Breaking News

Tag Archives: Nursery

నర్సరీలలో మొక్కలు సంరక్షించాలి

గాంధారి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నర్సరీలలో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని కామారెడ్డి ఏపిడి, ఇంచార్జ్‌ డిపిఓ సాయన్న అన్నారు. శనివారం గాంధారి మండలకేంద్రంలో నర్సరీని అయన పరిశీలించారు. ఈ సందర్బంగా సీడ్‌ దిబ్లింగ్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించగా దానిని తిలకించారు. మొక్కలు పెంచే క్రమంలో వాటి విత్తనాలు నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. మొక్కలకు ఎప్పటికప్పుడు నీటిని అందించాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు నర్సరీల బాధ్యతలు స్వీకరించి వాటిని కాపాడే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌, ఎంపీపీ ...

Read More »

మొక్కలు సంరక్షించాలి

గాంధారి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నర్సరీలలో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని కామారెడ్డి జడ్పీ సీఈఓ చందర్‌ నాయక్‌ అన్నారు. మంగళవారం గాంధారి మండలంలో ప్రభుత్వంచే నిర్వహిస్తున్న పలు నర్సరీలను అయన పరిశీలించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలో నర్సరీలో పెంచుతున్న మొక్కలను దగ్గరినుండి పరిశీలించారు. నర్సరీలతో పాటు ఇటీవల హరితహారంలో నాటిన మొక్కలకు ఎప్పటికప్పుడు నీటిని అందించాలన్నారు. నాటిన ప్రతి మొక్క బ్రతకాలన్నారు. ప్రత్యేకంగా నర్సరీలలో పెరుగుతున్న మొక్కలపై శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. అయన వెంట ఎంపీడీఓ ...

Read More »

ప్రతి గ్రామానికి ప్రత్యేక నర్సరీని ఏర్పాటు చేసుకోవాలి

రెంజల్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రతి గ్రామానికో ప్రత్యేక మొక్కల నర్సరీని ఏర్పాటు చేసుకోవాలని ఎంపిపి మోబిన్‌ఖాన్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం హరితహారం మొక్కల పెంపకంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటి వాటిని సంరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. పంచాయతీ చట్టంలో స్వల్ప మార్పులు జరిగాయని గ్రామాలలో హరితహారం మొక్కలను చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్‌, కార్యదర్శులపై ఉందన్నారు. ప్రతి మూడునెలలకు ఒకసారి ఈవోపిఆర్‌డి ఆధ్వర్యంలో ...

Read More »

నర్సరీల్లో మొక్కల లక్ష్యాన్ని చేరుకోవాలి 

కామారెడ్డి, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా నర్సరీల్లో పెంచుతున్న మొక్కల లక్ష్యాన్ని చేరుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి మండలం రాఘవపూర్‌ నర్సరీని సందర్శించారు. నర్సరీకి సంబంధించి మొక్కల పెంపక లక్ష్యం లక్ష 50 వేలు ఉన్నట్టు చెప్పారు. అందులో టేకు- 95 వేలు కాగా మిగతా అల్లనేరెడు, వేప, ఈత, గురుమెహర్‌, రావి, జామ, దానిమ్మ, మామిడి లాంటి మొక్కలున్నాయన్నారు. ఈ మొక్కలను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టినట్టు ...

Read More »

మొక్కలు ఎండిపోకుండా చూడాలి

  గాంధారి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నర్సరీలో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా చూడాలని గాందారి జడ్పిటిసి తానాజీరావు అన్నారు. మంగళవారం గాందారి మండలంలోని ముదెల్లి చౌరస్తావద్దగల అటవీ శాఖ నర్సరీని ఆయన పరిశీలించారు. జూన్‌ నెలలో ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమానికి మొక్కలను సిద్దంగా ఉంచాలని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. నర్సరీలో మొక్కలు పచ్చగా అందంగా ఉన్నాయని వీటిని ఇలాగే కాపాడాలన్నారు. ఎప్పటికప్పుడు నీటిని అందించాలన్నారు. నర్సరీలో మొక్కలు సంరక్షించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ఆయన వెంట గాంధారి సర్పంచ్‌ ...

Read More »

వచ్చే వర్షాకాలానికల్లా మొక్కలు సిద్దం చేయండి

  బీర్కూర్‌, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోవు వర్షాకాలం కల్లా బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో పెంచుతున్న నర్సరీ మొక్కలను సిద్దం చేయాలని మండల అభివృద్ది అదికారి భరత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మిర్జాపూర్‌, దుర్కి, నాచుపల్లి నర్సరీలను ఆయన బుధవారం పరిశీలించారు. మండలంలో 3 లక్షల టేకు మొక్కలు నాటడానికి సిద్దంగా ఉంచాలని, వచ్చే వర్షాకాలం హరితహారం కార్యక్రమానికల్లా మొక్కలు పెంచేలా చర్యలుతీసుకోవాలని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పనులను పర్యవేక్షించారు. ప్రస్తుత వేసవి కాలం ...

Read More »

నర్సరీని పరిశీలించిన ఎండివో

  గాంధారి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం పోతంగల్‌ కలాన్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్‌ గడ్డ వద్దగల నర్సరీని ఎండివో సాయాగౌడ్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీలో నాటుతున్న మొక్కలను, పాలిథిన్‌ కవర్లలో నింపుతున్న మట్టి మిశ్రమాన్ని పరిశీలించారు.మే, జూన్‌ నాటికి మొక్కలు సిద్దంగా ఉంచాలని ఉపాధి హామీ సిబ్బందికి, నర్సరీ నిర్వాహకులను ఆదేశించారు. నర్సరీలో పెంచిన మొక్కల సంరక్షణ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన అన్నారు.

Read More »

నర్సరీని పరిశీలించిన అధికారులు

  నిజాంసాగర్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్సింగ్‌రావుపల్లి గ్రామ శివారులో ఇజిఎస్‌ వన నర్సరీ పనులను ఎంపిడివో రాములు నాయక్‌, ఇజిఎస్‌ ఎపివో సుదర్శన్‌ బుధవారం పరిశీలించారు. లక్ష టేకుమొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇజిఎస్‌ ద్వారా సరఫరా చేసిన టేకు ప్లాంట్లను కవర్లలో నింపుతున్న పనులను పరిశీలించారు. వారి వెంట మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు గోగులపండరి, ఇజిఎస్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ జయశ్రీ తదితరులున్నారు.

Read More »

నర్సరీలను పరిశీలించిన ఎమ్‌పిడీవో ప్రవీణ్‌ కుమార్‌

  ఆర్మూర్‌, జనవరి 30: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్మూర్‌ ఎమ్‌పిడీవో ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. అందులో భాగంగానే ఆర్మూర్‌ మండలంలోని పిప్రి, మంథని, దేగాం, మిర్ధాపల్లి నర్సరీలను పరిశీలించి పనులను గూర్చి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్యాగ్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ ను ఆయన పరిశీలించారు, టేకు చెట్ల మొక్కలను పరిశీలించి నివేదికలను సిద్దంచేయాలని సూచించారు.

Read More »

హరితహారం నర్సరీలను సందర్శించిన కలెక్టర్‌

  నిజామాబాద్‌, జనవరి 7; హరితహారం కార్యక్రమంలో విసృతంగా మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బుధవారం పిట్లం మండలంలోని సిద్దాపూర్‌ గ్రామంలోని నర్సరీలను ఆయన సందర్శించారు. అక్కడ హరితహారం కార్యక్రమం కొరకు పెంచుతున్న నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోధన్‌ ఆర్‌డిఓ శ్యామ్‌ ప్రసాద్‌, యూడీసి అధ్యక్షులు రజినీకాంత్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More »