Breaking News

Tag Archives: Morthad

13 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

మోర్తాడ్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామ శివారులో మంగళవారం పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టు చేసినట్లు మోర్తాడ్ ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి 9 వేల 930 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మోర్తాడ్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో గ్రామ పొలిమేరలో పేకాట ఆడుతున్న సమాచారం తెలియగానే పోలీసులు వెళ్లి పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నామని, వారిని అరెస్టు చేసి రిమాండ్ ...

Read More »

ప్రెస్‌ క్లబ్‌ కార్యవర్గానికి సన్మానం

మోర్తాడ్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో నూతనంగా ఎన్నికైన మోర్తాడ్‌ మండల‌ ప్రెస్‌ క్లబ్‌ కార్యవర్గానికి మోర్తాడ్‌ పీఏసీఎస్‌ సొసైటీ అధ్యక్షుడు బద్దం అశోక్‌ రెడ్డి వారిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు భూమ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి సాయన్న, క్యాషియర్‌ విజయ్‌ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బద్దం అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులు ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రజల‌కు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి సేవలందించడం ఎంతో ...

Read More »

మోర్తాడ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

మోర్తాడ్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో శనివారం మండలంలోని పాత్రికేయులు అందరూ సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా భూమ గౌడ్‌ ఆంధ్రజ్యోతి, ఉపాధ్యక్షునిగా రవి మన తెలంగాణ, ప్రధాన కార్యదర్శిగా బి సాయన్న ప్రజాపక్షం, క్యాషియర్‌గా విజయ్‌ నవతెలంగాణ, జాయింట్‌ సెక్రటరీగా సాదిక్‌ ఉర్దూ, సల‌హాదారులుగా మెట్రో చంద్రశేఖర్‌ సాక్షి, కార్యవర్గ సభ్యులుగా ధర్మపురి గంగాధర్‌, శ్రీనివాస మూర్తి, సురేష్‌ శ్రీనివాస్‌, నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో పాత్రికేయులు సురేష్‌ గౌడ్‌, ...

Read More »

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

మోర్తాడ్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని ఆయా గ్రామాల‌లో లాక్‌ డౌన్‌ సమయంలో ఎవరైనా ప్రభుత్వ ఆదేశాల‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మోర్తాడ్‌ పోలీసులు హెచ్చరించారు. పోలీసులు శుక్రవారం గ్రామంలోని వీధుల‌లో లాక్‌ డౌన్‌ను పరిశీలించారు. అలాగే లాక్‌ డౌన్‌ సమయంలో రోడ్డుపై సంచరించే వాహనదారుల‌ను ఆపి వివరాల‌ను సేకరించి లాక్‌డౌన్‌ సమయంలో ఎవరు కూడా బయట సంచరించరాదని తెలుపుతూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మోర్తాడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆయా గ్రామాల‌లో ప్రజలు ఎవరూ ...

Read More »

రోడ్డు ప్రమాదంలో విఆర్‌ఏ మృతి

మోర్తాడ్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాల‌యంలో విఆర్‌ఎ గా పనిచేస్తున్న మస్తా బాబన్న బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు మోర్తాడ్‌ తహసిల్దార్‌ శ్రీధర్‌ తెలిపారు. మోర్తాడ్‌ గ్రామానికి చెందిన విఆర్‌ఏ బాబన్న తన కుమారుడు మాస్ట ప్రాంతీష్‌ను ఆరోగ్యం బాగాలేక నిజామాబాదులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. కాగా ఆరోగ్యం క్షీణించడం వ‌ల్ల‌ అతని కుమారుడు మరణించినట్లు వైద్య సిబ్బంది తెల‌పడంతో బుధవారం జిల్లా కేంద్రం నుండి పార్థివ దేహాన్ని ...

Read More »

రంజాన్‌ దుస్తుల‌ పంపిణీ

మోర్తాడ్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లింల‌కు అందిస్తున్న బట్టల‌ను మంగళవారం మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌య ఆవరణలో ముస్లింల‌కు రంజాన్‌ బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్‌, మోర్తాడ్‌ జెడ్‌పిటిసి బద్దం రవి, తహసిల్దార్‌ శ్రీధర్‌, స్థానిక సర్పంచ్‌ భోగ ధరని ఆనంద్‌, టిఆర్‌ఎస్‌ మోర్తాడ్‌ మండల‌ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా తహసిల్దార్‌ కార్యాల‌యం జూనియర్‌ ...

Read More »

కనికరించని కరోనా – పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పెరిగిపోతుంది. దీనివ‌ల్ల‌ రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో చాలామంది పిట్టల్లా రాలిపోతున్నారు. గ్రామాల్లో కరోనా వైరస్‌ సోకిన వారు మరణిస్తూ ఉంటే కొందరేమో వైరస్‌ సోకుతుందేమోనని భయంతోనే మరణిస్తున్నారని మోర్తాడ్‌ సర్పంచ్‌ భోగ ధరణి ఆనంద్‌ అన్నారు. కరోనా వైరస్‌కు ప్రజలు ఎవ్వరు భయపడవద్దని, డాక్టర్లు చెప్పిన విధంగా మాస్కులు ధరించి, వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాల‌ని సూచించారు. ప్రజలు ఎవ్వరు కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళవద్దని ...

Read More »

కరోనాతో వీఆర్‌ఏ మృతి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని తహసిల్‌ కార్యాల‌యంలో గత కొన్ని సంవత్సరాల‌ నుండి విఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్న దని సాయన్న మండలంలోని గాండ్లపేట గ్రామ వాస్తవ్యుడు. కాగా సాయన్నకు కోవిడ్‌ సోకడంతో నిజామాబాద్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం మరణించినట్లు మోర్తాడ్‌ డిప్యూటీ తహసీల్దార్‌ సుజాత తెలిపారు. సాయన్న మోర్తాడ్‌ మండలంలో గత 30 సంవత్సరాల‌ పైబడి పనిచేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. సాయన్న మృతితో మోర్తాడ్‌ మండలంలోని ఆయాగ్రామాల‌ ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయన్న సేవల‌ను ...

Read More »

కరోనా నివారణకు ప్రజలు సహకరించాలి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల‌కు ప్రజలు అందరూ సహకరించాల‌ని మోర్తాడు ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ అన్నారు ఆయన ఆదివారం మాట్లాడుతూ మోర్తాడ్‌ మండలంలో కూడా అన్ని గ్రామాల‌లో ప్రజలు కరోనా నివారణకు చేపట్టిన చర్యల‌కు అనుకూలంగా మసులుకుంటూ అధికారుల‌కు సహాయ సహకారాలు అందివ్వాల‌న్నారు. దేశంలో కోవిద్‌ 19 సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని అందువ‌ల్ల‌నే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఎస్సై సురేష్‌ కుమార్‌ వివరించారు. రాష్ట్రంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ...

Read More »

కరోనాతో కానిస్టేబుల్‌ మృతి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండల‌ కేంద్రంలోని పోలీస్‌ స్టేషనులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అనంతయ్య కరోనా బారిన పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతయ్య నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలంలోని ల‌క్కొర గ్రామానికి చెందిన వాడని, గతంలో మోర్తాడ్‌ పోలీసు స్టేషన్‌లో చాలా రోజులుగా విధులు నిర్వహించి ఇక్కడి ప్రజల‌ మన్ననలు పొందారన్నారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్టు తెలిసింది. అనంతయ్య మృతిచెందడంతో కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ ...

Read More »

కళ్యాణ ల‌క్ష్మి చెక్కుల‌ పంపిణీ

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నూతన వధూవరుల‌కు అందిస్తున్న కళ్యాణ ల‌క్ష్మి చెక్కుల‌ను గురువారం మోర్తాడు మండల‌ కేంద్రంలోని మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యం ఆవరణలో మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగం శ్రీనివాస్‌, మోర్తాడ్‌ జెడ్‌పిటిసి అద్దం రవి కళ్యాణ ల‌క్ష్మి చెక్కుల‌ను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అమ్మాయి పెళ్లి కానుకగా ప్రవేశపెట్టిన కళ్యాణ ల‌క్ష్మి పథకం నేడు రాష్ట్రంలో ఎంతో మందికి ఆసరాగా నిలుస్తోందని జడ్పిటిసి బద్దం రవి పేర్కొన్నారు. ...

Read More »

పాఠశాలల‌ ఉపాధ్యాయుల‌కు బియ్యం పంపిణీ

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పాఠశాల‌లు మూతపడడంతో ప్రయివేటు టీచర్లకు వేతనాలు లేక అవస్థలు పడుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ పాఠశాల‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల‌ను ఆదుకునేందుకు సాయం ప్రకటించింది. ప్రతి టీచర్‌కు రూ.2 వేల‌ నగదు, అలాగే ఒక్కో టీచర్‌కు 25 కిలోల‌ బియ్యం అందిస్తున్నారు. ఇందులో భాగంగా మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో గురువారం స్థానిక మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగం శ్రీనివాస్‌ బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి శ్రీనివాస్‌ ...

Read More »

కరోనాతో ఐకెపి ఎపిఎం మృతి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి ఐకెపి కార్యాల‌యంలో ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న ఉమాకాంత్‌ బుధవారం కరోన వ్యాధితో కన్నుమూశారని మోర్తాడ్‌ ఐకెపి కార్యాల‌యం అధికారులు తెలిపారు. ఉమాకాంత్‌కు భార్య పిల్లలు ఉన్నారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాల‌ని ఐకెపి సిబ్బంది ప్రభుత్వాన్ని కోరారు.

Read More »

అక్కడ ఒంటిపూట లాక్‌ డౌన్‌

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో మంగళవారం నుండి ఒంటిపూట లాక్‌ డౌన్‌ విధించారు. ఉదయం 6 గంటల‌ నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వ్యాపార సంస్థలు తెరిచి ఉంచాల‌ని అలాగే కూరగాయల‌ మార్కెట్‌ ఒంటి గంట వరకు ఉంచాల‌ని ఒంటిగంట నుండి రాత్రి 8 గంటల‌ వరకు గ్రామస్తులు స్వచ్చందంగా లాక్‌ డౌన్‌ విధించారు. గ్రామ ప్రజల‌ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని ప్రజలు ఎవరూ కూడా కరోనా బారిన పడకుండా తమ తమ ...

Read More »

జర్నలిస్టుల‌ను ఆదుకోండి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో నేటి వరకు కరోనాకు బలి అయి చాలా మంది జర్నలిస్టులు అసువులు బాశారు. ఈ మధ్యనే నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలంలోని ఆంధ్రభూమి విలేఖరి దర్శనం అశోక్‌తో పాటు అనేక మంది జర్నలిస్టులు కోవిడ్‌ బారినపడ్డారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి ప్రజల‌కు మద్య వారధులుగా నిలిచి సేవలందిస్తున్న జర్నలిస్టుల‌కు కోవీడు బారినపడి మృతి చెందిన జర్నలిస్టుల‌కు, సాధారణంగా మృతి చెందిన జర్నలిస్టుల‌కు 50 ల‌క్షల‌ ఇన్సూరెన్స్ అమలు చేయాల‌ని కోరుతూ ...

Read More »

ఆ ఊర్లో మధ్యాహ్నం లాక్‌ డౌన్‌

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్ మండల‌ కేంద్రంలోని గ్రామ సచివాల‌యం కార్యాల‌యంలో శుక్రవారం సర్పంచ్‌ భోగ ధరణి ఆనంద్‌ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించి గ్రామంలోని దుకాణాలు కూరగాయల‌ మార్కెట్లు ఉదయం 6 గంటల‌ నుండి 10 గంటల‌ వరకు తెరిచి ఉండాల‌ని సాయంత్రం పూట నాలుగు గంటల‌ నుంచి ఆరున్నర గంటల‌ వరకు మాత్రమే దుకాణ సముదాయాల‌న్నీ తెరచి ఉండాల‌ని తీర్మానం చేసినట్లు తెలిపారు. ఉదయం పది గంటల‌ నుండి సాయంత్రం నాలుగు గంటల‌ వరకు ...

Read More »

కంటికి కనబడని కరోనా – ప్రజలు పరేషాన్‌

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని ఆయా గ్రామాల‌లో ఎక్కడ చూసినా ప్రజలు కరోనాతో భయభ్రాంతుల‌కు గురవుతున్నారు. అదిగో ఆ గ్రామంలో వచ్చింది కరోనా, ఇదిగో ఈ గ్రామంలో వచ్చింది అని చెప్పి ప్రజలు జంకుతున్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో అయితే ఉపాధిహామీ కూలీలు కూడా కూలి పనికి వెళ్లడానికి భయపడి పని మానేస్తున్నారని వినికిడి. కరోనాతో అక్కడ చనిపోయారు ఫలానా గ్రామంలో చనిపోయారని ప్రజలు గుసగుసలాడుతున్నారు తప్ప అధికారులు మాత్రం గ్రామాల్లో ఎటువంటి కేసులు లేవని ...

Read More »

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న సిబ్బంది

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో శనివారం ఆయా గ్రామాల‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం కలిపి 46 మందికి కరోనా వ్యాక్సిన్‌ చేయడం జరిగిందని మోర్తాడ్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో డిఎల్‌పిఓ శ్రీనివాస్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపిఓ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మోర్తాడ్‌లో కుంటను మింగిన పెద్దలు

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో పంట పొలాల‌కు సాగునీరు అందించే ఇప్ప కుంటను గ్రామానికి చెందిన కొందరు రైతులు గత కొన్నాళ్ల నుండి కబ్జా చేసుకొని పంటలు పండించుకుంటున్నప్పటికీ రెవెన్యూ ఇరిగేషన్‌ శాఖల‌ అధికారుల‌కు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కబ్జాకు గురైన ఇప్ప కుంటను ప్రభుత్వ అధికారులు చూసి కూడా చూడనట్టుగా వ్యవహరించడం ఏమిటని ప్రజలు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువులు కుంటల‌ను లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా నీటిని ...

Read More »

ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని ముసల‌మ్మ చెరువులో బుధవారం ఉపాధిహామీ కూలీలు చేస్తున్న పనిని స్థానిక ఎంపిడిఓ శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించారు. అనంతరం కూలీల‌తో ముచ్చటించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ముసల‌మ్మ చెరువును పరిశీలించిన ఎంపీడీవో గ్రామస్తుల‌పై‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు నుండి వచ్చే నీరు పంట పొలాల‌కే కాకుండా పశువులు ప్రజలు కూడా తాగుతారని ఇంత మంచి నీటిని గ్రామస్తులు కాల‌ కృత్యాల‌తో కలుషితం చేస్తున్నారని ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి ...

Read More »