Breaking News

Tag Archives: police

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

మోర్తాడ్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని ఆయా గ్రామాల‌లో లాక్‌ డౌన్‌ సమయంలో ఎవరైనా ప్రభుత్వ ఆదేశాల‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మోర్తాడ్‌ పోలీసులు హెచ్చరించారు. పోలీసులు శుక్రవారం గ్రామంలోని వీధుల‌లో లాక్‌ డౌన్‌ను పరిశీలించారు. అలాగే లాక్‌ డౌన్‌ సమయంలో రోడ్డుపై సంచరించే వాహనదారుల‌ను ఆపి వివరాల‌ను సేకరించి లాక్‌డౌన్‌ సమయంలో ఎవరు కూడా బయట సంచరించరాదని తెలుపుతూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మోర్తాడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆయా గ్రామాల‌లో ప్రజలు ఎవరూ ...

Read More »

కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలి

బోదన్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం వారి ఆధ్వర్యంలో కోవిడ్‌ 19 నిబంధనలు ప్రజలు అందరూ తప్పనిసరిగా పాటించాల‌ని బోధన్‌ టౌన్‌ పరిధిలోని బస్టాండ్‌, అంబెడ్కర్‌ చౌరస్తా, పాతబస్టాండ్‌, ఫ్రూట్‌ మార్కెట్‌, దుకాణ యాజమానుల‌కు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బోధన్‌ టౌన్‌ సిఐ రామన్‌, పోలీస్‌ కళాబృందం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read More »

వేలం ద్వారా ల‌క్షల‌ ఆదాయం

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పోలీసు స్టేషన్‌లో పనిచేయని జనరేటర్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు, ఎల‌క్ట్రానిక్‌, ఫర్నీచర్‌, ఇతర సామాగ్రిని గురువారం వేలం వేసినట్టు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ డిఎస్‌పి ఉదయకృష్ణ తెలిపారు. కాగా వీటి ద్వారా రూ. 2 ల‌క్షల‌ 65 వేల‌ 500 ఆదాయం సమకూరినట్లు చెప్పారు. జిల్లా పోలీసు హెడ్‌ క్వాటర్స్‌ కార్యాల‌యంలో గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. డిపివో ఏవో జగపతిరాజు, స్టోర్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌ నరసింహరావు, కమ్యూనికేషన్‌ ఎస్‌ఐ ...

Read More »

మేకల‌ సంతలో బాలిక తప్పిపోయింది…

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సాటాపూర్‌ గ్రామానికి చెందిన రుక్మవ్వ 7 సంవత్సరాల‌ వయస్సు గల‌ తన మనుమరాలు అనితను తీసుకొని ప్రతి శనివారం నవిపేట్‌లో జరిగే మేకల‌ సంతలో వారి మేకను అమ్మడానికి వెళ్ళారు. కాగా పాప తప్పిపోయి ఏడుస్తుండగా అక్కడే మార్కెట్‌ డ్యూటీలో ఉన్న నవిపేట్‌ పిఎస్‌ కానిస్టేబుల్‌ జాకీర్‌ హుస్సేన్‌, రవీందర్‌ హోంగార్డు గమనించి ఏడుస్తున్న అనితను దగ్గరకు తీసుకొని విచారించగా సరైన సమాచారం ల‌భించకపోవడంతో విచారణ చేపట్టి ...

Read More »

పోలీసు కుటుంబానికి ఆర్థిక సాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత సంవత్సరం ఆగష్టు 15వ తేదీన సి. హెచ్‌. రమేష్‌ పి.సి : 204 పి.యస్‌ రెంజల్‌ అనారోగ్యంతో మరణించారు. కాగా పోలీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అతని కుటుంబానికి నిజామాబాద్‌ పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌ నుండి పోలీస్‌ కమీషనర్‌ వరకు తమ జీతం నుండి డెత్‌ ఫండ్‌ (ఆర్థిక సహయం) రూపంలో గ చెక్కు 1 ల‌క్ష 23 వేల 200 రూపాయలు మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ కార్యాల‌యంలో అదనపు పోలీస్‌ కమీషనర్‌ ...

Read More »

రూ.50 వేల విలువచేసే గుట్కా స్వాధీనం

ఆర్మూర్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టాస్క్‌ ఫోర్సు పోలీసులు రూ. 50 వేల విలువ చేసే గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బిలాల్‌ కాన్‌ఫెక్షనరీ లో గుట్కా పట్టుకుని, నిందితుని అరెస్టు చేసినట్టు టాస్క్‌ ఫోర్సు సిఐ తెలిపారు. సోమవారం అదనపు పోలీసు కమీషనర్‌ అరవిందబాబు ఉత్తర్వుల మేరకు టాస్క్‌ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ షాకెర్‌ అలీ, వారి సిబ్బంది ఆర్మూర్‌ పిఎస్‌ పరిధిలోని ఓ చోట అక్రమంగా గుట్కాఉందని విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు జరిపినట్టు ...

Read More »

చోరీ చేశాడు… పోలీసులకు చిక్కాడు…

చందూర్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓ ట్రాక్టర్‌ చోరీ కేసులో పోలీసులు నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే…గత నెల డిసెంబర్‌ 29న చందూర్‌ మండల కేంద్రానికి చెందిన ఎలమంచిలి పద్మావతికి చెందిన ట్రాక్టర్‌ దొంగిలించబడింది. ఈ విషయంలో పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి చందూర్‌, మోస్రా, బోధన్‌లలోని సిసి ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. జనవరి 7న దొంగతనానికి పాల్పడిన మేకల గంగారంను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు ఛేదించడంలో విశేష కషి చేసిన ఏఎస్‌ఐ ...

Read More »

ఆపరేషన్‌ స్మైల్‌ ప్రారంభం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అదనపు డి.సి.పి (అడ్మిన్‌) ఉషా విశ్వనాధ్‌ తిరునగరి ఆపరేషన్‌ స్మైల్‌ 7 ప్రారంభించారు. ఈ సందర్బంగా అదనపు డి.సి.పి (అడ్మిన్‌) ఉషా విశ్వనాధ్‌ తిరునగరి మాట్లాడుతూ అవరేషన్‌ స్మైల్‌ 2021 జనవరి 1 నుండి 31 జనవరి వరకు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ పరిధిలో 18 సంవత్సరాల లోవు తప్పిపోయిన / ...

Read More »

కేజివీల్స్‌ రోడ్లపై తిప్పడం చట్టరీత్యా నేరం

ఆర్మూర్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాలు ప్రజల అవసరాల కోసం నిర్మించిన ప్రజా ప్రభుత్వ రోడ్లపై వ్యవసాయ భూములు దున్నడం కోసం ట్రాక్టర్‌ ఓనర్లు కేజివీల్స్‌ తో తిప్పడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, కావున ప్రజా, ప్రభుత్వ ఆస్తులైన రోడ్లు ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరమని ఏర్గట్ల మండల కేజివీల్‌ ట్రాక్టర్స్‌ యజమానులకు ఏర్గట్ల పోలీస్‌ వారు సూచించారు. కేజివీల్‌ ట్రాక్టర్స్‌ని సీజ్‌ చేసి కేసు నమోదు చేయబడుతుందని, రోడ్లు డ్యామేజ్‌ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ...

Read More »

దోపిడీ దొంగల అరెస్టు

కోరుట్ల, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేడిపల్లిలో గత మూడు రోజుల క్రితం జరిగిన ఒక దోపిడీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి పదిహేను తులాల బంగారం, మూడు సెల్‌ ఫోన్స్‌, ఒక మోటార్‌ బైక్‌, 7 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సదరు నిందితులు సారంగాపూర్‌, ధర్మపురి, జగిత్యాల మొదలగు ప్రదేశాలలో 8 దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరిలో ఒక ఆడ మనిషి మగ వారిని ఆకర్షించి ఎవరు లేని ప్రదేశాలలోకి తీసుకు ...

Read More »

హెడ్‌కానిస్టేబుల్‌కు ఏఎస్‌ఐగా ప్రమోషన్‌

కమ్మర్‌పల్లి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమ్మర్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా గత ఐదు సంవత్సరాలుగా అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న జి.సుశీల్‌ కుమార్‌కి ఏ.ఎస్సైగా ప్రమోషన్‌ రావడం జరిగింది. అందుకుగాను కమ్మరపల్లి ఎస్‌ఐ, కార్యాలయ మరియు సిబ్బంది అతనికి అభినందనలు తెలిపారు.

Read More »

ఉమ్మెడలో పోలీసు కళాజాత

నందిపేట్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం నందిపేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉమ్మేడ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల కోసం పలుసూచనలు చేశారు. సెల్‌ ఫోన్‌ మేసేజ్‌ వస్తే మనం ప్రెస్‌ చేయ వద్దని, మన అకౌంట్లో డబ్బులు వాళ్ల అకౌంట్‌లో వెళ్లి పోతాయని అవగాహన కల్పించారు. కావున ఎవ్వరు కూడా అలాంటి మేసేజ్‌లు ప్రెస్‌ చేయవద్దన్నారు. సైబర్‌ క్రైమ్‌కు లింక్‌ ఉన్న ...

Read More »

ప్రేమ జంట ఆత్మహత్యయత్నం

గాంధారి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓ ప్రేమజంట ఆత్మహత్యయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ ప్రియురాలు మతిచెంది, ప్రియుడు చికిత్స పొందుతున్న సంఘటన గాంధారి మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండలం పొతంగల్‌ కలాన్‌కు చెందిన గాండ్ల సాయికుమార్‌ వడ్లూర్‌ గ్రామానికి చెందిన తన మరదలు గాండ్ల రమ్య (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని ఈ నెల 11 వ తేదీన శుక్రవారం గాంధారి ...

Read More »

దొంగ వలన భయం…

కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ మధుసూదన్‌ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలో తరచూ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన దొంగతనాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌లు తీసుకోవడం జరిగిందని, అదేవిధంగా ఇటీవల జరిగిన దొంగతనాల్లో ఒకరిద్దరి జోక్యం ఉన్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. ఇకనుంచి కొత్త తరహాలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామని, ఒక్కో ఏరియాకు ఒక్కో కానిస్టేబుల్‌, హోంగార్డు, ఆఫీసర్‌లను అలర్ట్‌ చేస్తున్నామన్నారు. సంబందిత ఏరియాపై ఇన్‌చార్జి ఆఫీసర్‌ నిరంతర నిఘా ఉంటుందని, తద్వారా ...

Read More »

భారీగా గుట్కా, జర్దా స్వాధీనం

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని 2వ టౌన్‌ పరిదిలోని ఓ ఇంట్లో భారీగా గుట్కా, జర్దా సంచులు పట్టుకున్నట్టు పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో వెల్లడించారు. వివరాల్లోకి వెళితే … సోమవారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ షాకేర్‌ అలీ మరియు వారి సిబ్బంది నిజామాబాద్‌ టౌన్‌ 2వ టౌన్‌ పరిధిలో సమీపంలో ఒక ఇంట్లో అక్రమంగా గుట్కా మరియు జర్ధా వుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు ...

Read More »

ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత

నిజామాబాద్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఎంఎస్‌సి ఫారం పరిసర ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి 6 ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్నట్టు టాస్క్‌ఫోర్సు సిఐ వెల్లడించారు. వాటిని సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారికి అప్పగించడం జరిగిందన్నారు. టిప్పర్ల నెంబర్లు : ఏపి 25 డబ్ల్యు 4174 ...

Read More »

భారీగా నిషేదిత సిగరెట్లు, జర్దా స్వాధీనం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ టౌన్‌ 1 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గంజ్‌ ప్రాంతంలో ఓ కిరాణా దుకాణం మరియు గోదాములో నిషేధిత సిగరెట్లు మరియు జర్ధాను నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నట్టు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. వీటి విలువ సుమారు 8 లక్షల వరకు ఉంటుందన్నారు. గురువారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ షాకేర్‌ అలీ మరియు వారి సిబ్బంది నిజామాబాద్‌ ...

Read More »

ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా (ఫ్లాగ్‌ డే సందర్భంగా ) గురువారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, ఐ.పీ.ఎస్‌. ఆదేశాల మేరకు 4వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుండి ఆన్‌లైన్‌ ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమాన్ని దాదాపు 735 మంది సద్వినియోగం చేసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్‌ స్టేషన్‌ పనితీరు, ...

Read More »

భారీగా గుట్కా స్వాధీనం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు భారీ మొత్తంలో గుట్కా, జర్ధా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 11.50 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని 2 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బర్కత్‌ పురా కాలనీ లో గల ఒక ఇల్లు, గోదాములో గుట్క, జర్ధా ఉన్నదన్న సమాచారం మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ షాకేర్‌ అలీ తన సిబ్బందితో కలిసి ...

Read More »

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుండి ఆన్‌లైన్‌ ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 22న ఆసక్తిగల వారు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌ లైన్‌ ద్వారా ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమంలో పోలీస్‌ స్టేషన్‌ పనితీరు, రికార్డుల వాడటం, సిబ్బంది ...

Read More »