదిక, ఎంసిపిఐయు పార్టీ ఆద్వర్యంలో కామారెడ్డిలో బుదవారం జ్యోతిబాఫూలే 128వ వర్ధంతి నిర్వహించారు. మునిసిపల్‌ కార్యాలయం ఎదుట గల ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వేదిక జిల్లా కన్వీనర్‌ సిద్దిరాములు మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం అణగారిన వర్గాల కోసం బహుజన సమాజ శ్రేయస్సు కోసం ఫూలే చేసిన త్యాగాలు, కృషి ఎనలేనివన్నారు. జ్యోతిబాఫూలే సావిత్రిబాయి ఫూలే, అంబేడ్కర్‌ ఆశయాల సాదనకు బహుజన సంఘాలు ఏకం కావాలని ...

Read More »

చురుకుగా సాగుతున్న ఎన్నికల ఏర్పాట్లు

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబరు 7న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వాటికి సంబందించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఎన్నికలు, కౌంటింగ్‌ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం జిల్లాకు కేటాయించిన బ్యాలెట్‌ యూనిట్‌ రిజర్వుగా ఉన్నవాటిలో రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో 269 బ్యాలెట్‌ యూనిట్లను మేడ్చల్‌ జిల్లాకు తరలించారు. కామారెడ్డి, జుక్కల్‌, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించి ...

Read More »

కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తాం

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ నియోజకవర్గ అబ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని 1,2,3,4,5వ వార్డుల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో పదేళ్ల నుంచి అభివృద్ది కుంటుపడిందని, రోడ్లు, మురికి కాలువలు లేక ప్రతి వాడ మురికి వాడగా మారిందని అన్నారు. ప్రజలు ఇళ్లులేక అద్దె ఇళ్లల్లో ఉంటూ అద్దెకట్టలేకపోతున్నారని పేర్కొన్నారు. గంప గోవర్ధన్‌ ఏనాడైనా పట్టణంలోని వార్డుల్లో పర్యటించారా ...

Read More »

కామారెడ్డిని అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చిన మాజీలు

కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కామారెడ్డిని అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా కామారెడ్డిని పాలించిన మాజీ ఎమ్మెల్యేలు మార్చారని కామారెడ్డి నియోజకవర్గ బిజెపి అసెంబ్లీ అభ్యర్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన దోమకొండ మండలం సీతారాంపల్లి మాచారెడ్డిమండలం ఫరీద్‌పేట, కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపుర, బడా కసాబ్‌గల్లితోపాటు పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకాల పేరుతో కోట్లు దోచుకొని ఇపుడు ఓట్లు కొనుక్కోవడానికి మాజీ ఎమ్మెల్యేలు ప్రజల వద్దకొస్తున్నారని అలాంటి అవినీతి నేతలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ...

Read More »

తెరాసతోనే ప్రగతి సాధ్యం

  కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెరాసతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని కామారెడ్డి తెరాస అసెంబ్లీ అభ్యర్థి గంప గోవర్దన్‌ అన్నారు. బుధవారం ఆయన మాచారెడ్డి మండలం పాల్వంచ, యెలుపుగొండ, వాడి, ఫరీద్‌పేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రాపాలకులు తెలంగాణను నాశనం చేశారని, కెసిఆర్‌ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. కెసిఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని, విపక్ష పార్టీల నాయకులు ...

Read More »

ఉపకార వేతనాల దరఖాస్తు తేదీ పొడిగింపు

  కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు డిగ్రీ, పిజి, బిఇడి ఇతర అన్ని కళాశాలల్లో బిసి, ఈబిసి విద్యార్థులకు పోస్టుమెట్రిక్‌ ఉపకార వేతనాల దరఖాస్తు తేదిని పొడిగించినట్టు జిల్లా వెనకబడిన తరగతుల అధికారి తెలిపారు. డిసెంబరు 31 వరకు దరఖాస్తు తేదీని పొడిగించినట్టు చెప్పారు. 2018-19 విద్యాసంవత్సరానికి గాను బిసి, ఈబిసి విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ష్ట్ర్‌్‌జూ://్‌వశ్రీaఅస్త్రaఅaవజూaరర.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Read More »

సోమవారం నామినేషన్లు నిల్‌

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సోమవారం ఒక్క నామినేషన్‌ దాఖలు కాలేదు. అన్ని పార్టీల అభ్యర్థులు మంచి రోజులు, తిథులు, నక్షత్రాలు చూసుకొని నామినేషన్‌ సమర్పించేందుకు సిద్దపడడంతో సోమవారం ఒక్కనామినేషన్‌ కూడా దాఖలు కాలేదని అధికారులు చెప్పారు.

Read More »

కలెక్టర్‌ క్యాంపు కార్యాలయ పనుల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో నిర్మితమవుతున్న జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయ పనులను సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. కార్యాలయంతోపాటు స్థానిక ఏఎంసి గోదాములో ఉన్న ఎన్నికల స్ట్రాంగ్‌ రూంను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, మునిసిపల్‌ కమీషనర్‌ రామాంజులురెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం రఘునాథ్‌, ఆర్‌అండ్‌బి డిప్యూటి ఇంజనీర్‌ శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సుధీర్‌, ఎన్నికల సిబ్బంది పవన్‌ ...

Read More »

వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన శ్రీనివాస్‌ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరులేని సమయంలో ప్యానుకు ఉరివేసుకొని మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు.

Read More »

తెరాసలో చేరికలు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ, బీబీపేట మండలాల్లోని ఆయా పార్టీలకు చెందిన కొందరు కార్యకర్తలు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్‌ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెరాస పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నేతలు ఆంజనేయులు, బల్వంత్‌రావు తదితరులున్నారు.

Read More »

బిజెపిలో పలువురి చేరిక

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు యువకులు శనివారం బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డి సమక్షంలో భారతీయ జనతాపార్టీలో చేరారు. పట్టణానికి చెందిన 20 మంది యువకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి బిజెపి కండువాతో పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోడి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్టు తెలిపారు. రమణారెడ్డి విజయానికి తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నీలం చిన్నరాజులు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కామారెడ్డిలో చాకలి ఐలమ్మ వర్ధంతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో వామపక్ష నాయకులు, ఎంబిసి ఆధ్వర్యంలో సోమవారం చాకలి ఐలమ్మ 33వ వర్ధంతి నిర్వహించారు. ఆర్‌అండ్‌బి అతిథి గృహం ఎదురుగా జాతీయ రహదారిపై గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరులూదిన స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. గడీల పాలన, దొరల పెత్తనాన్ని ఎదురించి వీర తెలంగాణ సాయుధ పోరాటానికి అంకురార్పణ చేసింది ఐలమ్మ ...

Read More »