Breaking News

Tag Archives: minister prashanth reddy

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ కు నిజామాబాద్ లోనే చికిత్స చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, 6 వేల మంది సూపర్ స్పైడర్ లకు 28, 29 తేదీలలో వ్యాక్సిన్ వేస్తున్నామని, కోవిడ్ విషయములో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, కమిషనర్ ఆఫ్ ...

Read More »

వర్షాకాలంలో నీటిని తోడేందుకు పల్లికొండ లిఫ్ట్ పూర్తి సిద్ధం

భీమ్‌గ‌ల్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్, వేల్పూర్ మండలాల్లో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పర్యటించారు. ముందుగా వేల్పూర్ మండలం జానకం పేట గ్రామం మల్లాడీ చెరువుని పాత నిజాంసాగర్ కెనాల్ నుండి నింపడానికి ఫీడర్ చానల్ లో కొంత భాగము పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉండటంతో పైప్ లైన్ వేయాల్సిన ఫీడర్ చానల్ స్థలాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ...

Read More »

తగ్గుతున్న వైరస్‌ వ్యాప్తి, కేసులు

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ కేసులు 25 నుండి పది శాతానికి తగ్గాయని, వైరస్‌ వ్యాప్తి కూడా తగ్గుతున్నదని, ఆసుపత్రుల‌లో బెడ్స్‌, ఆక్సిజన్‌, రెమ్డెసివర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తుల‌ను గాంధీ, కోఠి లోని ఈఎన్‌టి ఆసుపత్రుల‌కు పంపించాల‌ని, లాక్‌ డౌన్‌ సడలింపు సమయంలో మార్కెట్లలో రద్దీని తగ్గించడానికి మరిన్ని తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటు చేయాల‌ని, రెస్టారెంట్లు, హోటల్‌లో సీట్ల సామర్థ్యాన్ని 50 శాతానికి తగ్గించుకోవాల‌ని టిఫిన్‌ సెంటర్లలో టేక్‌ అవే మాత్రమే ...

Read More »

సొంత ఖర్చుతో 30 ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్స్‌

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ ఎంపీ బిబి పాటిల్‌ తన సొంత ఖర్చుతో 30 ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్‌ మిషన్స్‌ కామారెడ్డి జిల్లా ప్రజల‌ శ్రేయస్సు దృష్ట్యా అందించడం పట్ల రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ప్రజల‌ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఐదు లీటర్ల కెపాసిటి గల‌ ఒక్కోదాని ఖరీదు 50 వేల‌కు పైగానే ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ మిషన్‌ ...

Read More »

నేను మీ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని…

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేను మీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీ యోగక్షేమాలు తెలుసుకొమ్మని నన్ను ఇక్కడికి పంపించారు. మీరు త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు. ధైర్యంగా ఉండండి. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసాం. ఆందోళన చెందొద్దు. ప్రభుత్వం మీకు పూర్తి అండగా ఉంటుంది. డాక్టర్లు, నర్సులు మీ బాగోగులు చూసుకుంటున్నారు. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా కోలుకుని ఇంటికి వెళ్తారు. అని మంత్రి కోవిడ్‌తో ఐసియులో చికిత్స పొందుతున్న ...

Read More »

నిజామాబాద్‌ జిల్లాలో 2 వేల‌కే సిటిస్కాన్‌

నిజామాబాద్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి సిటీ స్కాన్‌ టెస్ట్‌ తప్పనిసరి అయినందున పేద ప్రజల‌పై అధిక ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో సిటీ స్కాన్‌ టెస్ట్‌ ధరను డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లు 2 వే రూపాయలు మాత్రమే తీసుకోవాల‌ని మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌ జిల్లా సిటిస్కాన్‌ యజమాన్యాల‌ను కోరారు. ఇందూరు సిటీ స్కాన్‌ యజమాని డా.రవీందర్‌ రెడ్డి, ఆర్మూర్‌ అమృత ల‌క్ష్మీ సిటీ స్కాన్‌ డా.జయ ...

Read More »

కోవిడ్‌ సేవల‌పై నిరంతర పర్యవేక్షణ

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఊహించకుండానే విరుచుకుపడి ప్రజల‌ను భయాందోళనకు గురిచేస్తూ ప్రాణాలు తీస్తున్న కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల‌ మేరకు మంత్రిగా తాను, జిల్లా కలెక్టర్‌ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని సేవల‌ను మెరుగు పరచడంతో పాటు సదుపాయాల క‌ల్ప‌నకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి ఆర్మూర్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రుల‌లోనూ ...

Read More »

మంత్రి, కలెక్టర్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పండుగ సందర్భంగా మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ముస్లింల‌కు, కుటుంబ సభ్యుల‌కు పండుగ శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలు పండుగను కుటుంబ సభ్యుల‌తో కలిసి సంతోషకర వాతావరణంలో జరుపుకోవాల‌ని కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటిస్తూ పండుగ నిర్వహించుకోవాల‌ని వారు ప్రకటనలో కోరారు.

Read More »

ఇంటింటి సర్వేకు కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలి

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాల‌ మేరకు కోవిడ్‌ నివారణకు తీసుకున్న చర్యల‌వ‌ల్ల‌ వ్యాప్తి 25 నుండి 15 శాతానికి తగ్గిందని, మరణాల‌ రేటు కూడా తగ్గిందని ఇందుకు కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లకు, సిబ్బందికి అభినందనలు తెలియ చేస్తున్నానని, అదేవిధంగా ఇందుకు సహకరించిన రెవిన్యూ, పోలీస్‌ అధికారుల‌కు కూడా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు రోడ్లు భవనాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ...

Read More »

భీమ్‌గల్‌ను సుందర పట్టణంగా తీర్చిదిద్దుతాం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరలో నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మున్సిపల్‌ కేంద్రంలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనుల‌కు మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తయిన పనులు త్వరగా పూర్తి చేయాల‌ని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి అధికారిక నివాసంలో భీంగల్‌ మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ మల్లెల‌ రాజశ్రీ ల‌క్ష్మణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గోపు గంగాధర్‌, ఏ.ఈ రఘుతో పట్టణ అభివృద్ధి పనుల‌పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ...

Read More »

మందులు, ఆక్సిజన్‌, ఇంజెక్షన్లు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ పరీక్షలు పెంచడం, అవసరమైనవారికి చికిత్సలు అందించడం, వైరస్‌ వ్యాప్తి చెందకుండా అవగాహన కల్పించడంతో పాటు అర్హులందరికీ వ్యాక్సినేషన్‌ ఇప్పించడం ద్వారా వైరస్‌పై ప్రజల‌కు రిలీఫ్‌ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అదేవిధంగా వైరస్‌ సోకిన వారికి ఇతర ఏర్పాట్లు చేయడానికి, చికిత్సలు అందించడానికి జిల్లా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశామని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌ ...

Read More »

స్వీయ నియంత్రణ, మాస్కు దరించడమే శ్రీరామ రక్ష

కామారెడ్డి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలోని జనహిత సమావేశపు హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌తో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలోని పలు నిర్ణయాల‌ను మంత్రి మీడియాకు వెల్ల‌డించారు. కోవిడ్‌ రెండవ దశలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల‌ మేరకు ప్రధానంగా నాలుగు అంశాల‌పై చర్చించారు. జిల్లాలో అధిక సంఖ్యలో ...

Read More »

కోవిడ్‌ చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మరియు వాక్సినేషన్‌పై నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల‌ కలెక్టర్లతో, నిజామాబాద్‌ జనరల్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ తో మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. కోవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల‌ని ఈ సందర్బంగా సూచించారు. ఉభయ జిల్లాలోని బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా హాస్పిటల్స్‌లో సరిపడా సదుపాయాలు ఏర్పాటు చేయాల‌ని ఉభయ జిల్లా కలెక్టర్లు నారాయణరెడ్డి, డా.శరత్‌ ను ...

Read More »

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు అందించడానికి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, సంబంధిత గుత్తేదారులు, అధికారుల‌తో కలిసి సారంగాపూర్‌, మంచిప్ప, గడ్కోల్‌, మెంట్రాజ్‌ పల్లి, భూపాపల్లి తదితర ప్రాంతాల‌లో పైపులైన్ల పనులు, కాలువ‌ల‌ పనులు ఇతర పనుల‌ను పరిశీలించారు. ఈ ...

Read More »

బడుగుల‌ ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌ రామ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అణగారిన ప్రజల‌ ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌ రామ్‌ అని, ఆయన ఆశయాల‌ను అనుగుణంగా ముందుకు వెళ్ళడమే మన ముందున్న ల‌క్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధులు బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతిని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాల‌ను ఏర్పాటు చేయగా సోమవారం నగరంలోని ఆయన విగ్రహానికి అధికారులు, అభిమానులు, ప్రజాప్రతినిధుల‌తో కలిసి ...

Read More »

త్వరలో జల‌కళ…

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవ పథకం కాలేశ్వరం రివర్స్‌ పంపింగ్‌ వద్ద నిర్మాణంలో ఉన్న పనుల‌ను రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎవరూ ఊహించని విధంగా ఎవ్వరూ చేయని విధంగా ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవ పథకాన్ని మొదలుపెట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాలేశ్వరం నుంచి నీళ్లను పైకి తీసుకొచ్చి వరద ...

Read More »

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ నిర్మాణాల‌ను పరిశీలించిన మంత్రి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణ పనుల‌ను ఆదివారం మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. అధికారుల‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణ పనుల‌ను‌ వేగవంతం చేయాల‌ని అధికారుల‌ను, కాంట్రాక్టరును ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపం ఉండరాదని అన్నారు. కార్యక్రమంలో మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగ శ్రీనివాస్‌, మోర్తాడ్‌ సర్పంచ్‌ భోగ ధరణి ఆనంద్‌, ఎన్‌డిసిసిబి డైరెక్టర్‌ మెతుకు భూమన్న, టిఆర్‌ఎస్‌ మండల‌ పార్టీ ...

Read More »

ఎస్‌ఆర్‌ఎస్‌పి దుర్ఘటన విచారకరం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఎస్‌ఆర్‌ఎస్‌పి పుష్కర ఘాట్‌ను రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. శుక్రవారం ఒకటవ పుష్కర ఘాట్‌ దగ్గర జరిగిన దుర్ఘటన బాధాకరం, చాలా విచారకరమని, ఆ కుటుంబ సభ్యుల‌కు ప్రభుత్వ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యుల‌ను ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు. పుష్కర ఘాట్‌లో ప్రతి శుక్రవారం దాదాపు ఐదువేల‌ మంది ఇక్కడికి వచ్చి గంగా ...

Read More »

మంత్రి కెటిఆర్‌ వల్లే ఇంత అభివృద్ధి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్‌ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల‌లో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు గృహ నిర్మాణం శాసనసభ వ్యవహారాల‌ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. గురువారం జాగిర్యాల్‌ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ నూతన భవనం ప్రారంభోత్సవం, భీంగల్‌ మున్సిపల్‌ కార్యాల‌యంలో కొత్త జెసిబి నడిపి ప్రారంభించారు. లింబాద్రి గుట్ట డబుల్‌ బిటి రోడ్డు ప్రారంభం, బాచన్‌ పల్లి వీడీసీ భవనం ప్రారంభం, ముచ్కూర్‌లో నూతన జిపి భవనం, పిహెచ్‌సి ...

Read More »

జిల్లాలో 442 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు ఇబ్బంది కలిగించకూడదని ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా 442 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు – భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలం రామన్నపేట గ్రామంలో నిజామాబాద్‌ జిల్లాలోనే ఈ సీజన్లో మొట్టమొదటి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది రాష్ట్రంలో కూడా మొదటి కొనుగోలు కేంద్రం కావచ్చన్నారు. రైతుకు ...

Read More »