Breaking News

Tag Archives: Nizamabd

సోమవారం నుండి కూలీలు పెరగాలి

నిజామాబాద్, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను సోమవారం నుండి పెంచాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత అధికారులతో నర్సరీలు , హరిత హారం, లేబర్ టర్నౌట్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఎంపిడివో, ఎపిఓ లతో మాట్లాడుతూ లేబర్ టర్నౌట్ పెంచాలని గతములో ఆదేశించామని కాని ఆశించిన మేర కాలేదని కావున ఏపిఓలు బాధ్యతతో పని చేయాలని హెచ్చరించారు. కొన్ని మండలాల‌లో పెరిగినప్పటికి ...

Read More »

అభివృద్ధి పనులు ఆగకూడదు

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్న చిన్న కారణాలతో అభివృద్ధి పనులు ఆగకుండా వెంటనే పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వాటికి అవసరమైన ఇసుక, స్థల సేకరణ సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌ నుండి సంబంధిత అధికారులతో ఎంపీ లాడ్స్‌, సిడిపి, ఎస్‌డిఎఫ్‌, రూర్బన్‌ పనుల అభివద్ధిపై సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014- 15 సంవత్సరం నుండి ఇంకా ...

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు మంజూరు చేయించారు. మోపాల్‌ మండల కేంద్రానికి చెందిన సాయిలుకి 16 వేలు, మోపాల్‌ మండలానికి చెందిన సులోచనకి 60 వేలు, ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన రాజా గౌడ్‌కి 46 వేలు చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ధర్పల్లి జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ ...

Read More »

జేసీఐ వారోత్సవాల సందర్భంగా రక్తదానం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జేసిఐ ఇందూర్‌ ఆద్వర్యంలో జేసీస్‌ వారోత్సవాల్లో భాగంగా శనివారం నిజామాబాదు రెడ్‌ క్రాస్‌ సొసైటీలో రక్తదాన శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసిఐ ఇందూర్‌ సభ్యులు రక్తదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రెడ్‌ క్రాస్‌ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానమని ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలన్నారు. ప్రస్తుత కోవిడ్‌ సమయంలో రక్తదానానికి ప్రజలు ముందుకు రావడం లేదన్నారు. ఫలితంగా ...

Read More »

విద్యుత్‌ వినియోగదారుల‌కు గమనిక

నిజామాబాద్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడతెరిపిలేని వర్షాల‌ కారణంగా మీ దగ్గరలో కాని మీ ఇంటిలో కాని ఎలాంటి విద్యుత్‌ పరికరాల‌ను తడి చేతితో తాకకండని, మీ దగ్గరలోని ఆరుబయట విద్యుత్‌ స్థంభాల‌ను ఎవ్వరూ తాకవద్దని విద్యుత్‌శాఖ హెచ్చరికలు జారీచేసింది. మీ కనుచూపు మేర ఎక్కడైనా విద్యుత్‌ తీగలు తెగిపడిన వెంటనే మీ ఏరియా కరెంటు ఆఫీసుకి కాని మీ యొక్క లైన్‌ మెన్‌కు కాని లేదా మీ ఏ.ఇ.కి కాని సమాచారం అందించి ప్రమాదాల‌ను నివారించండని విద్యుత్‌శాఖ ...

Read More »

20 పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ జిల్లాలో 20 కోవిడ్‌ కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎం. సుదర్శనం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం కోవిడ్‌ కేసుల‌ జిల్లా నివేదిక ఫలితాలు వచ్చిన శాంపిల్స్‌ 48 నెగెటివ్‌ రిపోర్ట్‌ 23 నమోదైన పాజిటివ్‌ కేసులు 20 పంపిన శాంపిల్స్‌ 48 ఫలితాలు రావాల్సిన శాంపిల్స్‌ 48 వైద్య శాఖ సిబ్బంది తగు నియంత్రణ చర్యలు చేపట్టారని, కానీ ప్రజల‌ సహకారం ...

Read More »

ఓట్ల కోసమే ట్రంప్‌ కుట్రలు

నిజామాబాద్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమెరికాలో న‌ల్ల‌ జాతీయుల‌పై శ్వేత జాతి జాత్యహంకార దాడుల‌కు వ్యతిరేకంగా, డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరిని నిరసిస్తూ సిపిఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌరస్తాలో డొనాల్డ్‌ ట్రంప్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వనమాల‌ కృష్ణ మాట్లాడుతూ అమెరికాలో న‌ల్ల‌జాతీయుల‌పై శ్వేతజాతీయుల‌ జాత్యహంకార దాడుల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ట్రంప్‌ ప్రభుత్వం న‌ల్ల‌జాతీయుల‌పై అప్రకటిత వివక్ష, అణిచివేతను ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న‌ల్ల‌ జాతీయుడు ...

Read More »

ఆవిర్భావ కానుకగా రూ. 25 కోట్లు ఇవ్వండి

నిజామాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జర్నలిస్ట్‌ కుటుంబాల‌ను కరోన కష్టకాలంలో ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.25 కోట్లు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కానుకగా ఇవ్వాల‌ని టీయూడబ్ల్యూజే నిజామాబాద్‌ జిల్లా నాయకత్వం కోరింది. మంగళవారం రాత్రి నిజామాబాద్‌ గాంధీ చౌక్‌ అమరవీరుల‌ స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జమాల్‌పూర్‌ గణేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన వెలుగులో ఆరేళ్ళు సొంత పాల‌న ఉండడం వల్లే తెలంగాణ జర్నలిస్ట్‌ సమాజానికి అభివృద్ధి, సంక్షేమం అందుతున్నాయని అన్నారు. ...

Read More »

ఇటుక బట్టీ కార్మికుల‌ను స్వస్థలాల‌కు తరలించారు…

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సందర్భంగా జిల్లాలో చిక్కుకుపోయిన 319 మంది వల‌స కూలీల‌ను సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం నుండి 9 బస్సుల‌లో కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌కు తరలించారు. జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి, సి పి కార్తికేయతో కలిసి తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు. ఒరిస్సాకు చెందిన వల‌స కార్మికులు నిజామాబాద్‌ జిల్లా మండలం మోపాల్‌, మాక్లూర్‌ మండలాల‌లో ఇటుక బట్టీల‌లో పని చేసేవారని, వర్షాకాలం రావడంతో పని ముగిసిందని, ...

Read More »

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు పరిశీలించిన కలెక్టర్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పర్యటనలో భాగంగా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాల‌యంలో జరుగుతున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు పరిశీలించి పనులు చేస్తున్న కూలీల‌కు మాస్కులు పంచారు. ఈ సందర్భంగా కూలీల‌తో మాట్లాడి కరోనా వైరస్‌ నివారణకు తీసుకోవల‌సిన జాగ్రత్తల‌ను తప్పక పాటిస్తూ పనులు చేయాల‌న్నారు. కూలీలు పనులలో ఏ సమయం నుంచి పాల్గొంటారని అడిగి తెలుసుకున్నారు. ఉదయం 7 గంటల‌ నుండి 11 గంటల‌ వరకు పని చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ...

Read More »

సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ ఉద్యోగులు ఈ నెల 5 నుండి సమ్మెలో పాల్గొనబోతున్నందున ప్రజా రవాణాకు ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్‌ కుమార్‌ కలెక్టర్లను, అధికారులను కోరారు. శుక్రవారం హైదరాబాద్‌ నుండి డీజీపీ మహేందర్‌ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్లు, పోలీసు, రవాణా, ఆర్టీసీ అధికారులతో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...

Read More »

దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ మైనార్టీ సంక్షేమ శాఖ అర్హులైన క్రైస్తవ మైనార్టీల నుంచి మారుతి మోటార్స్‌, ఉబర్‌ సహకారంతో డ్రైవింగ్‌ ఎంపవర్‌మెంట్‌ ప్రోగ్రాం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని, ఇందుకుగాను మారుతి డ్రైవింగ్‌ స్కూల్‌ ద్వారా డ్రైవర్ల నైపుణ్యత పెరుగుదల, ఉబర్‌ ద్వారా ప్లేస్‌మెంట్లు, వాహన కొనుగోలు కొరకు క్రైస్తవ సంస్థ సహాయం ...

Read More »

ఫిబ్రవరి 7న కలెక్టరేట్‌ ముందు ధర్నా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7వ తేదీన జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్టు సిఐటియు నాయకురాలు నూర్జహాన్‌ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని అందుకు నిరసనగా ధర్నా నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ధర్నాను జయప్రదం చేయాలని జిల్లాలోని ఆశ వర్కర్లు హాజరుకావాలని పిలుపునిచ్చారు. 7న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నట్టు వివరించారు. అదేవిధంగా ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ...

Read More »