Breaking News

Tag Archives: trs

ప్రజా వ్యతిరేక సునామిలో తెరాస కొట్టుకుపోవడం ఖాయం

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా వ్యతిరేకసునామిలో తెరాస కొట్టుకుపోవడం ఖాయమని కామారెడ్డి కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థి మహ్మద్‌ షబ్బీర్‌ అలీ అన్నారు. శనివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొందరపాటు నిర్ణయంతో కెసిఆర్‌ ముందస్తు ఎన్నికల పేరిట రాష్ట్రంపై ఎన్నికల ఖర్చు భారాన్ని రుద్దారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 6న అసెంబ్లీ రద్దుచేసి అదేరోజు అభ్యర్థులను ప్రకటించడం వెనక ఆయన కోట్లాది రూపాయల పార్టీ ఫండ్‌ సమకూర్చుకున్న విషయం స్పష్టమవుతుందన్నారు. 18 ...

Read More »

తెలంగాణ అభివృద్ధి తెరాసతోనే సాధ్యం

రెంజల్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ఒక్క తెరాస పార్టీతోనే సాధ్యమని బోధన్‌ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌ అన్నారు. మండలంలోని దండిగుట్ట గ్రామంలో శనివారం తెరాస నాయకులు, కార్యకర్తలు బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టలేదని బోదన్‌ నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ది చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే షకీల్‌దేనన్నారు. కారు గుర్తుకు ...

Read More »

తెరాసను గెలిపించాలి

కామారెడ్డి రూరల్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఎన్నికల్లో తెరాసకు ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ కోరారు. సోమవారం పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీ శివారులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కెసిఆర్‌ చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కోటి ఎకరాలకు నీరు అందాలంటే కెసిఆర్‌ను గెలిపించాలన్నారు. వందలాది సంక్షేమ పథకాలను అందించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనన్నారు. జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనకే ఓటు వేయాలని కోరారు. 6,7,8వ ...

Read More »

బంగారు తెలంగాణ కోసం తెరాసను గెలిపించుకోవాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే తెరాసను గెలిపించుకోవాల్సిన అవసరముందని జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం తెరాస అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి తరఫున సోమవారం ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. సదాశివనగర్‌ మండలం మల్లుపేట గ్రామంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ఇంటింటికి తాగునీరు, సిసి రోడ్లు, నిరంతర విద్యుత్తు, అందరికి పింఛన్లు, ఎకరాకు 4 వేలు, రైతుబీమా తదితర సంక్షేమ కార్యక్రమాలతో కెసిఆర్‌ తెలంగాణ ...

Read More »

ఉద్యమకారులను విస్మరించిన తెరాస

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యమకారులను తెరాస పూర్తిగా విస్మరించిందని ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక కాంగ్రెస్‌ బవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకపాత్ర వహించిన విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యోగస్తులను, ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించి వారికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమం నీరు, నిదులు, నియామకాలపైనే సాగిందని అవన్ని ఇపుడు కల్వకుంట్ల కుటుంబానికి దక్కాయని ఆయన ఆరోపించారు. కెసిఆర్‌ కుటుంబం రాష్ట్ర అభివృద్దిని ...

Read More »

కుర్మ కులస్తులకు పార్టీలు సీట్లు కేటాయించాలి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలు కుర్మ కులస్తులకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని జిల్లా కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి చిన్నదేవన్న డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. తెరాస ప్రకటించిన 105 సీట్లలో ఒక్కరుగాని కుర్మ సామాజిక వర్గానికి చెందినవారు లేరని, రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న కుర్మ కులస్తులకు తెరాస ఒక్క సీటు కేటాయించకపోవడం ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం తెరాస శ్రేణులు కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కామారెడ్డి నియోజకవర్గ తెరాస అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్రంలో భారీ స్థానాలతో అధికారంలోకి వస్తుందని, గంప గోవర్ధన్‌ సైతం అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు బల్వంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రగతి నివేదన సభ పోస్టర్ల ఆవిష్కరణ

రెంజల్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చలో కొంగరకలాన్‌ ప్రగతి నివేదన సభ పోస్టర్లను మండల కేంద్రంలో తెరాస నాయకులు శుక్రవారం ఆవిష్కరించారు. ప్రగతి నివేదన సభకు మండలంలోని ప్రతి గ్రామం నుంచి తెరాస నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సభ విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మౌలానా, నీరడి రమేశ్‌, భూమారెడ్డి, మదన్‌, శేఖర్‌, రాము, రఫిక్‌, అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవని తద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్‌ ప్రగతిభవన్‌లో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల కంటి వెలుగు అవగాహన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరుపేదలకు దృష్టిలోపాన్ని నివారించడం, సవరించడం కోసం ఆగష్టు 15 నుంచి జనవరి 26 వరకు కంటి వెలుగు కార్యక్రమం ఇంటింటా వెలుగునిస్తుందని పేర్కొన్నారు. ...

Read More »

కార్మికుల సమస్యలపై తెరాసకు చిత్తశుద్దిలేదు

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల సమస్యల పట్ల తెరాసకు చిత్తశుద్ది లేదని రెవెల్యుషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్‌ఎస్‌పి) జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు విమర్శించారు. మాచారెడ్డి మండల కేంద్రంలో పారిశుద్య కార్మికులు చేపట్టిన సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామని వారిని క్రమబద్దీకరిస్తామని చెప్పి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు అనారోగ్యం బారిన ...

Read More »