కామారెడ్డి, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అనసూయ అనే వద్ద మహిళ రక్తలేమితో బాధపడుతు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా రెండు యూనిట్ల ప్లేట్లెట్స్ నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అవసరమైంది. కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సాప్ గ్రూపు నిర్వాహకులు బోనగిరి శివ కుమార్‌ను సంప్రదించగా కామారెడ్డికి చెందిన సాయి కష్ణ, ఎర్రం స్వామి ఇద్దరు యువకులు అత్యవసర సమయంలో రక్తదానం చేసి సేవ దక్పథాన్ని చాటారు. రక్తదాన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సాప్ ...
Read More »కామారెడ్డిలో వాజ్పాయ్ జయంతి
కామారెడ్డి, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని, భారత రత్న జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణాతార వాజ్పాయ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన జీవితాన్ని దేశానికి అంకితం చేసి దేశం అన్ని రంగాలలో ముందుకు సాగేలా తన వంతు కషి చేశారని, బీజేపీ సిద్ధాంతాలను గ్రామ గ్రామాన చేర వేయడంలో వాజ్పాయ్ కషి చేశారని ...
Read More »కిసాన్ సమ్మాన్ యోజనలో లక్ష 50 వేల మంది కామారెడ్డి రైతులకు లబ్ది
కామారెడ్డి, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి (సుపరిపాలన దినోత్సవం) సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా యసంగి పంట కోసం 9 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మన్ యోజన కింద 18 వేల కోట్ల రూపాయలు నేరుగా జమ చేయనున్నారని, అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో దాదాపు ఒక లక్ష యాబై ఒక్క వేల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు ...
Read More »శుక్రవారం మంత్రులచే పలు ప్రారంభోత్సవాలు
కామారెడ్డి, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ, కోఆపరేటివ్, మార్కెటింగ్ శాఖల మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభా వ్యవహారాలు, గహనిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంతరెడ్డి శుక్రవారం 25 తేదీన జిల్లాలో వివిధ అభివద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పది గంటలకు భికనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవం, ఇతర కార్యకమాలు, మధ్యాహ్నం 12 గంటలకు బికనూర్ మండల కేంద్రంలో ...
Read More »5 లక్షల చెక్ అందజేసిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరంట్ షాక్‌తో మతి చెందిన కామారెడ్డి మండలం చిన్న మాల్లారెడ్డి గ్రామానికి చెందిన నెలూరి రంజిత్ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గురువారం అందజేశారు. రంజిత్ మతి చెందగా ఆయన తండ్రి యాదగిరికి ట్రాన్స్‌కో ద్వారా మంజూరైన చెక్కును అందజేశారు.
Read More »25 శాతం తగ్గకుండా హాజరయ్యే విధంగా చూడాలి
కామారెడ్డి, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పనులకు కూలీలు 25 శాతం తగ్గకుండా హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ ఎండిఓ, ఎపిడి, ఎపిఓలను ఆదేశించారు బుధవారం జనహితలో గాంధారి, సదాశివనగర్, కామారెడ్డి, రామారెడ్డి, రాజంపేట బీబీపేట, బికనూర్, దోమకొండ, మాచారెడ్డి, తాడ్వాయి, లింగంపేట మండలాలలో జరుగుతున్న ఉపాధి హమీ, పల్లెప్రగతి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో కొత్త పనులను శ్రమశక్తి సంఘాల సమక్షంలో గుర్తించాలని, వారితో అండర్ టేకింగ్ ...
Read More »కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, భిక్కనూర్, రామారెడ్డి, రాజంపేట మండలాలకు చెందిన 261 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 61 లక్షల రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటి వరకు 32 కోట్ల 61 లక్షల 50 వేల రూపాయల కల్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కులు పంపిణీ చేసినట్టు ఆయన ...
Read More »రోడ్డు ప్రమాద బాధితుడికి ఉపాధ్యాయుని రక్తదానం
కామారెడ్డి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితుడికి బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వారికి కావలసిన రక్తాన్ని పట్టణానికి చెందిన సంగోజివాడిలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు జమీల్ హైమద్ సహకారంతో వీ.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గతంలో చాలా సార్లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ...
Read More »హద్దుల వద్ద దిమ్మెలు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చుట్టూ గుర్తించిన హద్దుల వద్ద దిమ్మెలు ఏర్పాటు చేయాలని కాలేజీ ప్రిన్సిపాల్‌ను జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్లో కాలేజీకి సంబంధించిన భూముల హద్దులను ఆయన పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో గత 2016 సంవత్సరంలో జిల్లా సర్వేల్యాండ్ రికార్డు శాఖ సర్వే చేయడం జరిగిందని, తిరిగి 2017 సంవత్సరంలో కూడా హద్దులు ఏర్పాటు చేయడం జరిగిందని, తిరిగి అదే రిపోర్టును జిల్లా ...
Read More »పశువులకు నట్టల నివారణ మాత్రలు
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం తిమ్మకపల్లి గ్రామంలో విజయడైరీ, జిల్లా పశువర్థక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో నట్టల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో అవులకు, గేదెలకు, ఎద్దులకు నట్టల నివారణ మాత్రలు వేశారు. అలాగే గోపాల మిత్ర బాబా గౌడ్ మాట్లాడుతూ పశువుల యాజమాన్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్ఞానేశ్వర్, డైరీ అధ్యక్షులు సాయిలు, ఉపాధ్యక్షులు భాస్కర్, రిలయన్స్ ఫౌండేషన్ సిఆర్పి వినాయక్, గోపాల మిత్ర బాబా గౌడ్, ...
Read More »23వ వార్డు వాసులు బిజెపిలోకి
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి పట్టణంలో 23వ వార్డ్‌కు సంబందించిన 30 మంది మహిళలతో సహా 68 మందికి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ కాటిపాల్లి వెంకటరమణ రెడ్డి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పక్కనున్న సిద్దిపేట, సిరిసిల్ల పట్టణాలు అభివద్ధిలో దూసుకు పోతుంటే కామారెడ్డి పట్టణం మాత్రం అభివద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టణ అభివద్ధికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ పట్టణంలో కేవలం మూడు నాలుగు వార్డుల్లో ...
Read More »జాగృతిని గ్రామస్థాయికి తీసుకెళ్ళాలి
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తెలంగాణ జాగతి విస్తత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కర్షక్ బీఈడి కళాశాలలో జాగతి జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల అనంత రాములు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి జిల్లా నలు మూలలనుండి తెలంగాణ జాగతి కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాగతి అధ్యక్షులు మాట్లాడుతూ జాగతిచే నిర్వహించే విద్య, వైద్య, సాంస్కతిక, సాహిత్య, మహిళా సాధికారిక లాంటి కార్యక్రమాలను మండల, గ్రామ స్థాయిలో తీసుకెళ్లడానికి సభ్యులు కషిచేయాలని సూచించారు. ...
Read More »కామారెడ్డిలో ఐదు గ్రామీణ అంగడిలు
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో ఐదు గ్రామీణ అంగడిలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జాతీయ, వ్యవసాయ గ్రామీణ అభివద్ధి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు అన్నారు. మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో నాబార్డ్ ఆధ్వర్యంలో గ్రామీణ అంగడిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కూరగాయలు విక్రయించడానికి గ్రామీణ అంగడి దోహదపడుతుందని సూచించారు. ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీతో రైతులకు రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వాటర్ షెడ్ కింద ...
Read More »పెరిగిన రేట్ల జీవో ఇవ్వాలి
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఐటియుసి ఆఫీసులో సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులు దశరథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యదర్శి జి రాజు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఎన్నోసార్లు ఉద్యమాలు చేయగా గత నెల నవంబర్‌లో ఎగుమతి దిగుమతి రేట్లు 18 నుండి 23 కు పెంచుకోవడం జరిగింది. అయినప్పటికీ పెరిగిన ధరలకు ఒక నెల గడిచినప్పటికీ ...
Read More »మోసపూరిత ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా వినియోగదారుల హక్కుల సంస్థ సహాయ ప్రధాన కార్యదర్శిగా నీరడి బాల్‌రాజ్, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా మడుపు శ్రీనివాస్, కామరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా ముచ్చార్లపు రనీల్రెడ్డిని నియమించినట్టు జిల్లా అధ్యక్షుడు రెడ్డిగారి రమేశ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసాయిపేట్ నరేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండి మోసాలకు గురికాకుండా ఉండాలని, ఏదైనా కల్తీ, నాణ్యత లేని ...
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 41 వార్డ్‌కు చెందిన సాజిద బేగం అనే మహిళకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందజేశారు. నియోజకవర్గంలో రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 506 మందికి 3 కోట్లల 28 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ...
Read More »కొత్త పనులు గుర్తించాలి
కామారెడ్డి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీలో కొత్త పనులు గుర్తించాలని, కొత్తగా కూలీలకు పనులు కల్పించాలని, చేసిన పనులను రిజిష్టర్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ మండల అభివద్ది అధికారులను, ఎపిడిలను, ఎపిఓలను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ పనులలో చేపట్టవలసిన పనులను, నిర్వహించవలసిన రిజిష్టర్లపై పలు ఆదేశాలు జారీ చేశారు. కొత్త పనులను గుర్తించాలని, చేసిన పనులను ఆన్లైన్ నమోదు వెంట వెంటనే నిర్వహించాలని, గ్రామ పంచాయితీ సెక్రటరీలు, ...
Read More »21 నుండి నమూనాల సేకరణ
కామారెడ్డి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో కోవిద్ -19 సెరో సర్వైలైన్స్ పరీక్ష ఫలితాలు భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసిఎంఆర్ వారు కరోనా వైరస్ వ్యాప్తి పరీక్షలను రెండుసార్లు నిర్వహించినట్టు జిల్లా వైద్య అధికారి డాక్టర్ శోభారాణి తెలిపారు. రెండవ విడుత కామారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాలలో ఆగష్టు 26, 27 తేదీలలో రెండవ విడుత సెరో సర్వైలెన్స్ ఫలితాలు ఈ విధంగా వున్నాయని తెలిపారు. చిన్నఎడ్డి, పెద్ద కొడపగల్, భవాస్పేట, నేరల్, ధర్మారం, ...
Read More »రైతులను వ్యాపారులుగా మార్చడానికే రైతు చట్టాలు
కామారెడ్డి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులను వ్యాపారులుగా మార్చడానికే రైతు చట్టాలు రూపొందించడం జరిగిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ తెలిపారు. నెల రోజులుగా రైతు బిల్లులపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయని, బిల్లులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులను రైతులుగానే ఉంచడానికి ఇవన్నీ చేస్తున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ మాట్లాడుతూ దేశం మొత్తంలో ఢిల్లీలో జరుగుతున్న నిరసనలో పంజాబ్, హర్యానా రైతులు ...
Read More »కామారెడ్డిలో పాజిటివ్ శాతం తక్కువ
కామారెడ్డి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) రెండో విడత సర్వే ద్వారా కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్, నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామాల్లో ఏడు శాతం పాజిటివ్ ఉందని ఐసీఎంఆర్ సమన్వయకర్త దినేష్ కుమార్ తెలిపారు. నల్గొండ, జనగాం, కామారెడ్డి జిల్లాలో ఆగస్టు నెలలో రెండో విడత సర్వే నిర్వహించామని చెప్పారు. నల్గొండ, జనగామ జిల్లాల కన్నా కామారెడ్డిలో పాజిటివ్ శాతం తక్కువగా నమోదైందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ ...
Read More »