కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన సిపిఐ నాయకుడు బండారి రాజిరెడ్డి మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మాజీ సర్పంచ్ యాదవరెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ వైద్య కిషన్ రావ్, విలెజ్ పార్టీ అధ్యక్షుడు బాలిరెడ్డి, మాజీ వార్డ్ మేంబర్ రాజిరెడ్డి, మీసాల రమేష్, జంపాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read More »పంట రుణాల లక్ష్యాన్ని సాధించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పంట బుణాల లక్ష్యాన్ని బ్యాంకర్ల సమన్వయంతో వ్యవసాయ అధికారులు సాధించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో పంట బుణాలు, బ్యాంక్ లింకేజీ, వీధి వర్తకుల ఋణాలు, స్వయం సహాయక ఋణాలు, ఎస్సి యాక్షన్ ప్లాన్ లక్ష్యాలను, ఫలితాలను అధికారులతో జిల్లా కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, యాసంగి పంట బుణాల లక్ష్యం 907 కోట్లకు గాను 501 కోట్లు 52,422 మందికి ...
Read More »మూడోరోజు సివిల్ సప్లయి హమాలీల సమ్మె
కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సివిల్ సప్లయి కామారెడ్డి హమాలీ కార్మికులు 15 నిమిషాల పాటు నిరసన వ్యక్తం చేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మూడవరోజు నిరవధిక సమ్మె సందర్భంగా వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎల్ దశరథ్, జిల్లా కార్యదర్శి జి రాజు మాట్లాడుతూ సివిల్ సప్లయి హమాలీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన రేట్ల జీవోను ఇప్పటివరకు కూడా ఇవ్వకపోవడం ...
Read More »చెక్కుల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కుల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ శాఖల అధికారులతో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై సమీక్ష నిర్వహించారు. అర్హతగల లబ్ధిదారులకు చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలతో ఇప్పించాలని కోరారు. బడ్జెట్ కనుగుణంగా లబ్ధిదారులకు చెక్కులు అందేవిధంగా చూడాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు ఉంటే ...
Read More »పదిరోజుల్లో కొండపోచమ్మ ద్వారా సాగునీరు
బాన్సువాడ, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పది రోజుల్లో నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం బాన్సువాడ మండలం దేశాయిపేటలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక సహకార సంఘం భవనం, రైతు వేదిక భవనం, డబుల్ బెడ్ రూమ్ నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రోడ్లు భవనాలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార ...
Read More »ప్రారంభమైన సివిల్ సప్లయి హమాలీల నిరవధిక సమ్మె
కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి మండల స్థాయి గిడ్డంగి వద్ద సివిల్ సప్లై హమాలీ కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. సివిల్ సప్లై జిల్లా కార్యదర్శి జి రాజు మాట్లాడుతూ హమాలి రేట్లు క్వింటాలుకు 18 రూపాయలు నుంచి ఇరవై మూడు రూపాయలకు ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది, కానీ ఇప్పటివరకు జిఓ ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. సివిల్ సప్లై చైర్మన్ హమాలీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు ...
Read More »కామారెడ్డిలో బార్లు దక్కించుకున్న వారు వీరే…
కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో జిల్లాలోని కామారెడ్డి మున్సిపాలిటీ పరిథిలో ఒకటి, బాన్సువాడ మున్సిపాలిటీ పరిథిలో 2, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు నూతన బార్లకు సంబంధించిన లక్కీ డ్రా కార్యక్రమం జనహిత భవన్లో జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు లక్కీ డ్రా తీశారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 55 దరఖాస్తులు రాగా అక్కల లక్ష్మి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 47 ...
Read More »కామారెడ్డి బార్లకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా…
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు కొత్తగా మంజూరైన 4 బార్లు ఏర్పాటు కోసం 173 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక బార్ ఏర్పాటు కోసం 55, బాన్సువాడలో 2 బార్ల కు 71, ఎల్లారెడ్డి లో ఒక బార్ ఏర్పాటు కోసం 45 దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో బార్ల కేటాయింపునకు డ్రా తీయబడుతుందన్నారు.
Read More »నిరుద్యోగులను నిండా ముంచిన ఘనత కేసీఆర్‌దే
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి, లక్షలాది ఉద్యోగాలు వస్తాయి అని భావించిన నిరుద్యోగులకు కన్నీళ్లు , ఆత్మహత్యలే మిగిలాయని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు ఆరోపించారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ నుండి ఆంధ్ర ఉద్యోగులను తరిమి కొడదామని, రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, ఉద్వేగ ప్రసంగాలతో యువకులను నిరుద్యోగులను రెచ్చగొట్టి రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేకపోవడంతో రాష్ట్రంలోనే ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ...
Read More »పల్లె ప్రకృతి వనాలతో పచ్చదనం పెరిగింది
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి వృక్షార్చన కార్యక్రమంలో జిల్లాలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేశారని చెప్పారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలతో పచ్చదనం పెరిగిందని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని భావితరాలకు అందించాలంటే ప్రతి ఒక్కరూ మూడు మొక్కలను నాటి సంరక్షణ చేయాలని పేర్కొన్నారు. భావితరాలకు ప్రాణవాయువు ...
Read More »స్వచ్చంద రక్తదానం అభినందనీయం
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన మందుల సంతోష్ కుమార్ మంగళవారం స్వచ్చందంగా ముందుకు వచ్చి కామారెడ్డి పట్టణ కేంద్రంలోని వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారని, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ స్వచ్చందంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన మందుల సంతోష్ కుమార్‌ను అభినందించారు. కార్యక్రమంలో టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.
Read More »11 పశువులకు కృత్రిమ గర్భధారణ
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం తాడ్వాయి మండలంలోని కన్కల్ గ్రామంలో విజయ డెయిరీ అధ్వర్యంలో ఉచిత పశు వైధ్య శిబిరం నిర్వహించినట్టు కామారెడ్డి మిల్క్ షెడ్ డిప్యూటీ డైరెక్టర్ పి. శ్రీనివాసన్ తెలిపారు. శిబిరం మండలంలో పశుసంవర్థకశాఖ మరియు పశుగణాభివృధి శాఖ సమన్వయంతో జరిగింది. శిబిరంలో మొత్తం 89 పశువులకు చికిత్స చేసి కావలసిన మందులు విజయ డెయిరీ ద్వారా ఉచితంగా అందించారు. 11 పశువులకు కృతిమగర్చధారణ జరిగింది. కార్యక్రమంలో విజయ డెయిరి డి.డి.శ్రీనివాస్, కన్కల్ పాల ...
Read More »కామారెడ్డిలో సంత్ సేవాలాల్ జయంతి
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ 282 జయంతి పురస్కరించుకొని సోమవారం కామారెడ్డి జనహిత భవన్లో జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి, జ్యోతి వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు వెంకటేశ్ ధోత్రే, జిల్లా పరిషత్ సిఇఓ బి.చందర్‌నాయక్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిపాలనా అధికారి సయ్యద్ నేమతుల్లా, సీనియర్ అసిస్టెంట్లు సహదేవ్, ...
Read More »ఫోన్ ఇన్‌లో 20 దరఖాస్తులు
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి కలెక్టరేటులోని జనహిత భవన్లో జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ 72 ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వీటిలో 54 రెవిన్యూ శాఖ, 7 జిల్లా పంచాయితీ అధికారి, మీసేవ 3, విద్యుత్, మున్సిపాలిటీ, పోలీసు, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమశాఖ, ఎస్సి కార్పోరేషన్, వైద్య శాఖ, డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఒక్కొక్క దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇవే కాకుండా ...
Read More »షబ్బీర్ అలీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ జన్మదినం సందర్భంగా షబ్బీర్ అలీ సూచన మేరకు సోమవారం ఏలాంటి సంబరాలు కేకులు కట్ చేయకుండా కార్యక్రమాలు చేపట్టారు. దేశంలో రాష్ట్రంలో రైతు వ్యతిరేక చట్టాల వల్ల ఎంతో మంది చనిపోయి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న తరుణంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సరికాదని, తన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు మాత్రమే చేయాలని కాంగ్రెస్ ...
Read More »దుండగులను ఉరి తీయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఇటీవల ఢిల్లీలో అయోద్య రామ మందిర నిర్మాణం కోసం నిధి సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న రింకుశర్మ అనే భజరంగ్ దళ్ కార్యకర్తను చంపిన దుండగులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ దేశంలో ఒక పథకం ప్రకారం హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఇలాంటి దాడులకు కారకులైన వారిని ...
Read More »రక్తదానం చేయడం అభినందనీయం
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి జలిగామ సూర్య మోహన్ మానవత దృక్పథంతో బ్లడ్ బ్యాంకులో రక్త నిలువలు తగ్గిపోయాయని తెలుసుకుని రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా రెండు యూనిట్ల ప్లాస్మాను అందజేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలను కాపాడిన రక్తదాతను అభినందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం కావాలంటే 9492874006 కు సంప్రదించాలని, వారికి దాతల సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసి ...
Read More »ఘనంగా జాతీయ మహిళా దినోత్సవం
కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్ కస్తూర్బా బాలిక విద్యాలయంలో విద్యాలయ ప్రత్యేక అధికారి టి.లావణ్య అధ్యక్షతన అఖిల భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవం, సరోజినీ నాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవునిపల్లి ఎస్ఐ జ్యోతిని, కస్తూర్బా విద్యాలయప్రత్యేక అధికారి లావణ్యని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించినట్టు కామారెడ్డి జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్ రావు తెలిపారు. కార్యక్రమానికి ...
Read More »17న కోటి వృక్షార్చన
కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 17న కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని అమరవీరుల స్తూపం సమీపంలో మొక్కలు నాటడానికి ఖాళీ స్థలాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ శనివారం పరిశీలించారు. గుంతలు తీయించి సిద్ధం చేయాలని, అవసరమైన మొక్కలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ను ఆదేశించారు.
Read More »17న మొక్కలు నాటాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా సదాశివనగర్ మండల కేంద్రంలోని కొత్త చెరువు కట్టను శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. చెరువు కట్ట ఇరువైపులా ఈత మొక్కలు నాటాలని సూచించారు. ఈ నెల 17న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని గ్రామపంచాయతీ, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డిఓ ...
Read More »