Breaking News

Tag Archives: Kamareddy

వృద్దురాలికి రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల‌లో అడవి లింగాల‌ గ్రామానికి చెందిన సత్తవ్వ (65) అనే వృద్ధురాలికి ఆపరేషన్‌ నిమిత్తం బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పట్టణ కేంద్రానికి చెందిన మెకానిక్‌ సతీష్‌ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. గతంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాల‌ను కాపాడిన రక్తదాతను ...

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై వృద్ధునికి రక్తదానం

కామారెడ్డి, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి వైద్యశాల‌లో ఎల్లారెడ్డికి చెందిన ల‌తీఫ్‌ (80) సంవత్సరాల‌ వృద్ధునికి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన కమ్మరి నరేష్‌ చారి మానవతా దృక్పథంతో స్పందించి ఓ పాజిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో సురేష్‌, టెక్నీషియన్‌ ...

Read More »

చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామరెడ్డి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల‌కు చెందిన 202 మందికి ల‌బ్దిదారుల‌కు 2 కోట్ల 2 ల‌క్షల‌ 23 వేయిల‌ 432 రూపాయల‌ కల్యాణల‌క్ష్మి, షాది ముభారక్‌ చెక్కుల‌ను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3,747 మందికి 37 కోట్ల 12 ల‌క్షల‌ 2 వేల‌ 332 రూపాయల‌ కల్యాణల‌క్ష్మి, షాది మూభారక్‌ చెక్కులు ...

Read More »

వాటరింగ్‌ డే – మొక్కల‌కు నీరు

కామారెడ్డి, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాటరింగ్‌ డే సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టరు కార్యాల‌యంలో జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ మొక్కల‌కు నీరు పోశారు. అనంతరం కలెక్టరేటు కార్యాల‌యం ప్రధాన గేటు వద్ద ప్రజల‌ కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టరు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టరు వెంకటేశ్‌ ధోత్రే, ఆర్‌డిఓ ఎస్‌.శీను, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, కలెక్టరేటు ఎబ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read More »

ప్రతిరోజు వ్యాక్సినేషన్‌ రిపోర్టు సమర్పించాలి

కామారెడ్డి, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాక్సినేషన్‌ ఎక్కువగా జరిగితే పాజిటివ్‌ రేటు తగ్గుతుందని, ప్రభుత్వం ల‌క్ష్యంగా నిర్దేశించిన వారికి కోవిద్‌ వాక్సినేషన్‌ వంద శాతం జరుగాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ వైద్య అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం జనహిత భవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ల‌క్ష్యంగా నిర్దేశించిన వారికి ఆశా, ఎఎస్‌ఎం, అంగన్‌ వాడీ సిబ్బంది సహకారంతో ప్రతి ఆరోగ్య కేంద్రంలో వంద మందికి ...

Read More »

వేలం ద్వారా ల‌క్షల‌ ఆదాయం

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పోలీసు స్టేషన్‌లో పనిచేయని జనరేటర్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు, ఎల‌క్ట్రానిక్‌, ఫర్నీచర్‌, ఇతర సామాగ్రిని గురువారం వేలం వేసినట్టు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ డిఎస్‌పి ఉదయకృష్ణ తెలిపారు. కాగా వీటి ద్వారా రూ. 2 ల‌క్షల‌ 65 వేల‌ 500 ఆదాయం సమకూరినట్లు చెప్పారు. జిల్లా పోలీసు హెడ్‌ క్వాటర్స్‌ కార్యాల‌యంలో గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. డిపివో ఏవో జగపతిరాజు, స్టోర్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌ నరసింహరావు, కమ్యూనికేషన్‌ ఎస్‌ఐ ...

Read More »

మొక్కలు వందశాతం బతికేలా చూడాలి

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం గర్గుల్‌లో పల్లె ప్రకృతి వనంను గురువారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ పరిశీలించారు. మొక్కల‌ చుట్టూ పాదులు పెద్దగా చేయాల‌ని సూచించారు. ట్యాంకర్‌ ద్వారా మొక్కల‌కు నీటిని అందించాల‌ని కోరారు. నాటిన మొక్కలు 100 శాతం బతికే విధంగా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రవితేజ గౌడ్‌, జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, డిపిఓ సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Read More »

అల‌సత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంపోస్టు షెడ్ల ద్వారా సేంద్రియ ఎరువులు తయారుచేసి గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. రామారెడ్డి మండల‌ కేంద్రంలోని రైతు వేదికలో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా తడి, పొడి చెత్త వేరుగా సేకరించి కంపోస్టు షెడ్డుకు తరలించే విధంగా చూడాల‌న్నారు. అన్నీ కంపోస్ట్‌ షెడ్లు వాడుకలోకి తీసుకురావాల‌ని సూచించారు. పల్లె ప్రకృతి వనాల‌లో నాటిన మొక్కల‌కు ...

Read More »

అరెస్టుల‌తో ఉద్యమాల‌ను ఆపలేరు…

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల‌కు పెంచిన వయోపరిమితిని తగ్గించాల‌ని డిమాండ్‌ చేస్తూ గురువారం చలో అసెంబ్లీకి బయల్దేరిన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల ల‌క్ష్మణ్‌ యాదవ్‌, తెలంగాణ జన సమితి యువజన విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు స్వామిల‌ను గురువారం కామారెడ్డి కొత్త బస్టాండ్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల‌ వయోపరిమితిని ...

Read More »

మహిళా నాయకుల‌ హౌస్‌ అరెస్ట్‌…

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాల‌ విషయంలో ప్రభుత్వ ఉదాసీనతను నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించ తల‌పెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా కామారెడ్డి జిల్లా నాయకురాళ్లు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దత్తేశ్వరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కౌన్సిల‌ర్‌ సుజిత భరత్‌, పట్టణ అధ్యక్షురాలు విశ్వనాథుల‌ అనిత, జిల్లా నాయకురాలు బాల‌మనిల‌ను కామారెడ్డి పట్టణ పోలీసులు ఉదయం 6 గంటల‌కు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ...

Read More »

పార్టీ పూర్వ వైభవం కోసం కృషి చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ ఆదేశాల‌ మేరకు కామారెడ్డి జిల్లా లోని ఎల్లారెడ్డి నియోజకవర్గం సంబంధించి రాజేశ్వర్‌ రెడ్డి తాడువాయి మండల‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గాను, కిష్టయ్యని నాగిరెడ్డిపేట మండల‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, తూర్పు రాజుని గాంధారి మండల‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గానూ నియమించడం జరిగిందని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కైలాస శ్రీనివాస రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఇచ్చిన అధ్యక్ష ...

Read More »

ప్రిన్సిపాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ వేదప్రకాష్‌

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫేస్‌ ఇండియా ప్రిన్సిపాల్స్‌ అసోసియేషన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ వేద ప్రకాష్‌ నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షునిగా తనకు అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షుల‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బి.ఏడ్‌ అధ్యాపకుల‌ సమస్యల‌ పరిష్కారం కోసం, బి.ఏడ్‌ విద్యను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఉమ్మడి ...

Read More »

టెక్నికల్‌ అసిస్టెంట్‌ సస్పెండ్‌

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ నిధుల‌ను అక్రమంగా దుర్వినియోగం చేసినందుకు పెద్ద కొడప్గల్‌ మండలం వడ్లం గ్రామపంచాయతీ ఉపాధిహామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ సద్యదుల్లాను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ విధుల‌ నుండి సస్పెండ్‌ చేశారు. రైతు వేసుకున్న రోడ్డును ఉపాధి హామీ పనుల్లో వేసినట్లుగా రికార్డ్‌ చేసి, అక్రమంగా బిల్లులు చెల్లింపు చేసినందుకుగాను సస్పెండ్‌ చేయడం జరిగింది.

Read More »

ఆదర్శ పట్టణంగా బాన్సువాడ

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీ బడ్జెట్‌ సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్‌ మాట్లాడారు. స్వచ్ఛ బాన్సువాడగా మార్చడానికి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, పాల‌కవర్గం సభ్యులు, అధికారులు కృషి చేయాల‌ని‌ కోరారు. మున్సిపల్‌ నిధుల్లో 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించారు. 2021-22 బడ్జెట్‌కు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ ...

Read More »

నీటి సంరక్షణ పనుల‌కు ప్రాధాన్యత ఇవ్వాలి

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షపు నీటిని సంరక్షణ చేసే విధంగా ఊట చెరువులు, చెక్‌ డ్యాములు, కందకాలు ఏర్పాటుచేసి భూగర్భ జలాల‌ పెంపునకు దోహదపడాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. తాడువాయి మండల‌ పరిషత్‌ కార్యాల‌యంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీల‌కు పనులు కల్పించడానికి నీటి సంరక్షణ పనుల‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాల‌ని సూచించారు. గ్రామాల్లోని శ్రమ శక్తి సంఘాల‌ సభ్యుల‌తో‌ చర్చించి ఉపాధి హామీ అధికారులు ...

Read More »

కెసిఆర్‌ నిర్ణయంతో నిరుద్యోగుల‌కు తీవ్ర అన్యాయం

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల‌కు పెంచిన వయోపరిమితి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల‌ని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి జిల్లా నాయకుడు కుంభాల ల‌క్ష్మణ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల‌ ప్రాంగణంలో విద్యార్థులు నిరుద్యోగుల‌తో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. వయోపరిమితి పెంచడం వ‌ల్ల తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు విద్యార్థుల‌కు తీవ్ర అన్యాయం కలుగుతుందని ఇప్పటికే ఉన్నత విద్య చదివినా ఉద్యోగాలు లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన ...

Read More »

నిరుద్యోగులు త్వరలోనే గుణపాఠం చెప్పే రోజు వస్తుంది

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల‌ వయోపరిమితిని 58 నుండి 61 సంవత్సరాల‌కు పెంచడం కేసీఆర్‌ యొక్క అవివేకానికి నిదర్శనమని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఉద్యోగాలు లేక ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటే వయోపరిమితిని పెంచి నిరుద్యోగుల‌ ఆకాంక్షల‌ పైన నీళ్లు చల్లారని వెంటనే పెంచిన వయోపరిమితిని తగ్గించాల‌ని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు డిమాండ్‌ చేశారు. ల‌క్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయకుండా మరొకవైపు వయోపరిమితి పెంచడం వ‌ల్ల‌ నిరుద్యోగుల‌ ...

Read More »

కామారెడ్డి పట్టణంలో మిషన్‌ భగీరథ నీరు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అన్ని ప్రాంతాల‌కు మిషన్‌ భగీరథ నీటిని అందించే విధంగా చూడాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శనివారం క్యాంపు కార్యాల‌యంలో మున్సిపల్‌ అధికారుల‌తో మంచినీటి సరఫరాపై సమీక్షిస్తూ పట్టణంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఇంటింటికి స్వచ్ఛమైన నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టాల‌ని ఫోన్‌ ద్వారా మిషన్‌ భగీరథ సూపరింటెండింగ్‌ ఇంజనీరును ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, కమిషనర్‌ ...

Read More »

కామారెడ్డి జిల్లాకు అవార్డు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండవ ఎలెట్స్‌ నేషనల్‌ వాటర్‌, శానిటేషన్‌ ఇన్నోవేషన్‌ అవార్డు 2021 జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌కి ప్రకటించారు. కేంద్ర జల‌శక్తి శాఖ, భారత ప్రభుత్వ నేషనల్‌ మిషన్‌ క్లీన్‌ గంగా సమన్వయంతో ఎలెట్స్‌ స్వచ్చంద సంస్థ ఈనెల‌ 18న నిర్వహించిన ఇన్నోవేషన్‌ సమ్మిట్లో అవార్డు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు, జాతీయ ఉపాధి హామీ పనులు చెక్‌ డ్యాముల‌ నిర్మాణం, మిషన్‌ కాకతీయ కార్యక్రమాలు జిల్లాలో అమలు చేయడం ...

Read More »

నీటి దినోత్సవంలో పాల‌నాధికారి

గాంధారి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటి దినోత్సవం సందర్బంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ మొక్కల‌కు నీళ్లు పట్టారు. గాంధారి మండలం పొతంగల్‌ కలాన్‌ గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ నాటిన మొక్కల‌కు నీళ్లు పట్టారు. అక్కడ రెండు మొక్కల‌ను నాటారు. ప్రకృతి వనంలోని మొక్కల‌ను తిల‌కించారు. మొక్కలు ఏపుగా పెరగడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిదంగా గ్రామానికి సమీపంలో కోతుల‌కు ఆహార కేంద్రం ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. మొక్కల‌ను ...

Read More »