Tag Archives: voters

ఓటరు నమోదు పారదర్శకతతో నిర్వహించాలి

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని జాగ్రత్తగా పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం ఆయన కామారెడ్డి మండలం పాతరాజంపేట, నరసన్నపల్లి గ్రామాలలోని పోలింగ్‌ బూతులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 2021 ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21, 22 తేదీలలో, వచ్చే డిసెంబర్‌ నెల 5, 6 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జిల్లాలోని అన్ని పోలింగ్‌ ...

Read More »

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి పరిశీలించారు. రెండవ రోజైన ఆదివారం ఆయన ప్రభుత్వ గిరిరాజ్‌ కళాశాల, ఎస్‌ఎఫ్‌ఎస్‌ విద్యాసంస్థలో పర్యటించి నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్‌ కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు, సిబ్బందితో నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ...

Read More »

ప్రత్యేక ఓటర్‌ నమోదు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం, ఆదివారం రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి శంకర్‌ భవన్‌, చైతన్య పబ్లిక్‌ స్కూల్‌ కేంద్రాలలో శనివారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్బంగా నమోదు కేంద్రాలకు వస్తున్న వారి వివరాలు, నమోదు ప్రక్రియ, ఏ రకమైన ఫారాలకు వస్తున్నారో బిఎల్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. 2021 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకునే ...

Read More »

శని, ఆదివారాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శని, ఆదివారాల్లో అనగా ఈనెల 21, 22 తేదీలలో ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన సంబంధిత అధికారులతో ఎస్‌ఎస్‌ఆర్‌ పై సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈనెల 21, 22 తేదీలలో 2021 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకునే ప్రతి ఒక్కరు కొత్తగా ఓటర్‌ నమోదుకు ...

Read More »

ఓటర్లు ప్రలోబాలకు గురికావద్దు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్లు ఎలాంటి ప్రలోబాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు సూచించారు. ఆదివారం తన చాంబరులో ఎన్నికల నోడల్‌ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రముఖుల ఫోటోలతో హోర్డింగ్‌లు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు, వివిధ వర్గాలతో అవగాహన ర్యాలీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్‌ సిబ్బందికి పోలింగ్‌రోజు దివ్యాంగులకు ఓటు వేసేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని అన్నారు. మండలం, గ్రామాల వారిగా ఆటోల వివరాలు అందజేయాలని రవాణా ...

Read More »

ఓటర్లకు అన్ని వసతులు కల్పిస్తాం

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు అన్ని వసతులు కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. సోమవారం బీంగల్‌ ఎంపిపి కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని వేల్పూర్‌, బీంగల్‌ ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. పోలింగ్‌ స్టేషన్లో కొన్ని చిన్న వసతులు లేనందున పోలింగ్‌ నాటికి అన్ని వసతులు అందుబాటులోకి తెస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఈసారి ఎన్నికల్లో విభిన్నంగా వీవీప్యాట్ల ద్వారా కొత్తగా నిర్వహించనున్నందున ఓటర్లకు అవగాహన కల్పించేందుకు నియోజకవర్గానికి ఒక ...

Read More »

ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటి కమీషనర్‌ సందీప్‌ సక్సెనా అన్నారు. శుక్రవారం స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌లో భాగంగా న్యూఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌తో పాటు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సక్సెనా మాట్లాడుతూ ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా రెండు కిలోమీటర్ల పరిదిలో ఒక పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ...

Read More »

18 ఏళ్ళు నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలి

  నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7, 14వ తేదీ ఆదివారాల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినందున 18 సంవత్సరాలు నిండిన, వారు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకోనివారు బూత్‌స్థాయి వద్దకు వెళ్లి నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. ఓటరు నమోదు కొరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్దేశించిన ప్రకారంగా జిల్లాలోని బూతుస్థాయి అధికారి వద్దకెళ్లి నమోదు చేసుకోవాలన్నారు. ఎవ్వరైన అర్హులై ఉండి వారిపేర్లు నమోదు కాకపోతే, ...

Read More »

ఓటర్‌ జాబితాలో పేర్ల గల్లంతుకు బాధ్యులెవరు

  బీర్కూర్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామంలో 7,8,9,10, 11,12 వార్డుల్లో ఓటరు జాబితాలో పేర్ల గల్లంతుకు బాధ్యులెవరని బీర్కూర్‌ ఎంపిటిసి-2 సుధాకర్‌ యాదవ్‌ డిప్యూటి తహసీల్దార్‌ వరప్రసాద్‌తో వాగ్వాదానికి దిగారు. ఓటరు జాబితాలో పేర్లు ఎలా పోతాయని, దానికి బాధ్యులెవరో తెలియజేయాలని మంగళవారం డిప్యూటి తహసీల్దార్‌ను నిలదీశారు. మూడురోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఆయన మాట ఇవ్వడంతో శాంతించారు. మూడు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ...

Read More »