Breaking News

Tag Archives: ramareddy

చెక్కులు పంపిణీ చేసిన ఎంఎల్ఏ

కామారెడ్డి, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శుక్ర‌వారం రామరెడ్డి మండలంలోని గొల్లపల్లి కి చెందిన వారికి ఎమ్మెల్యే జాజ‌ల సురేంద‌ర్ కళ్యాణ లక్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమములో మండల ఎంపీపీ దశరత్ రెడ్డి, వైస్ ఎంపీపీ మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ దాదా, మండల రైతు బంధు అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల నాయకులు పాల్గొన్నారు.

Read More »

అసత్య ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం పోసానిపెట్‌ గ్రామంలో కోవిడ్‌ టీకాతో ఓ వ్యక్తి మరణించారని అసత్య ప్రచారం చేస్తుండడంతో దీనికి వైద్యాధికారి, ఎస్‌ఐ, గ్రామ సర్పంచ్‌ స్పందించి వెంటనే అక్కడికి వెళ్లి విచారించారు. మరణ కారణం కోవిడ్‌ టీకా కాదని, ఇంటి సమస్యల‌తో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. కానీ కొందరు ఇలా అసత్య ప్రచారం చేశారు. ఇలా అసత్య ప్రచారాలు చేస్తే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోబడుతాయని, ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దన్నారు. కోవిడ్‌ ...

Read More »

15 మందికి పాజిటివ్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌లో ర్యాపిడ్‌ ఆంటీజెన్‌ కిట్‌ ద్వారా 109 మందికి కరోన టెస్ట్‌లు చేయగ 15 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారి డాక్టర్‌ షాహీద్‌ ఆలి తెలిపారు. వీరిలో ఒక్కరు పోసానిపెట్‌ గ్రామస్థులు, ముగ్గురు రామారెడ్డి గ్రామస్థులు, ఒక్కరు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామస్థులు, ఒక్కరు ఉప్పల్‌ వాయి గ్రామస్థులు, ఒక్కరు గిద్ద గ్రామస్థులు, ఒక్కరు మద్దుకుంట గ్రామస్థులు, ఐదుగురు కామారెడ్డి గ్రామస్థులు, ఒక్కరు గరుగుల్‌ గ్రామస్థులు, ఒక్కరు జుక్కల్‌ గ్రామస్థులు ...

Read More »

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎంఎల్‌సి జన్మదిన వేడుకలు

గాంధారి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత జన్మదిన వేడుకలు రామారెడ్డి మండల‌ కేంద్రంలోని కాల‌భైరవ స్వామి ఆల‌యంలో శనివారం నిర్వహించారు. ఆల‌యంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు అనంత రాములు ఆధ్వర్యంలో రామారెడ్డి జాగృతి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం పులిహోర ప్రసాదాన్ని వితరణ చేశారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా బాద్యులు వంశీ, వెంకటరెడ్డి, చక్రధర్‌, రాజు, పద్మజా, జీవన్‌ గౌడ్‌, చంద్రం తదితరులు పాల్గొన్నారు.

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాచార హక్కు చట్టం 2005 ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం రామారెడ్డి కస్తూర్బా గాంధీ బాలికల ‌విద్యాల‌యంలో ప్రత్యేక అధికారిని టి. వనితను ఘనంగా సన్మానించినట్టు రామారెడ్డి మండల‌ అధ్యక్షుడు ల‌క్కాకుల‌ నరేష్‌ అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు భవాని పేట సుమన్‌, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల నవీన్‌, కార్యదర్శి భవాని పేట నితిన్‌, విద్యాల‌య మహిళా అధికారులు పద్మ, శ్రీదేవి, కరుణ, భాగ్యల‌క్ష్మి బాలికలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

31న పల్స్‌ పోలియో

కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రామారెడ్డి ప్రభుత్వా దవాఖానలో ఏఎన్‌ఎం లకు, అంగన్‌ వాడి టీచర్స్‌, వలంటరీస్‌కి వైద్యాధికారి డాక్టర్‌ షాహీద్‌ అలీ పల్స్‌ పోలియోపై అవహగహన కల్పించారు. ఈనెల 31వ తేదీ ఆదివారం ఆసుపత్రి పరిధిలో గల రామారెడ్డి -ఎ, రామారెడ్డి-బి, ఇస్సన్నపల్లి, ఉప్పల్‌ వాయి, గిద్ద, పోసానిపెట్‌, వడ్లూర్‌ ఎల్లారెడ్డి, సబ్‌ సెంటర్‌లలో పల్స్‌ పోలియో కార్యక్రమం చేపట్టనున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. పల్స్‌ పోలీయో కార్యక్రమం 31 జనవరి నుండి ఫిబ్రవరి 2వ తేదీ ...

Read More »

రామారెడ్డిలో బాలుడికి డెంగ్యూ

కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రామరెడ్డి గ్రామంలో అనుమానాస్పద డెంగ్యూ సోకిన బాలుడిని సందర్శించి అతని ఆరోగ్యపరిస్థితిని డాక్టర్‌ షాహీద్‌ ఆలి పరిశీలించారు. అదేవిధంగా అక్కడి పరిషరాలను పరిశీలించిన గ్రామ సర్పంచ్‌ దండబోయిన సంజీవ్‌, అక్కడ ప్రజలకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని దోమలను నివారించే విధంగా వారికి సూచనలు చేశారు. పరిసరాలు శుభ్రం చేయించి డ్రైనేజిల్లో నీటి నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు చూడాలని వైద్యాధికారి గ్రామ సర్పంచ్‌కు సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది భీమ్‌, గంగమని, లలిత, దోమల ...

Read More »

ఇద్దరికి కరోనా పాజిటివ్‌

కామరెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం రామారెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల సబ్‌ సెంటర్‌లో కరోన పరీక్షల క్యాంప్‌ నిర్వహించినారు. క్యాంపులల్లో రామరెడ్డి గ్రామంలో 40 మందికి, ఇస్సన్నపల్లి గ్రామంలో 40 మందికి, పోసానిపేట్‌ గ్రామంలో 40 మందికి, ఉప్పల్‌ వాయ్‌ గ్రామంలో 40 మందికి, మరియు వడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామంలో 40 కరోన పరీక్షలు నిర్వహించారని డాక్టర్‌ షాహీద్‌ ఆలి తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో 16 మందికి కరోన పరీక్షలు నిర్వహించారు. మొత్తం 216 మందికి ...

Read More »

రామారెడ్డిలో కరోన పరీక్షలు – అందరికి నెగిటివ్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రామారెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల సబ్‌ సెంటర్‌లో కరోన పరీక్షలు నిర్వహించినారు. రామరెడ్డి గ్రామంలో 89 మందికి, ఇస్సన్నపల్లి గ్రామంలో 58 మందికి, పోసానిపేట్‌ గ్రామంలో 42 మందికి, ఉప్పల్‌ వాయ్‌ గ్రామంలో 41 మందికి, మరియు వడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామంలో 66 మందికి కరోన పరీక్షలు నిర్వహించారని వైద్యాధికారి షాహీద్‌ ఆలి తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో 23 మందికి కరోన పరీక్షలు నిర్వహించారు. మొత్తం 319 మందికి కరోన ...

Read More »

ఇద్దరికి కరోనా పాజిటివ్‌

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌లో ర్యాపిడ్‌ ఆంటీజెన్‌ కిట్‌ ద్వారా 56 మందికి కరోన టెస్ట్‌లు నిర్వహించినట్టు వైద్యాధికారి షాహీద్‌ అలీ తెలిపారు. కాగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందని, ఒక్కరు రామారెడ్డి గ్రామస్తులు, ఒక్కరు గర్గుల్‌ గ్రామస్థులని వైద్యాధికారి పేర్కొన్నారు.

Read More »

ట్రాక్టర్‌ బోల్తా – వ్యక్తి మృతి

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలం రామారెడ్డి శివారు గొల్లపల్లి గేట్‌ సమీపంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి బొల్తాకొట్టిన క్రమంలో డ్రైవర్‌ మాచారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన బాబాగౌడ్‌ అనే వ్యక్తి ట్రాక్టర్‌ కింద పడి అక్కడికక్కడేమతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని, శవాన్ని పోస్టమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Read More »

ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వీరుడు

కామరెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొండ లక్ష్మణ్‌ బాపూజీ 105 వ జయంతి సందర్భంగా ఆదివారం రామారెడ్డి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ, యువజన సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో రామారెడ్డిలో బాపూజీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఇసాయిపేట నరేష్‌ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ...

Read More »

తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 26 చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం ఉదయం బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో రామారెడ్డి మండల కేంద్రంలో ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ యూత్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ ఇసాయిపేట నరేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటనికి ఆద్యులు, తెలంగాణ వీర వనిత, ఆంధ్ర మహాసభ సభ్యులు, ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని, తన సొంత భూమి ని అక్రమంగా ...

Read More »

వారి త్యాగాలు స్మరించుకోవాలి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రామారెడ్డి ఎమ్మార్వోకు బిజెవైఎం రామారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బిజెపి యువ మోర్చా మండల అధ్యక్షులు ఇసాయిపేట నరేష్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17, 1948లో తెలంగాణ రాష్ట్రానికి నిరంకుశ పాలన నుండి విముక్తి కలిగిందని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణాలో అనేక మంది అసువులు బాసిన వారి ప్రాణా మానాల త్యాగ ఫలితంగానే సెప్టెంబర్‌ ...

Read More »

పోడు భూములు సాగుచేసుకోనివ్వాలి

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూముల‌ను సాగుచేసుకొనివ్వాల‌ని పట్టా పాస్‌ పుస్తకాలు ఇవ్వాల‌ని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ మరియు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల‌తో తహసీల్దార్‌ కార్యాల‌యం ముందు బుధవారం నిరసన వ్యక్తం చేసి ఆర్‌ఐ వేణుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ రామరెడ్డి మండలంలో పేద రైతులు పోడు భూముల‌ను 50 సంవత్సరాలుగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. ...

Read More »

ఎలుగుబంటి దాడి – ఇద్దరికి గాయాలు

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్‌ గ్రామంలోకి శుక్రవారం ఎలుగుబంటి ప్రవేశించింది. ఇద్దరు యువకుల‌పై దాడి చేయగా గాయాల‌య్యాయి. గ్రామస్తులు అప్రమత్తమై కర్రతో ఎలుగుబంటిపై దాడిచేసి కొట్టి బంధించారు. అనంతరం ఎలుగుబంటి దాడిలో గాయపడిన దేమె బాల‌నర్సు, గిద్ద నర్సింలును చికిత్స నిమిత్తం కామారెడ్డి సర్కారు దవాఖానకు తరలించారు.

Read More »

కొనుగోలు కేంద్రాల‌ వద్ద మాస్కుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రామారెడ్డి మండల‌ అధ్యక్షుడు గడ్డంప్రసాద్‌ ఇస్సన్నపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాల‌ను గురువారం సందర్శించారు. కొనుగోలు కేంద్రాల‌ పనుల‌ను పరిశీలించి ప్రతి ఒక్కరికి మాస్కులు పంపిణీ చేశారు. ప్రతి రైతు దగ్గర పక్షపాతం లేకుండా వడ్ల కొనుగోలు చేయాల‌ని సూచించారు. రైతుందరికీ వడ్లను సకాలంలో కొనుగోలు చేసి సమయానికి లారీల‌ను రప్పించి కొనుగోలు చేసిన వడ్లను రైస్ మిల్లుకు పంపించేటట్లు తగు జాగ్రత్తలు తీసుకొని రైతుల‌కు న్యాయం చేయాల‌ని ...

Read More »