Breaking News

Tag Archives: pragathi bhavan

జిల్లాలో రెండు ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్లు

నిజామాబాద్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌ను సంఘటితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలో భాగంగా ఏర్పాటు చేయనున్న ‘‘ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌’’ ను సరైన రీతిలో నడిపి రైతుల‌కు గిట్టుబాటు ధరలు ల‌భించి, ఆర్థికంగా పరిపుష్టి సాధించే దిశగా ముందుకు తీసుకుని వెళ్లాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో నాబార్డ్‌, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ, బ్యాంకు అధికారుల‌తో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. భారత వ్యవసాయ మంత్రిత్వశాఖ ...

Read More »

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పంద్రాగస్టు

కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు, 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టరేటులో జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. బుధవారం జనహితలో జిల్లా అధికారుల‌తో స్వతంత్ర దినోత్సవం రోజున నిర్వహించే కార్యక్రమాల‌పై సమీక్షించారు. తమకు నిర్దేశించిన కార్యక్రమాల‌ను పూర్తి చేసుకోవాల‌ని ఆదేశించారు. ఆగష్టు 15 న ఉదయం 10 గంటల‌కు జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకావిష్కరణ ...

Read More »

కాగిత రహిత పాల‌నలో శిక్షణ

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాగిత రహిత పాల‌నలో భాగంగా జిల్లా అధికారుల‌కు, సిబ్బందికి ఇ ఆఫీస్‌ ఫైల్‌ మేనేజిమెంట్‌ విధానం శుక్రవారం జనహిత భవన్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మూడు సెషన్లలో అధికారుల‌కు, సిబ్బందికి దస్త్రాల‌ కంప్యూటరీకరణపై ఎన్‌.ఐ.సి. జిల్లా ఇన్ఫర్మేషన్‌ అధికారి రవి బండి శిక్షణ అందించారు.

Read More »

త్వరలో ప్రారంభం….

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్‌ కార్యాల‌య నిర్మాణ పనుల‌ను రాష్ట్ర రోడ్లు-భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల‌ ముంగిటకే పాల‌న వెళ్లాల‌న్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణలో భాగంగా 10 జిల్లాలున్న తెలంగాణలో 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి 33 జిల్లాల తెలంగాణగా చేశారన్నారు. అలా ఏర్పడిన జిల్లాలో ప్రజల‌ సౌకర్యార్థం ప్రభుత్వ ఫలాలు ఒకే ...

Read More »

అవసరమైన మెటీరియల్‌ అందించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదికల‌ నిర్మాణం పై సంబంధిత అధికారుల‌తో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 106 రైతు వేదికల‌కు గాను 104 మొదలు పెట్టారని, వాటి పురోగతి, సమస్యలుంటే వాటి పరిష్కారానికి చేపట్టవల‌సిన చర్యలు తదితర అంశాల‌పై సమీక్షించారు. ప్రతి మండలంలో నిర్మాణంలో ఉన్న రైతు వేదికల‌కు సంబంధించిన కాంట్రాక్టర్‌ మరియు అధికారుల‌తో సమీక్షించారు. కొన్ని ...

Read More »

ప్రగతి భవన్‌లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ (నిజామాబాద్‌, కామారెడ్డి కొత్త జిల్లాలు) జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల‌లో పనిచేయటానికి 20 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల‌ను కాంట్రాక్ట్‌ పద్ధతిపై భర్తీ చేసేందుకు ఈనెల‌ 31న కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టులు ప్రస్తుతం ఒక సంవత్సరం కొరకు (అవసరమైతే పెంచబడుతుంది) కాంట్రాక్ట్‌ పద్దతిలో పని చేసేందుకు ఎంపిక చేయబడుతుందని, ఎంపికైన అభ్యర్థుల‌కు నెల‌కు ...

Read More »

31న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ (నిజామాబాద్‌ మరియు కామారెడ్డి కొత్త జిల్లాలు) జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల‌లో పనిచేయుటకు 20 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల‌ను కాంట్రాక్ట్‌ పద్ధతిపై భర్తీ చేసేందుకు ఈనెల‌ 31న కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టు ప్రస్తుతం ఒక సంవత్సరం కొరకు (అవసరమైతే పెంచబడుతుంది) కాంట్రాక్ట్‌ పద్దతిలో పని చేసేందుకు ఎంపిక చేయబడుతుందని, ఎంపికైన అభ్యర్థుల‌కు ...

Read More »

ఆఫీసర్‌ లైఫ్‌, పర్సనల్‌ లైఫ్‌ రెండు హ్యాండిల్‌ చేయాలి

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆఫీసర్లు పాజిటివ్‌ మెంటాలిటీతో ప్రజల‌కు సేవ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. నాలుగు వారాల‌ పాటు జిల్లాలో క్షేత్రస్థాయి శిక్షణ కొరకు వచ్చిన 21 మంది నాయబ్‌ తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌ సమావేశం మందిరంలో సమావేశమయ్యారు. వివిధ జిల్లాల‌ నుండి శిక్షణ కొరకు వచ్చిన నాయబ్ త‌హ‌సిల్దార్లతో మాట్లాడుతూ ఆఫీసర్లకు పాజిటివ్‌ మెంటాలిటీ లేకుంటే అతను పనిచేసే ఏరియా అంతా ఇబ్బంది పడుతుందని, ...

Read More »

కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు

నిజామాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ రంగమే కాదు ఏ రంగమైనా మనసుపెట్టి పనిచేస్తే మంచి విజయం ల‌భిస్తుందని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం నాబార్డ్‌ ఆధ్వర్యంలో 39వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా స్థాయిలో ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నిజామాబాద్‌ మొదటి స్థానంలో ఉందని, వడ్లు కొనుగోళ్లలో మొదటి లేదా రెండో స్థానంలో ఉన్నామన్నారు. మన జిల్లాలో ...

Read More »

మొక్కల‌ సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీల‌దే

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారిపై కిలోమీటర్‌కు 1 వేయి 266 మొక్కలు ఉండే విధంగా సర్పంచులు, కార్యదర్శులు పరిశీల‌న చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాల‌యంలోని జనహిత హాలులో హరితహారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కల‌ సంరక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీల‌కు అప్పగించనున్నట్లు చెప్పారు. హైవే అధికారులు నాటిన మొక్కల‌ సంరక్షణను గ్రామ పంచాయతీల‌కు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల‌ ...

Read More »

ఘనంగా బస్వేశ్వర జయంతి

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ సంఘసంస్కర్త మహాత్మ బస్వేశ్వర 885వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బుధవారం ప్రగతిభవన్‌లో జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సభకు హజరైన అందరికి కన్నడ భాషలో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 885 ఏళ్ల క్రితమే సమాజంలో జరుగుతున్న సాంఘిక అసమానతలపై పోరాడి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆనాటి కవితల ద్వారా ప్రజలను బస్వేశ్వరుడు చైతన్య పరచాడని అన్నారు. స్త్రీ సమానత్వం, ...

Read More »

ప్రజావాణిలో 40 ఫిర్యాదులు

కామరెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రగతిభవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 40 ఫిర్యాదులు అందినట్టు ప్రగతిభవన్‌ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. రెవెన్యూశాఖ-9, పంచాయతీ రాజ్‌-5, పోలీసుశాఖ-3, మునిసిపల్‌-3, విద్యుత్తు-3, డిఆర్‌డిఎ-3, వ్యవసాయశాఖ-2, ఆరోగ్యశ్రీ-2, ఎస్‌సి సంక్షేమశాఖ-2 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసి సత్తయ్య అధికారులు ఉన్నారు.

Read More »

ఫోన్‌ ఇన్‌ కలెక్టర్‌లో 15 ఫిర్యాదులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతినెల మొదటిసోమవారం ప్రగతి భవన్‌లో నిర్వహించే ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 15 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. నీటిసమస్య, మురికి కాలువ సమస్య, భూ ఆక్రమణ, రుణ సౌకర్యం, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల బిల్లులు చెల్లింపులు, రేషన్‌ సరుకులపై, బ్యాంకుల్లో లావాదేవీలపై ఫిర్యాదులు అందాయన్నారు. వచ్చిన పిర్యాదులు వెంటనే పరిష్కరించి వాటిని పరిశీలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ ...

Read More »

ప్రజావాణిలో 41 ఫిర్యాదులు

  కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి ప్రగతిభవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయా శాఖలకు సంబంధించి 41 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. ఇందులో రెవెన్యూ-14, మునిసిపల్‌-6, డిఆర్‌డిఎ -5, నీటిపారుదల శాఖ-3, పంచాయతీరాజ్‌ -3, ఇతర శాఖలకు సంబందించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఫిర్యాదులను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో జేసి సత్తయ్య, డిఆర్వో మణిమాల ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

ప్రగతిభవన్‌లో బతుకమ్మ వేడుకలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌లో శనివారం మహిళా ఉద్యోగులు బతుకమ్మలు ఆడారు. ఉద్యోగినులంతా కలిసి బతుకమ్మలను రంగు రంగుల పూలతో అందంగా పేర్చి ప్రగతిభవన్‌ ప్రాంగణంలో, రోడ్డుపై బతుకమ్మ ఆటలు ఆడుతూ, పాడుతూ వేడుకలు నిర్వహించారు. అనంతరం నిమజ్జనం చేశారు.

Read More »