Breaking News

Tag Archives: SI

రెంజల్‌ ఎస్‌ఐ సస్పెన్షన్‌

రెంజల్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఏసీపీ పరిధిలోని రెంజల్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శంకర్‌ను గురువారం సస్పెండ్‌ చేస్తూ నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఐ శంకర్‌పై ఇసుక మాఫియాతో మమేకమైనట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల‌ మండలంలోని ఇతర శాఖల‌లోని ఇద్ధరు మహిళా అధికారుల‌ను సంబంధం లేని విషయంలో వేధించడంతో వారు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కలెక్టర్‌ అదేశాల‌ మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. ...

Read More »

ఎస్‌ఐని సన్మానించిన ముదిరాజ్‌ సంఘం సభ్యులు

నందిపేట్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నందిపేట మండలంలో నూతన ఎస్‌ఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన శోభన్‌ బాబుని నందిపేట ముదిరాజ్‌ సంఘం స‌భ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల మాల‌తో సన్మానించారు. ముదిరాజ్ కుల‌స్తుల‌కు చేపలు పట్టే అధికారం గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన విషయం గుర్తు చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు మద్దుల‌ మురళి, డొంకేశ్వర్‌ లిప్టు వైస్‌ చైర్మన్‌ గంగరాము, నికాల్‌పూర్‌ లిఫ్టు డైరెక్టర్‌ రాజన్న, శ్రవణ్‌ కుమార్‌, నరేశ్‌ ...

Read More »

శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్‌ పోటీ పరీక్షలకు జిల్లా యంత్రాంగం ద్వారా కల్పిస్తున్న శిక్షణా తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సదాశివనగర్‌ మల్లన్నగుట్ట వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోటీ పరీక్షల శిక్షణ తరగతులను శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో 70 మందికి శిక్షణ ఇచ్చామని, ప్రస్తుతం 25 లక్షల ఖర్చుతో 400 మందికి భోజన సౌకర్యం కల్పించి, వారికి శిక్షణ ...

Read More »

నర్వా గ్రామంలో ఎస్‌ఐ పల్లెనిద్ర

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని నర్వా గ్రామంలో మద్యం, పేకాటతోపాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా చూసుకోవాల్సిన బాద్యత అందరిపై ఉందని నిజాంసాగర్‌ ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి అన్నారు. నర్వా గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామసభలో ఎస్‌ఐ మాట్లాడుతూ ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామంలో సంచరిస్తే తమకు సమాచారం అందించాలన్నారు. పంచాయతీ కార్యాలయంలో ఎస్‌ఐ బస చేశారు. రాత్రివేళలో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అనసూయ, నర్సింలు, తదితరులున్నారు.

Read More »

బీర్కూర్‌ ఎస్‌ఐగా సంపత్‌

  బీర్కూర్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఐ బదిలీల్లో భాగంగా బీర్కూర్‌ ఎస్‌ఐగా సంపత్‌కుమార్‌ శుక్రవారం బాద్యతలు చేపట్టారు. లింగంపేట్‌ మండలంలో ఎస్‌ఐగా విధులు నిర్వహించి బదిలీపై బీర్కూర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేకాట, బెల్టుషాపుల నిర్వహణపై చర్యలు తీసుకుంటామని, గ్రామస్తుల సహకారంతో మండలంలో శాంతిబద్రతలు నెలకొల్పుతామని పేర్కొన్నారు.

Read More »

బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని స్థానిక పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ అంతిరెడ్డి పిట్లం ఠానాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు నిజాంసాగర్‌ ఎస్‌ఐగా ఉపేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు చోరీల నివారణకు తనవంతు కృషి చేస్తానని, మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన అన్నారు.

Read More »

బదిలీపై వెళ్తున్న ఎస్‌ఐకి సన్మానం

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ గా విధులు నిర్వహిస్తున్న అంతిరెడ్డి బదిలీపై వెళుతుండడంతో బుధవారం ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్‌ బేగరి రాజు, సిడిసి ఛైర్మన్‌ దుర్గారెడ్డి శాలువా, పూలమాలలు, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఐ సేవలు మరువలేనివని, గ్రామాల్లో సర్పంచ్‌లకు, ఎంపిటిసిలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించారని అన్నారు. మర్యాదపూర్వకంగా, సామరస్యంగా కేసుల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒడ్డేపల్లి సర్పంచ్‌ రేఖ, ...

Read More »

బదిలీపై వెళ్తున్న ఎస్‌ఐకి సన్మానం

  బీర్కూర్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో ఎస్‌ఐగా విదులు నిర్వహించిన గోపి బదిలీపై వెళుతుండడంతో ఏబివిపి నాయకులు, తదితరులు బుధవారం నసురుల్లాబాద్‌ పోలీసు స్టేషన్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో ముందుండేవారని, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని ఎస్‌ఐని అభినందించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు, ఏబివిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

బీర్కూర్‌ మండల ప్రజల సహకారం మరువలేనిది

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల ప్రజల సహకారం మరువలేనిదని బదిలీపై వెళ్తున్న బీర్కూర్‌ ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి అన్నారు. సుమారు నాలుగు సంవత్సరాలుగా బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ ఉమ్మడి మండలాల్లో పనిచేశానని, రాజకీయ నాయకులు, విలేకరులు, ఆయా గ్రామాల పెద్దలు, ప్రజలు వృత్తిలో భాగంగా తనకు ఇచ్చిన సహకారం మరువలేనిదన్నారు. బదిలీపై కోటగిరి వెళ్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో ట్రాక్టర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ శాంతిభద్రతలు కాపాడడంలో, సేవా కార్యక్రమాల ...

Read More »

బాలమ్మపై దాడిచేసిన ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలి

  కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలమ్మపై దాడిచేసిన నిజాంసాగర్‌ ఎస్‌ఐ అంజిరెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని ఏఐఎఫ్‌డిడబ్ల్యుఎ రాష్ట్ర కార్యదర్శి సుకన్య డిమాండ్‌ చేశారు. కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయం ఆవరణలో గురువారం ఏఐఎఫ్‌డిడబ్ల్యుఎ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఓ వైపు కేంద్ర ప్రభుత్వం మనువాద విధానాలు అమలు చేస్తుండగా, రాష్ట్రంలో పరోక్షంగా మహిళలను అణిచివేసే విధానాలు అమలవుతున్నాయన్నారు. కుర్మ బాలమ్మపై దాడి ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. జిల్లా ఎస్‌పి మహిళ అయి ...

Read More »

5, 10 రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయి

  – ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి బీర్కూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూ. 5, 10 నాణేలు వ్యాపారు, దుకాణ సముదాయాల వారు తీసుకోవాలని బీర్కూర్‌ ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి వ్యాపారస్తులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం పోలీసు స్టేషన్‌లో వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో 10, 5 రూపాయల నాణేలు వర్తకులు తీసుకోవడం లేదని, ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు ...

Read More »