Breaking News

Tag Archives: saplings

మొక్కలు నాటిన బి.ఆర్‌.మీణ

  కామారెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో శనివారం రాష్ట్ర స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ బి.ఆర్‌.మీణ మొక్కలు నాటారు. ఆయనతోపాటు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం డైరెక్టర్‌ వాకాటి కరుణ మొక్కలు నాటారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుక శనివారం హైదరాబాద్‌ నుంచి కామారెడ్డికి విచ్చేశారు. వారిని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ స్వాగతించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ఆవరణలో మొక్కలు నాటారు. హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని, పచ్చని ...

Read More »

వరినాట్లు ప్రారంభం

  నిజాంసాగర్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌లో బోరుబావుల కింద వరినాట్లు వేసే కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. మండలంలోని మాగి, గున్కుల్‌, గోర్గల్‌, కోమలంచ తదితర గ్రామాల్లోని మంజీర పరివాహక ప్రాంతంలో గల పంట పొలాల్లో లిఫ్టు ఇరిగేషన్‌ ద్వారా వరినాట్లు వేసుకుంటున్నారు. ఇప్పటికే రైతులందరు మంజీర పరివాహక ప్రాంతంలో వరినారు సిద్దం చేసుకున్నారు. వరి మొలకలు రావడంతో బోరుబావుల కింద ఉన్న పంట పొలాలు వేసుకుంటున్నారు. వర్సాకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా సరిగా వర్సాలు కురియకపోవడంతో ...

Read More »

గ్రామాల్లో 40 వేల మొక్కలు నాటించాలి

  నిజాంసాగర్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం పథకం కింద ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 40వేల మొక్కలకు తగ్గకుండా నాటించాలని ఎంపిడివో రాములు నాయక్‌ ఇజిఎస్‌ అదికారులను ఆదేశించారు. ఎంపిడివో కార్యాలయంలో బుధవారం ఇజిఎస్‌ అధికారులతో సమావేశం అనంతరం మాట్లాడారు. తెలంగాణ హరితహారం పథకంకింద 6 లక్షల 80 వేల మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకున్నామని, లక్ష్యానికి మించి మొక్కలు నాటేందుకు అదికారులు ప్రత్యేకచొరవ తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 3 లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నారు. హరితహారంలో ...

Read More »

హరితహారం విజయవంతం చేయాలి

  గాంధారి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గాంధారి తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక తహసీల్‌ కార్యాలయంలో పూల మొక్కలు నాటారు. స్వయంగా ఖర్చులతో తెప్పించిన ఖరీదైన పూలమొక్కలను కార్యాలయ ఆవరణలో నాటారు. ఇదేవిధంగా మరిన్ని పూల మొక్కలను నాటుతున్నట్టు తెలిపారు. గత సంవత్సరం కార్యాలయ ఆవరణలో నాటిన మొక్కలు ఎప్పటికప్పుడు సంరక్షిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా వాటిని కాపాడుతామని అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి యాదగిరి, సిబ్బంది ఉన్నారు.

Read More »

పరిశ్రమల్లో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి పరిశ్రమ స్థాపించిన స్థలంలో వాల్టా చట్టం ప్రకారం మూడవ వంతు స్థలాన్ని పచ్చదనానికి కేటాయించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని పారిశ్రామిక వేత్తలతో పరిశ్రమల్లో హరితహారంపై సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయా పరిశ్రమల ప్రతినిదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎకరాకు 1400 చొప్పున మొక్కలు ప్రతి పరిశ్రమలో నాటేందుకు ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందన్నారు. మొక్కలను నాటి పర్యావరణ సమతుల్యాన్ని ...

Read More »