Breaking News

Tag Archives: Makloor

బిజెపి ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిబిరం

నందిపేట్‌, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోదీ 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాక్లూర్, నందిపేట్ మండలాల లో యువ మోర్చా ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కో ఆర్డినేటర్ పుప్పాల శివరాజ్ కుమార్ మాట్లాడుతూ 7 సంవత్సరాల లో నరేంద్రమోడీ సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఆదివారం ప్రతి మండలంలో 5 గ్రామాలలో సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ...

Read More »

మాక్లూర్‌ క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవీడ్ ల‌క్షణాలున్న వారికి చికిత్స అందించడానికి ఏర్పాటుచేసిన మాక్లూర్‌లోని క్వారంటైన్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పరిశీలించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ అధికారుల‌తో కలిసి పర్యటించి కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్న పేషెంట్లకు ఏర్పాటుచేసిన సదుపాయాల‌పై ల‌క్షణాలున్న పేషెంట్లతో మాట్లాడి తెలుసుకున్నారు. వారికి త్రాగునీరు, ఆహారం, బెడ్స్‌, దుప్పట్లు, ఇతర సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల‌న్నారు. 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండే విధంగా సిబ్బందిని నియమించాల‌ని ఆదేశించారు. ...

Read More »

చెరువులో గుర్తు తెలియని మృతదేహం

ఆర్మూర్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మధ్యాహ్నం బోర్గాం (కె) గ్రామ పరిధిలో గ ముసలి కుంట్ల చెరువులో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం నీటిపై తేలియాడుతుండగా గ్రామ విఆర్‌ఏ గుర్తించి మాక్లూర్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మాక్లూర్‌ ఎస్‌ఐ రాజారెడ్డి చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని తీసి పరిశీలించి మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాక్లూర్‌ ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ...

Read More »

ఎమ్మెల్యేను పరామర్శించిన సిఎం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ శాసనసభ్యులు బిగాలా గణేష్‌ గుప్తా, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. శాసనసభ్యులు గణేష్‌ గుప్తా తండ్రి కష్ణమూర్తి గుప్తా గత కొద్ది రోజుల క్రితం ఆకస్మికంగా చనిపోయిన విషయం విదితమే. ఆయన ద్వాదశ దిన కర్మను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం మాక్లూర్‌లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి గుప్త సోదరులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కీర్తిశేషులు ...

Read More »

2న మాక్లూర్‌కు సిఎం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాక్లూరు రానున్నందున జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం వారు సంబంధిత అధికారులతో కలిసి మాక్లూర్‌ మండల కేంద్రంలో పర్యటించి హెలిప్యాడ్‌, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిజాంబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బీగాల గణేష్‌ గుప్తా యొక్క తండ్రి మరణించినందున ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి రానున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అధికారులు ...

Read More »

కడ్తా తీస్తే మిల్లర్లపై చర్యలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన తర్వాత వ్యవసాయ అధికారులు దాన్ని పరిశీలించి నాణ్యతను ధవీకరిస్తారని అందువల్ల రైస్‌ మిల్లులు అదనంగా కడ్తా పేరుతో తగ్గిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన మాక్లూర్‌ మండలం డీకంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రైతులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చాలా స్పీడ్‌గా జరుగుతున్నదని, శుక్రవారం ...

Read More »

లేబర్‌ ఎక్కువ పెట్టి పని త్వరగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మెట్టు, గొట్టు ముక్కల మరియు మాక్లూర్‌ గ్రామాలను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ వివిధ గ్రామాలలో రైతు వేదికల నిర్మాణ పనులు, పల్లె పకతి వనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు వేదికలు అక్టోబర్‌ 20వ తేదీ నాటికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. పనుల వేగం పెంచాలన్నారు. 20 వరకు పూర్తి కాకుంటే సంబంధిత పంచాయతీ ...

Read More »

అక్రమ రవాణా చేస్తున్న పిడిఎస్‌ బియ్యం పట్టివేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్కు ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ షాకిర్‌ అలీ తన సిబ్బందితో కలిసి మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దాడులు నిర్వహించి మాణిక్‌ బండార్‌ చౌరస్తా వద్ద 250 క్వింటాళ్ళ పిడిఎస్‌ బియ్యం రవాణా చేస్తున్న 2 ఐచర్‌ వాహనాలను మరియు డ్రైవర్‌ని పట్టుకొని మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.

Read More »

అక్కడ అన్ని సౌకర్యాలున్నాయి….

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆలంబన వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి. బుధవారం రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ శాఖా మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఆదేశాల‌ మేరకు జిల్లా కలెక్టర్‌ బుధవారం జిల్లా కేంద్రంలోని ఆలంబన వృద్ధాశ్రమంలో పాజిటివ్‌ వచ్చిన రోగుల‌ను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యుల‌తో మాట్లాడి, ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌, నిజామాబాద్‌కు గాని, ప్రైవేట్‌ హాస్పిటల్‌ గాని, ఇంటివద్ద సౌకర్యాలు ఉన్నవారిని వారి వారి ఇళ్లకు గాని డాక్టర్ ...

Read More »

మంచి భోజ‌నం అందించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ కోవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ను జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. గురువారం జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా మాక్లూర్‌ కోవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌, పి హెచ్ సిల‌ ను సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. ఐసోలేషన్‌ సెంటర్‌ వద్ద అంబులెన్స్‌ ఎ్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, 108 అందుబాటులో లేకుంటే ప్రైవేటు అంబులెన్స్‌ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఐసోలేషన్‌ సెంటర్లో ...

Read More »

వృద్ధునికి రక్తదానం

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌కు చెందిన గంగిపోగు సుబ్బయ్య 57 సంవత్సరాల‌ వయసు కలిగిన వృద్ధుడికి రక్తహీనతతో ప్రాణాపాయ స్థితిలో శ్రీ విష్ణు వైద్యశాల‌ నిజామాబాద్‌లో ఉండగా వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహాన్ని గురించి తెలుసుకొని సంప్రదించారు. నిజామాబాద్‌ కేంద్రంలో ఏబి పాజిటివ్‌ రక్తం ల‌భ్యం కాకపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల‌ నిర్వాహకుడు బాలును సంప్రదించడంతో ఆరేపల్లి గ్రామానికి చెందిన కెఆర్‌వి నరసింహము మరియు శ్రీనివాస్‌ సహకారంతో రెండు యూనిట్ల ఏబి పాజిటివ్‌ ...

Read More »

అసత్య పత్రికా ప్రకటనలు చేస్తున్నారు

మాక్లూర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల‌ బిజెపి సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాలా శివరాజ్‌ కుమార్‌ హాజరై మాట్లాడారు. బిజెపి ఎదుగుదల‌ను చూసి ఓర్వలేక టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అసత్య పత్రికా ప్రకటనలు చేస్తున్నారని, వారి మాటల‌ను ఇప్పుడు ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిధుల‌ను దుర్వినియోగ పరుస్తూ కేంద్రం ఎటువంటి సహాయం చేయడం లేదని అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకుల‌కు దమ్ము ధైర్యం ...

Read More »