Breaking News

Tag Archives: should be solved

ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఎస్‌ఎప్‌ఐ నాయకులు కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎప్‌ఐ డివిజన్‌ కార్యదర్శి అరుణ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని, సబ్జెక్టుల వారిగా టీచర్లు లేరని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు తాగడానికినీరులేక, మరుగుదొడ్లు సైతం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టి వాటిలో నెలకొన్న ...

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల పరిష్కారానికి విఆర్‌ఏలు కృషి చేయాలని స్థానిక తహసీల్దార్‌ సయ్యద్‌ హైమద్‌ మస్రుర్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన విఆర్‌ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. విఆర్‌ఏలు స్థానికంగా ఉంటూ అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉంటూ రెవెన్యూ కార్యకలాపాలను చూసుకోవాలన్నారు. గ్రామాల్లో పన్నుల వసూలుతోపాటు చెరువులు, కుంటల ...

Read More »

నీటి ఎద్దడి నివారణకు యుద్ద ప్రాతిపదికన పనులు

  కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నెలకొన్న నీటి ఎద్దడి నివారణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్టు కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తెలిపారు. ఆదివారం కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మతోపాటు 33 వార్డుల కౌన్సిలర్‌లు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిశారు. పట్టణంలో నెలకొన్ని నీటి ఎద్దడి సమస్యను వివరించారు. గోదావరి జలాలకు సంబంధించి ఎప్పుడూ పైప్‌లైన్లు పగిలిపోతున్నాయని, నీటి సమస్య ఉంటుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మధ్యమధ్యలో వివిధ గ్రామాల ...

Read More »

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి

  బోధన్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోదన్‌ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ నాయకులు షేక్‌బాబు డిమాండ్‌ చేశారు. బోధన్‌ పట్టణంలో మునిసిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షేక్‌బాబు మాట్లాడుతూ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి శక్కర్‌నగర్‌ చౌరస్తా, నర్సీరోడ్డు, రుద్రూర్‌ రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్‌ దీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే వేసవిలో ఎండతీవ్రతను దృస్టిలో పెట్టుకొని బోదన్‌ మునిసిపల్‌ అధికారులు ...

Read More »

తాగునీటి ఎద్దడి నివారణపై దృష్టి సారించాలి

మోర్తాడ్‌, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాభావ పరిస్తితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోయి తీవ్ర తాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతున్నారని మండల, గ్రామ రెవెన్యూ అధికారులు, కార్యదర్శులు నీటి ఎద్దడి తీవ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రత్యేకాధికారి శంకరయ్య అన్నారు. సోమవారం మండల ప్రజాప్రతినిదులతో, మండల కార్యదర్శులు, విఆర్వోలతో సమీక్షించారు. గ్రామాల్లో ప్రైవేటు బోర్లు అద్దెకు తీసుకొని, బోర్లలో నీరున్న వాటిని ప్లసింగ్‌ చేయించి తాగునీరు సౌకర్యం కల్పించాలన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులే ...

Read More »